ట్రైన్ జర్నీ చేసే చాలామంది కొన్ని సందర్భాల్లో ఫుడ్ కోసం ఇబ్బందిపడే ఉంటారు. అధిక ధరలు లేదా నాణ్యత లేకపోవడం వంటివి నిజ జీవితంలో ఎదురై ఉండే అవకాశం ఉంది. అయితే ఇలాంటి వాటికి 'ఐఆర్‌సీటీసీ' (IRCTC) చరమగీతం పాడటానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ప్రయాణికుల కోసం రైల్వే ఓ కొత్త విధానం తీసుకువచ్చింది. సరసమైన ధరతోనే ప్రయాణికులకు మంచి భోజనం అందించాలనే సదుద్దేశ్యంతో రైల్వే బోర్డు ఇప్పటికే డివిజనల్ యూనిట్లకు 'రైల్వేస్ జనతా ఖానా' ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ కేవలం 'నార్త్ వెస్ట్రన్ రైల్వే జైపూర్ జంక్షన్'లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సదుపాయం రానున్న రోజుల్లో మరింత విస్తరించడానికి ప్రణాళికలు చేపడుతున్నారు.
(ఇదీ చదవండి: బీచ్‌లో చిల్ అవుతున్న మస్క్, జుకర్‌బర్గ్.. ఏంటి, కలిసిపోయారా?)
రైల్వేస్ జనతా ఖానా..
ఐఆర్‌సీటీసీ ఈ ఫుడ్ రెండు కేటగిరీలలో అందించనుంది. 7 పూరీలు (175 గ్రామ్స్), పొటాటో వెజిటేబుల్స్ (150 గ్రామ్స్), ఊరగాయ (12 గ్రామ్స్) వంటివి కేవలం రూ. 20 మాత్రమే. అయితే రూ. 50 కాంబో ప్యాక్‌లో 350 గ్రామ్స్ రాజ్మా లేదా రైస్, పాప్ బాజీ, మసాలా దోశ, కిచిడి మొదలైనవి ఉంటాయి. ఇక 200 మీలీ వాటర్ బాటిల్ ఖరీదు కేవలం రూ. 3 మాత్రమే. ఈ కొత్త విధానం సమర్థవంతంగా సాగితే ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment