పంచ్‌కుల (హరియాణా): ‘ఖేలో ఇండియా’ యూత్ గేమ్స్‌లో గురువారం తెలంగాణకు 2 కాంస్యాలు, ఆంధ్రప్రదేశ్‌కు ఒక కాంస్యం లభించాయి. బాలికల 200 మీటర్ల పరుగులో నకిరేకంటి మాయావతి కాంస్యం గెలుచుకుంది. 24.94 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో సుదేష్ణ (మహారాష్ట్ర–24.29 సె.), అవంతిక (మహారాష్ట్ర–24.75 సె.) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు.
బాలుర 200 మీటర్ల పరుగులో తెలంగాణకు చెందిన అనికేత్ చౌదరి (22.27 సె.) మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకున్నాడు. ఆర్యన్ కదమ్ (మహారాష్ట్ర–21.82 సె.), ఆర్యన్ ఎక్కా (ఒడిషా–22.10 సె.) మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. బాలికల వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్. గాయత్రి కాంస్య పతకం గెలుచుకుంది. 81 ప్లస్ కేజీల కేటగిరీలో గాయత్రి 160 కిలోల బరువెత్తింది. ఈ విభాగంలో మార్టినా దేవి (మణిపూర్–186 కేజీలు), కె.ఒవియా (తమిళనాడు–164 కేజీలు) స్వర్ణం, రజతం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment