ruchita
-
కుటుంబంతో కలిసి చూడొచ్చు
‘‘ప్రేమ్ కుమార్’ చిత్రం ఆద్యంతం వినోద భరితంగా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. ఈ మూవీలో నేను, నా వైఫ్ అతిథి పాత్రల్లో కనిపిస్తాం’’ అని దర్శకుడు అభిషేక్ మహర్షి అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లో ‘ప్రేమ్ కుమార్’ కథ సెట్ అయింది. ‘కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే’ సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాశాను. సినిమాల్లో పెళ్లి సీన్ లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్ పెళ్లి ఆపుతాడు. తర్వాత హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? చెప్పేందుకే ‘ప్రేమ్ కుమార్’ తీశాం. శివ ప్రసాద్‌గారికి సినిమాలపై ఎంతో ప్యాషన్ ఉంది’’ అన్నారు. -
కుటుంబంతో కలిసి చూడొచ్చు – దర్శకుడు అభిషేక్ మహర్షి
‘ప్రేమ్ కుమార్’ చిత్రం ఆద్యంతం వినోద భరితంగా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. ఈ మూవీలో నేను, నా వైఫ్ అతిథి పాత్రల్లో కనిపిస్తాం’’ అని దర్శకుడు అభిషేక్ మహర్షి అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లో ‘ప్రేమ్ కుమార్’ కథ సెట్ అయింది. ‘కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే’ సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాశాను. సినిమాల్లో పెళ్లి సీన్స్ లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్స్ పెళ్లి ఆపుతాడు. తర్వాత హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? చెప్పేందుకే ‘ప్రేమ్ కుమార్’ తీశాం. శివ ప్రసాద్‌గారికి సినిమాలపై ఎంతో ష్యాషన్ ఉంది’’ అన్నారు. -
నవ్వించే ప్రేమ్‌కుమార్
సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకత్వంలో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘దర్శక–నిర్మాతలు నమ్మడంవల్లే ఈ సినిమా ఇంత దూరం వచ్చింది. నా సినిమాల్లో నటించిన అభిషేక్ దర్శ కుడు అవుతాడని ఊహించలేదు. భవిష్యత్‌లో హ్యూమర్‌కి తనో బ్రాండ్ అవుతాడనిపిస్తోంది. ‘ప్రేమ్‌కుమార్’ రెండు గంటలు నవ్వించే చిత్రమవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా చూస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ గుర్తొస్తారు. బయట మనం ఎలా ఉంటామో అవే ΄ాత్రలను ఈ సినిమాలో చూస్తాం’’ అన్నారు అభిషేక్ మహర్షి. ‘‘ప్రేక్షకు లను నవ్వించాలని చేసిన సినిమా ఇది’’ అన్నారు శివ ప్రసాద్. -
Khelo India Youth Games: ప్రణయ్‌కు పసిడి పతకం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారుల తమ పతకాల వేట కొనసాగిస్తున్నారు. భోపాల్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో శనివారం అథ్లెటిక్స్ బాలుర ట్రిపుల్ జంప్‌లో తెలంగాణ ప్లేయర్ కొత్తూరి ప్రణయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా.. బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో నామాయి రుచిత రజత పతకాన్ని గెల్చుకుంది. శుక్రవారం 1500 మీటర్ల రేసులో సుమిత్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన జూనియర్ పురుషుల సైక్లింగ్ కెరిన్ రేసు వ్యక్తిగత విభాగంలో ఆశీర్వాద్ సక్సేనా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. బ్యాడ్మింటన్‌లో అండర్–19 బాలుర సింగిల్స్ విభాగంలో కె.లోకేశ్ రెడ్డి తెలంగాణకు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో లోకేశ్ రెడ్డి 21–19, 15–21, 22–20తో అభినవ్ ఠాకూర్ (పంజాబ్)పై గెలుపొందాడు. బాక్సింగ్‌లో బాలుర 51 కేజీల విభాగంలో బిలాల్... బాలికల 75 కేజీల విభాగంలో గుణనిధి పతంగె కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో ప్రస్తుతం తెలంగాణ పది పతకాలతో 14వ ర్యాంక్‌లో ఉంది. -
నా చెల్లిని కాపాడుకోలేకపోయా..
వెల్దుర్తి : అభం..శుభం తెలియని 16 మంది చిన్నారులను బలిగొన్న మాసాయిపేట రైలు దుర్ఘటన జరిగి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం తూప్రాన్ మండలం వెంకటాయపల్లి, కిష్టాపూర్, గుండ్రెడిపల్లి, ఇస్లాం పూర్ గ్రామాలకు చెందిన మృతుల తల్లిదండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున మాసాయిపేట రైల్వే క్రాసింగ్‌కు చేరుకున్నారు. ఘటనా స్థలంలో చిన్నారుల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్ద కన్నీటితో నివాళులర్పించారు. పిల్లల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. చిన్నారుల చిత్రపటాలను చూస్తూ వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు రోదనలతో అంతా చలించిపోయారు. మొదట గ్రామ సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ సిద్దిరాంలుగౌడ్, మాజీ సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ నర్సింహులు, ఎమ్మార్పీఎస్‌జిల్లా ఇంచార్జ్ యాదగిరిలతో పాటు స్థానిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, యువకులు పాఠశాల నుంచి సంఘటన స్థలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వెల్దుర్తి : పట్టాలపై బస్సు ఆగిపోయింది. మృత్యువు రూపంలో రైలు దూసుకురాగా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇద్దరిని రక్షించింది విద్యార్థిని రుచిత. తమ్ముడు వరుణ్‌గౌడ్, చెల్లి శృతి తో కలిసి ప్రయాణిస్తున్న రుచిత స్కూల్ బస్సు రైలు పట్టాలపై ఆగిపోయిన వెంటనే బస్సులోని సద్భావనదాసు, మహిపాల్‌రెడ్డి అనే ఇద్దరు పిల్లలను కిటికిలో నుంచి బయటకు తోసివేసింది. తన తమ్ముడు వరుణ్గౌడ్ను కూడా బయటకు తోసివేసేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు.. ఇంతలోనే మృత్యు శకటం బస్సును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రుచిత రెండు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చింది. వరుణ్‌గౌడ్ నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి బయటపడగా రుచిత చెల్లి శృతి ప్రమాదంలో మృతి చెంది. ఇద్దరు పిల్లలను రక్షించిన నేను నా చెల్లిని కాపాడుకోలేకపోయానంటూ కంటతడి పెట్టింది రుచిత. నా సాహసాన్ని గుర్తించిన సాక్షి టీవీ యాజమాన్యం ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తాత వద్దకు తీసుకువెళ్లింది. తాతా మా వైద్యం కోసం కొంత డబ్బు ఇచ్చాడంటూ తన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది. కాగా ఇద్దరు చిన్నారులను కాపాడిన రుచితకు సాహస బాలిక అవార్డు ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
చిట్టి తల్లి తెగువ!
►రైలు ప్రమాద ఘటనలో సమయస్ఫూర్తి చూపిన చిన్నారి ►ఇద్దరిని కాపాడి తానూ ప్రాణాలతో బయటపడిన రుచిత ►గాయాల నుంచి కోలుకుని ఇంటికి చేరిన బాలిక సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘మృత్యువు తరుముకొస్తోంది.. చావుబతుకుల మధ్య కేవలం 22 సెకన్లే.. అయినా ఓ చిన్నారి అత్యంత ధైర్యసాహసాలను, అంతకు మించి సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. ఎంతటి తెగువ చూపింది అంటే..! గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన మృత్యువే ఆమె ధైర్యం ముందు మోక రిల్లింది. జూలై 24న మాసాయిపేట లెవల్ క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనలో ఆ చిట్టితల్లి ఇద్దరు చిన్నారులను బస్సులోంచి తోసేసి వారి ప్రాణాలు కాపాడి తాను కూడా ప్రాణాలతో బయటపడింది. ఆ సాహస బాలిక పేరే రుచితగౌడ్. వెంకటాయపల్లికి చెందిన మల్లాగౌడ్, లత దంపతుల కూతురు రుచితగౌడ్. మూడో తరగతి చదువుతోంది. ప్రమాదం జరిగిన రోజు డ్రైవర్ వెనకాల మూడో సీట్లో కూర్చుంది. 20 సెకన్ల ముందే ప్రమాదాన్ని పసిగట్టింది. ‘రైలు..రైలు’ అని కేకలు వేసి డ్రైవర్‌ను అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. ఫలితం లేదు. పక్కకు చూస్తే చిన్నారులు మహిపాల్‌రెడ్డి, సద్భావన్దాస్ అమాయకంగా కూర్చున్నారు. వాళ్లకు ఏది ప్రమాదమో కూడా తెలియని వయసు. వాళ్లను లేపి రుచిత బస్సు కిటికీల్లోంచి బయటికి తోసేసింది. కొద్దిగా దూరంతో తన తమ్ముడు వరుణ్ కనిపించాడు. అతడిని కూడా తోసేందుకు ప్రయత్నించింది. వరుణ్ కొద్దిగా బొద్దుగా ఉండటంతో ఆ చిట్టితల్లికి సాధ్యం కాలేదు. మరోవైపు రైలు బుల్లెట్ వేగంతో వస్తోంది. సమయం మించిపోయింది. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో కిటికిలోంచి దూకే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో తలకు కిటికీ పై భాగం బలంగా తాకటంతో తీవ్రంగా గాయపడి చేతకాక సీట్లోనే కూలబడిపోయింది. అంతే..! ఆ క్షణమే రైలు బస్సును ఢీకొట్టింది. రుచిత తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంలోనే ఆమె చెల్లి శృతి చనిపోగా.. తమ్ముడు వరుణ్ తీవ్ర గాయలపాలై మృత్యువుతో పోరాడుతున్నాడు. తలకు, ఛాతికి బలమైన దెబ్బ లు తాకిన వరుణ్ పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని యశోద వైద్యులు ప్రకటించారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా అసమాన ధైర్యసాహసాలను, సమయస్ఫూర్తిని ప్రదర్శించిన రుచిత గౌడ్‌కు సాహస బాలల అవార్డు ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. -
పాతంకుల్ పెళ్లి రోజని కొత్తంకుల్ వచ్చాడు
మాసాయిపేట బస్సు ప్రమాదంలో గాయపడి, యశోద ఆస్పత్రిలో కోలుకుంటున్న చిన్నారి రుచిత.. ఇద్దరి ప్రాణాలను కాపాడి తాను మాత్రం గాయపడింది. ఈ పాప బాగా చురుగ్గా ఉందని, మంచి ఆత్మవిశ్వాసంతో ఉండటం వల్ల మిగిలినవారి కంటే త్వరగా కోలుకుంటోందని ఆస్పత్రి సిబ్బంది కూడా చెప్పారు. తనకు ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే వస్తుందని ఆమె యశోద ఆస్పత్రిలో 'సాక్షి టీవీ'తో చెప్పింది. తాను మూడో సీట్లో కూర్చున్నానని, రైలు వస్తుండగా చూశానని తెలిపింది. బస్సు అప్పటికే రైల్వే ట్రాకు మీద ఆగిపోయిందని, అంతలో డ్రైవర్‌కు ఏదో ఫోన్ రావడంతో మాట్లాడుతున్నాడని చెప్పింది. ఇంతలో రైలు వస్తోందని తాము చెప్పినా అతను మాత్రం పట్టించుకోలేదని, రైలు వస్తున్న విషయం చూసి తాను తన పక్క సీట్లో కూర్చున్న సద్భావన్, మహిపాల్ రెడ్డి అనే ఇద్దరు పిల్లలను కిటికీలోంచి బయటకు తోసేశానని తెలిపింది. తన తమ్ముడు వరుణ్‌ను కూడా తోసేందుకు ప్రయత్నించినా, అతడు కిటికీలో పట్టలేదని వివరించింది. ప్రమాదం జరిగిన రోజున తమకు ఎప్పుడూ వచ్చే డ్రైవరంకుల్ పెళ్లి రోజని, అందుకనే ఆయన కాకుండా కొత్త అంకుల్‌ను పంపారని రుచిత చెప్పింది. అతడు తాము చెబుతున్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, అందుకే రైలు వచ్చి బస్సును ఢీకొట్టిందని తెలిపింది. -
డ్రైవర్‌ను ముందే హెచ్చరించిన రుచిత