nagasri
-
పిడుగుపాటుకు ముగ్గురు బలి
దమ్మపేట/హుజూరాబాద్ రూరల్/లోకేశ్వరం: భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లో పిడుగుల కారణంగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. భద్రాద్రిజిల్లా దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీ పరిధి బూర్గుగుంపు గ్రామానికి చెందిన కట్టం నాగశ్రీ (21), సున్నం అనూష (23) మరికొందరితో కలిసి జగ్గారం శివారు అరటి తోటలో కూలి పనికి వెళ్లారు. మధ్యాహ్నం నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో త్వరగా పనులు ముగించుకొని బయలుదేరిన క్రమంలో వారు నిల్చున్న చోటే పిడుగు పడింది.దీంతో నాగశ్రీ, అనూష ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. సీతమ్మ, ఊకే రత్తమ్మ, కల్లూరి రాజమ్మ తీవ్ర అస్వస్థతకు గురికాగా సత్తుపల్లి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. మరోఘటనలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన రైతు కంకణాల కృష్ణకుమార్ (33) పిడుగుపాటుతో మృతిచెందాడు. కృష్ణకుమార్ తన పాడి గేదెలను తీసుకొని గ్రామ శివారులోని మైదానంలో మేపుతుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురికావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పిడుగుపాటుకు కాడెడ్లు మృతి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాయాపూర్ కాండ్లీకి చెందిన రైతు ఆరె లింగురాం పటేల్‌కు చెందిన కాడెడ్లు, లేగదూడ సోమవారం రాత్రి పిడుగుపాటుతో మృతిచెందాయి. లింగురాం తనకున్న ఐదెకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా పంటలు సాగుచేశాడు. సోమవారం ఉదయం కాడెడ్లను చేను వద్దకు తీసుకెళ్లాడు. పనులు పూర్తయ్యాక సాయంత్రం ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటిపక్కనే వాటిని కట్టేసి రాత్రి నిద్రపోయాడు. అర్ధరాత్రి పిడుగు పడటంతో కాడెడ్లతోపాటు లేగదూడ మరణించాయి. ఆర్ఐ బాలకిషన్ పంచనామా నిర్వహించారు. -
ఐదుగురిపై అట్రాసిటీ కేసు నమోదు
ఆర్మూర్ అర్బన్, న్యూస్‌లైన్: పట్టణంలోని రాజారాంనగర్‌కు చెందిన నాగశ్రీ అ నే మహిళను కులం పేరుతో దూషించిన ఘటనలో వెంకటాద్రి, సత్యవతి, మురళి, రమేష్, చారిపై ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఆకుల రామ్‌రెడ్డి ఆదివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గోవింద్‌పేట్ గ్రామానికి చెందిన రవికి పట్టణానికి చెందిన నాగశ్రీతో 14 ఏళ్ల క్రితం కులాంతర వివాహం జరిగింది. నాగశ్రీ ఎస్టీ వర్గానికి చెందిన మహిళ, కాగా ఇటీవల రవి, నాగశ్రీ ఆస్తులు పంచాలని రవి తల్లితండ్రులు వెంకటాద్రి, సత్యవతిని కోరారు. దీంతో వారు మురళి, రమేష్, చారీని సంప్రదించారు. అందరూ కలిసి మాట్లాడుతున్న సమయంలో తనను కులం పేరుతో దూషించారని నాగశ్రీ పైన పేర్కొన్న వారిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.