venkatadri
-
Khelo India Youth Games: వెంకటాద్రి పసిడి గురి.. ఏపీ ఖాతాలో మరో స్వర్ణం
పంచ్‌కుల(హరియాణా): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకం లభించాయి. ఆర్చరీలో అండర్–18 పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కుందేరు వెంకట్రాది బంగారు పతకం సొంతం చేసుకోగా... అండర్–18 మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మాదల సూర్య హంసిని కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో వెంకటాద్రి 144–141తో కోర్డె పార్థ్ సునీల్ (మహారాష్ట్ర)పై విజయం సాధిం చాడు. సెమీఫైనల్లో వెంకటాద్రి 147–146తో ప్రథమేశ్ (మహారాష్ట్ర)పై, క్వార్టర్ ఫైనల్లో 147–145తో పెండ్యాల త్రినాథ్ చౌదరీ (ఆంధ్రప్రదేశ్)పై గెలుపొందాడు. కాంస్య పతక పోరులో సూర్య హంసిని 143–141తో అంతర్జాతీయ క్రీడాకారిణి పరిణీత్ కౌర్ (పంజాబ్)ను ఓడించింది. ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 14వ స్థానంలో ఉంది. చదవండి: Rishabh Pant: అదే మా పొరపాటు.. అందుకే ఓడిపోయాం.. ఇక మూడింటికి మూడు గెలవాల్సిందే! -
Ravipudi Venkatadri: వంద వసంతాల హేతువాది
హేతువాద ఉద్యమానికి తెలుగునాట ప్రాచుర్య ప్రాశస్త్యాలను తీసుకువచ్చినవారు రావిపూడి వేంకటాద్రి. ఆయన నేడు 100 వసంతాలను పూర్తిచేసుకుని 101వ ఏట అడుగుపెడుతున్నారు. ఇది వ్యక్తిగతంగా ఆయనకూ, ఉద్యమపరంగా సమాజానికీ ఒక చారిత్రక ఘట్టం. 1922 ఫిబ్రవరి 9న ప్రకాశం జిల్లా నాగండ్లలో జన్మించిన వేంకటాద్రి 1943లో తన 21వ ఏటనే స్వగ్రామంలో ‘కవిరాజాశ్రమం’ స్థాపించారు. అంత చిన్నవయసులోనే సామాజిక, హేతువాద ఉద్యమాల ప్రముఖనేతలను తమ గ్రామానికి ఆహ్వానించి, ఉపన్యాసాలు ఇప్పించి, ప్రజల్లో చైతన్యబీజాలు నాటారంటే రావిపూడి శక్తిని అంచనా వేసుకోవచ్చు. అంతేకాదు. తన అభిమానకవి, ప్రముఖ హేతువాది త్రిపురనేని రామస్వామి పేర ‘కవిరాజు ట్యుటోరియల్స్’ స్థాపించి, మిత్రులతో కలిసి యువతలో శాస్త్రీయమైన ఆలోచనలను పెంచిన ఘనత కూడా వీరికే దక్కుతుంది. హేతువాద, మానవవాద, నాస్తికవాదాల గురించి 100కు పైగా ప్రామాణిక రచనలు చేశారు. ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళటానికి పత్రిక అవసరం గుర్తించి ‘హేతువాది’ మాసపత్రికను స్థాపించారు. నాటి నుండి నేటి వరకు నలభై ఏళ్లుగా సంపాదకులుగా వ్యవహరిస్తూ పత్రికను నిరాటంకంగా నడుపుతున్నారు. 76 ఏళ్ల క్రితం 1946లో ‘విశ్వాన్వేషణ’తో రచనా ప్రస్థానం ప్రారంభించి ఫిబ్రవరి 9, 2022న ఆవిష్కరిస్తున్న ‘లోకాయత చార్వాకం’తో 109 రచనలు చేసిన శతాధిక గ్రంథకర్తగా సరికొత్త రికార్డును సృష్టించారు వందేళ్ల రావిపూడి. (Bharat Bhushan: ఆదర్శ జీవితానికి కొలమానం) తెలుగునాట వందలమందిని శిష్యులుగా, ఉద్యమాభిమానులుగా తీర్చిదిద్దారు. హేతువాదులు సమాజహిత వాదులని నిరూపించారు. మానవతావాదం కంటే మానవవాదం ముఖ్యమనే సరికొత్త భావజా లాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. మూక ఉద్యమాలు, మూస ఉద్యమాలు ప్రజల్లో మాస్ హిస్టీరియాను పెంచుతాయనీ, హేతువాద, మానవవాదాలు ప్రజలను ఆలోచనా మార్గంలో నడుపుతాయనీ అంటారు రావిపూడి. మాస్టారును పద్మశ్రీలు వరించక పోవచ్చు. ఆయనకు గౌరవ డాక్టరేట్లు రాకపోవచ్చు. కానీ వందేళ్ల ఆయన అలుపెరుగని జీవితం సమాజానికి తరగని ఆస్తి. దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిదీ! (Bhimsen Joshi: శతవసంత స్వరమాధురి) – బీరం సుందరరావు హేతువాద ఉద్యమ నాయకులు (నేడు రావిపూడి వేంకటాద్రి 101వ జన్మదినోత్సవం) -
బ్రహ్మంగారి మఠంపై కుదిరిన సయోధ్య
మైదుకూరు: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఠాధిపతి ఎంపికలో స్పష్టత వచ్చింది. స్థానిక పెద్దలతో పాటు కొందరు మండల స్థాయి నేతలు శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య జరిపిన రాజీ యత్నాలు ఫలించాయి. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామిని ఎంపిక చేశారు. ఉత్తరాధికారిగా రెండవ కుమారుడు వీరభద్ర స్వామిని నియమించాలని నిర్ణయించారు. భవిష్యత్ వారసులుగా రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ కుమారుల్లో ఒకరిని పీఠాధిపతిగా నియమించాలని నిర్ణయించారు. ఉదయం నుంచి ఇరు కుటుంబాలతో జరిపిన చర్చల్లో అందరూ ఒక అంగీకారానికి వచ్చారు. ఈ నిర్ణయాన్ని శనివారం కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దలు ప్రకటిస్తారు. అలాగే, త్వరలో పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. నేడు దేవదాయశాఖ సంయుక్త కమిషనర్ రాక పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి శనివారం దేవదాయశాఖ సంయుక్త ప్రాంతీయ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ రానున్నారు. మఠం ఆచారాలు, ప్రస్తుత పరిస్థితులు, కందిమల్లాయపల్లె గ్రామ ప్రజల అభిప్రాయాలను ఆయన తెలుసుకుంటారు. అనంతరం దేవదాయ శాఖ మంత్రికి నివేదక అందిస్తారని దేవాలయం ఫిట్ పర్సన్, అసిస్టెంట్ కమిషనర్ శంకర్‌బాలాజీ తెలిపారు. -
3 నైట్స్/4 డేస్... ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
కాచిగుడ : తిరుమల తిరుపతి వెంకటేశుని దర్శించుకోవాలని చాలా మందికి ఎంతో ఆశగా ఉంటుంది. ఈ దేవుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. తాజాగా హైదరాబాద్ నుంచి వెంకటేశుని దర్శించుకోవడానికి వెళ్లాలనుకునే వారికి దేశీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కాచిగుడా నుంచి రూ.5400 ప్రారంభ ధరకు నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ ప్రారంభమవుతుందని ట్వీట్ ద్వారా తెలియజేసింది. బాలాజి దేవస్థానంతో పాటు ఆ పక్కనే దగ్గరిలో ఉన్న కాణిపాక వినాయక దేవాలయం, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వంటివి ఈ ప్యాకేజీలో భాగంగా దర్శించుకుని రావచ్చట. మూడు రోజులు, నాలుగు రోజులు కలిగిన ఈ టూర్ ప్యాకేజీ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ‘వెంకటాద్రి’ పేరుతో ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ‘వెంకటాద్రి’ టూర్ ప్యాకేజీ వివరాలు... ఈ టూర్ ప్యాకేజీలో కవర్ చేసే గమ్యస్థలం తిరుపతి. ట్రైన్, రోడ్డు మార్గన ప్రయాణానికి ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. ప్రతి శుక్రవారం రాత్రి 8.05లకు కాచిగుడ రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది. 3 ఏసీ, స్లీపర్ క్లాస్ టిక్కెట్లు ఈ ఆఫర్ కింద అందుబాటులో ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ కింద ఒక్కో వ్యక్తి ఈ టూర్ ఖర్చు రూ.5750 అవుతుంది. కంపోర్ట్ క్లాస్ కింద టూర్ ఖర్చు ఒక్కో వ్యక్తికి రూ.9038 అవుతుంది. యాత్రికులు/పర్యాటకులందరూ కూడా తమ వెంట ఒరిజినల్ ఐడీ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించకపోతే, టీటీడీ సిబ్బంది భక్తులను వెంకటేశుడి దర్శనానికి అనుమతించరు. -
