ప్రణయ్, రుచిత, ఆశీర్వాద్
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారుల తమ పతకాల వేట కొనసాగిస్తున్నారు. భోపాల్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో శనివారం అథ్లెటిక్స్ బాలుర ట్రిపుల్ జంప్‌లో తెలంగాణ ప్లేయర్ కొత్తూరి ప్రణయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా.. బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో నామాయి రుచిత రజత పతకాన్ని గెల్చుకుంది. శుక్రవారం 1500 మీటర్ల రేసులో సుమిత్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
శనివారం జరిగిన జూనియర్ పురుషుల సైక్లింగ్ కెరిన్ రేసు వ్యక్తిగత విభాగంలో ఆశీర్వాద్ సక్సేనా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. బ్యాడ్మింటన్‌లో అండర్–19 బాలుర సింగిల్స్ విభాగంలో కె.లోకేశ్ రెడ్డి తెలంగాణకు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో లోకేశ్ రెడ్డి 21–19, 15–21, 22–20తో అభినవ్ ఠాకూర్ (పంజాబ్)పై గెలుపొందాడు. బాక్సింగ్‌లో బాలుర 51 కేజీల విభాగంలో బిలాల్... బాలికల 75 కేజీల విభాగంలో గుణనిధి పతంగె కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో ప్రస్తుతం తెలంగాణ పది పతకాలతో 14వ ర్యాంక్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment