
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ (టీఆర్‌ఏ)కు ప్రాతినిధ్యం వహించిన ధనుశ్ శ్రీకాంత్ అదరగొట్టాడు. మహారాష్ట్రలోని పుణేలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్ ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో అతను స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు. శుక్రవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ పురుషుల కేటగిరీలో బధిరుడైన ధనుశ్ 248.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. గోవాకు చెందిన యశ్ యోగేశ్ (247.6 పాయింట్లు) రన్నరప్‌గా నిలవగా, పుణేకు చెందిన అర్జున్ (225.6 పాయింట్లు) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.
యశ్‌వర్మకు కాంస్యం
ఇదే టోర్నీ స్విమ్మింగ్ ఈవెంట్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన యశ్ వర్మ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అండర్–21 బాలుర 400 మీ. మెడ్లే ఈవెంట్‌లో యశ్ వర్మ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment