ఐదుగురిపై అట్రాసిటీ కేసు నమోదు | atrocity case registered on five persons | Sakshi
Sakshi News home page

ఐదుగురిపై అట్రాసిటీ కేసు నమోదు

Published Mon, Jan 20 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

atrocity case registered  on five persons

ఆర్మూర్ అర్బన్, న్యూస్‌లైన్: పట్టణంలోని రాజారాంనగర్‌కు చెందిన నాగశ్రీ అ నే మహిళను కులం పేరుతో దూషించిన ఘటనలో వెంకటాద్రి, సత్యవతి, మురళి, రమేష్, చారిపై ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఆకుల రామ్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గోవింద్‌పేట్ గ్రామానికి చెందిన రవికి పట్టణానికి చెందిన నాగశ్రీతో 14 ఏళ్ల క్రితం కులాంతర వివాహం జరిగింది.

నాగశ్రీ ఎస్టీ వర్గానికి చెందిన మహిళ, కాగా ఇటీవల రవి, నాగశ్రీ ఆస్తులు పంచాలని రవి తల్లితండ్రులు వెంకటాద్రి, సత్యవతిని కోరారు. దీంతో వారు మురళి, రమేష్, చారీని సంప్రదించారు. అందరూ కలిసి మాట్లాడుతున్న సమయంలో తనను కులం పేరుతో దూషించారని నాగశ్రీ పైన పేర్కొన్న వారిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement