కాచిగుడ : తిరుమల తిరుపతి వెంకటేశుని దర్శించుకోవాలని చాలా మందికి ఎంతో ఆశగా ఉంటుంది. ఈ దేవుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. తాజాగా హైదరాబాద్ నుంచి వెంకటేశుని దర్శించుకోవడానికి వెళ్లాలనుకునే వారికి దేశీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కాచిగుడా నుంచి రూ.5400 ప్రారంభ ధరకు నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ ప్రారంభమవుతుందని ట్వీట్ ద్వారా తెలియజేసింది. బాలాజి దేవస్థానంతో పాటు ఆ పక్కనే దగ్గరిలో ఉన్న కాణిపాక వినాయక దేవాలయం, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వంటివి ఈ ప్యాకేజీలో భాగంగా దర్శించుకుని రావచ్చట. మూడు రోజులు, నాలుగు రోజులు కలిగిన ఈ టూర్ ప్యాకేజీ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ‘వెంకటాద్రి’ పేరుతో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
‘వెంకటాద్రి’ టూర్ ప్యాకేజీ వివరాలు...
- ఈ టూర్ ప్యాకేజీలో కవర్ చేసే గమ్యస్థలం తిరుపతి.
- ట్రైన్, రోడ్డు మార్గన ప్రయాణానికి ఈ ప్యాకేజీ వర్తిస్తుంది.
- ప్రతి శుక్రవారం రాత్రి 8.05లకు కాచిగుడ రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది.
- 3 ఏసీ, స్లీపర్ క్లాస్ టిక్కెట్లు ఈ ఆఫర్ కింద అందుబాటులో ఉంటాయి.
- స్టాండర్డ్ క్లాస్ కింద ఒక్కో వ్యక్తి ఈ టూర్ ఖర్చు రూ.5750 అవుతుంది. కంపోర్ట్ క్లాస్ కింద టూర్ ఖర్చు ఒక్కో వ్యక్తికి రూ.9038 అవుతుంది.
- యాత్రికులు/పర్యాటకులందరూ కూడా తమ వెంట ఒరిజినల్ ఐడీ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించకపోతే, టీటీడీ సిబ్బంది భక్తులను వెంకటేశుడి దర్శనానికి అనుమతించరు.
Comments
Please login to add a commentAdd a comment