అప్పుల బాధలో మరో కార్మికుడు ఆత్మహత్య
మదనపల్లి : చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని నీరుగట్టుపల్లి మారుతీనగర్‌లో నివసిస్తున్న వెంకటాద్రి (30) అనే చేనేత కార్మికుడు శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా రొద్దం మండలం సానిపల్లికి చెందిన వెంకటాద్రికి భార్యా పిల్లలు ఉన్నారు. అయితే అక్కడ రెండు లక్షల వరకూ అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేక భార్యాపిల్లలను అక్కడే వదిలేసి ప్రియురాలితో మదనపల్లి చేరి చేనేత కార్మికునిగా పని చేసేవాడు. అయితే ఐదు రోజుల క్రితం ప్రియురాలు వెళ్లిపోవడంతో మనస్థాపం చెందిన వెంకటాద్రి అప్పులు తీర్చే మార్గం తోచక ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డెంగ్యూతో విద్యార్థి మృతి
డెంగ్యూతో బాధపడుతున్న విద్యార్థి చికిత్స పొందుతు మృతిచెందాడు. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం పాలంపాడు గ్రామానికి చెందిన రాపూరి వెంకటాద్రి(13) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో గత నెల రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు చెన్నై ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తుండగా.. కొద్ది సేపటి క్రితం మృతిచెందాడు. -
హామీలు ఏమయ్యాయి?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అర్హులైన నిరుపేదలందరికీ స్థలాలు పంపిణీ చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గ్రామీణ పేదల సంఘం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పేదలకు 125గజాల స్థలంలో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఈ ప్రక్రియను త్వరితంగా ప్రారంభించాలని డిమాండ్ చేసింది. ఇళ్లు, స్థలాలను కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆ సంఘం ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రి మాట్లాడుతూ పేదలకు గూడు కల్పించాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో ఎన్నోసార్లు ఉద్యమాలు చేపట్టామని, కానీ ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలే అయ్యాయని అన్నారు. హయత్‌నగర్ మండలంలోని వేల ఎకరాల భూములు సంఘీ, రామోజీరావు గుప్పి ట్లో ఉన్నాయని, వారినుంచి చట్ట ప్రకా రం భూములను వెనక్కు తీసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తు తం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరుణం లో కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు పక్కాగా అమలు చేయాలన్నారు. ధర్నా లో భాగంగా కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జనాలు పెద్ద సంఖ్యలో రావడం, మరోవైపు కలెక్టరేట్ ఎదుట మెట్రోరైలు పనులు జరుగుతున్నందున పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. అధికారులు వచ్చేవరకు ధర్నాను ఆపేదిలేదని తేల్చడంతో.. జిల్లా రెవెన్యూ అధికారి సూర్యారావు వారి వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. పేదల డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇచ్చారు. -
83 పోస్టులకు 37,984 మంది..పంచాయతీ కార్యదర్శి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదివారం రాత పరీక్షలు నిర్వహించనుంది. జిల్లాలోని 83 పోస్టులకుగాను 37,984 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం డివిజ న్లలో 96 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని, పరీక్ష ప్రారంభమైన పది నిమిషాల వరకు లోపలికి అనుమతిస్తామని, ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జనరల్ స్టడీస్, అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రూరల్ డెవలప్మెంట్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్లకు, రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లకు ఏపీపీఎస్సీ అధికారి వెంకటాద్రి ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాలు జిల్లా ఖజానా కార్యాలయంలో భారీ భద్రత మధ్య ఉంచారు. పరీక్షకేంద్రాల వద్ద జిరాక్స్, బుక్‌స్టాల్స్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలకు అభ్యర్థులు సకాలంలో హాజరయ్యేందుకు ప్రత్యేక బస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచినీరు, మెడికల్ కిట్లు అందుబాటు లో ఉంచాలని జేసీ సురేంద్రమోహన్ వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు 22 రూట్లను విభజించారు. వాటిలో ఖమ్మంలో 77 సెంటర్లకు 17 రూట్లు, కొత్తగూడెంలో 19 సెంటర్లకు 5 రూట్లను ఏర్పాటు చేశారు. పరీక్షలకు ఫ్లయింగ్ స్క్వాడ్‌గా రెవెన్యూ డివిజన్ అధికారులను నియమించారు. జిల్లావ్యాప్తం గా 27మంది లైజన్ అధికారులు, 96 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులు, 96 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1739 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఖమ్మంలో 1463 మంది, కొత్తగూడెంలో 276మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణను కో-ఆర్డినేటర్‌గా నియమించారు. జిల్లాలో మొత్తం 16మంది అంధులు పరీక్షలకు హాజరవుతున్నారు. వారిలో ఆరుగురు కొత్తగూడెంలో, పదిమంది ఖమ్మంలో పరీక్షలు రాయనున్నారు. వీరికి లేఖకులను సహాయం గా తెచ్చుకునే అవకాశం కల్పించారు. అయితే పరీక్షకేంద్రాల్లో అదే పాఠశాలలు, కళాశాలలకు చెందిన సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా నియమించారని, అక్కడ అవకతవకలు జరిగే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆయా కళాశాలల్లో పరీక్షలకు ముందు ఇన్విజిలేటర్లకు డ్రా ద్వారా గదులు కేటాయిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. -
ఐదుగురిపై అట్రాసిటీ కేసు నమోదు
ఆర్మూర్ అర్బన్, న్యూస్‌లైన్: పట్టణంలోని రాజారాంనగర్‌కు చెందిన నాగశ్రీ అ నే మహిళను కులం పేరుతో దూషించిన ఘటనలో వెంకటాద్రి, సత్యవతి, మురళి, రమేష్, చారిపై ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఆకుల రామ్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గోవింద్‌పేట్ గ్రామానికి చెందిన రవికి పట్టణానికి చెందిన నాగశ్రీతో 14 ఏళ్ల క్రితం కులాంతర వివాహం జరిగింది. నాగశ్రీ ఎస్టీ వర్గానికి చెందిన మహిళ, కాగా ఇటీవల రవి, నాగశ్రీ ఆస్తులు పంచాలని రవి తల్లితండ్రులు వెంకటాద్రి, సత్యవతిని కోరారు. దీంతో వారు మురళి, రమేష్, చారీని సంప్రదించారు. అందరూ కలిసి మాట్లాడుతున్న సమయంలో తనను కులం పేరుతో దూషించారని నాగశ్రీ పైన పేర్కొన్న వారిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.