Aashirwad
-
దటీజ్ నీతా అంబానీ : పింక్ గాగ్రా, వెరీ, వెరీ స్పెషల్‌గా బ్లౌజ్
సందర్భం ఏదైనా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ తన ప్రత్యేకతను చాటుకుంటారు. తాజాగా తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌లో వరుడి తల్లిగా నీతా అద్భుతంగా కనిపించారు. నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ వేడుకలు, పెళ్లి, రిసెప్షన్, ఇలా ప్రతీ వేడుకను దగ్గరుండి మరీ ఘరంగా నిర్వహించడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ తొలి పత్రికను తనకెంతో ఇష్టమైన పవిత్ర వారణాసిలోని కాశీ విశ్వనాథుడి పాదల వద్ద ఉంచి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.తాజాగా 'శుభ్ ఆశీర్వాద్' వేడుకలో తన స్పెషల్ ఫ్యాషన్‌తో అలరించారు నీతా . డిజైనర్లు అబు జానీ సందీప్ ఖోస్లా ప్రత్యేకంగా రూపించిందిన పింక్ గాగ్రాలో హుందాగా కనిపించారు. కాశీలోని క్లిష్టమైన వాస్తుశిల్పం, దేవాలయాల ప్రేరణతో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన జర్దోజీ గాగ్రాను ఎంచుకున్నారు. ముఖ్యంగా దీనికి మ్యాచింగ్‌గా ఆమె ధరించిన బ్లౌజ్ విశేషంగా నిలిచింది.ఇందులో హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ ఝుమ్కా మోటిఫ్‌లు, బ్లౌజ్ వెనక వీపుపై శుభప్రదమైన ఏనుగు డిజైన్లు ఉన్నాయి. ఆకాష్, ఇషా అనంత్, తోపాటు మనవళ్ల పేర్లు-కృష్ణ, ఆదియా, పృథ్వీ , వేద చోళీపై హిందీలో చేతితో ఎంబ్రాయిడరీ చేయించారు. ఇంకా సంస్కృత శ్లోకాలతో, స్పెషల్ జరీ వర్క్ , ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టా మరింత ఆకర్షణీయంగా నిలిచింది. విరేన్ భగత్ సెట్ చేసిన పచ్చలు, వజ్రాలఆభరణాలతో తన లుక్ మరింత ఎలివేట్ అయ్యేలా జాగ్రత్త పడ్డారు. -
ఆశీర్వాద్ మైక్రోకు సెబీ బ్రేకులు
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ.. మణప్పురం ఫైనాన్స్ అనుబంధ సంస్థ ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాజాగా సెబీ బ్రేకు వేసింది. సంస్థ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అయితే వెబ్సైట్లో సెబీ ఇందుకు కారణాలను వెల్లడించలేదు. ఈక్విటీ జారీ ద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణకు వీలుగా ఆశీర్వాద్ మై క్రో 2023 అక్టోబర్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. సాధారణంగా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన 30 రోజుల్లోగా సెబీ పరిశీలనా పత్రాన్ని జారీ చేస్తుంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు అనుమతిస్తుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో ఆశీర్వాద్ మైక్రో పే ర్కొంది. 2008లో తమిళనాడులో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం 1,684 బ్రాంచీలతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించింది. గతేడాది(2022–23)కల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 10,041 కోట్లకు చేరాయి. ఈ వార్తల నేపథ్యంలో మణప్పురం ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం పతనమై రూ. 168 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 163 వద్ద కనిష్టాన్ని తాకింది. -
Khelo India Youth Games: ప్రణయ్‌కు పసిడి పతకం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారుల తమ పతకాల వేట కొనసాగిస్తున్నారు. భోపాల్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో శనివారం అథ్లెటిక్స్ బాలుర ట్రిపుల్ జంప్‌లో తెలంగాణ ప్లేయర్ కొత్తూరి ప్రణయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా.. బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో నామాయి రుచిత రజత పతకాన్ని గెల్చుకుంది. శుక్రవారం 1500 మీటర్ల రేసులో సుమిత్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన జూనియర్ పురుషుల సైక్లింగ్ కెరిన్ రేసు వ్యక్తిగత విభాగంలో ఆశీర్వాద్ సక్సేనా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. బ్యాడ్మింటన్‌లో అండర్–19 బాలుర సింగిల్స్ విభాగంలో కె.లోకేశ్ రెడ్డి తెలంగాణకు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో లోకేశ్ రెడ్డి 21–19, 15–21, 22–20తో అభినవ్ ఠాకూర్ (పంజాబ్)పై గెలుపొందాడు. బాక్సింగ్‌లో బాలుర 51 కేజీల విభాగంలో బిలాల్... బాలికల 75 కేజీల విభాగంలో గుణనిధి పతంగె కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో ప్రస్తుతం తెలంగాణ పది పతకాలతో 14వ ర్యాంక్‌లో ఉంది. -
సూపర్ స్టార్ ఇంటిని కూల్చేస్తున్నారు
బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న బంగ్లా ఆశీర్వాద్‌ను కూల్చేస్తున్నారు. రాజేష్ ఖన్నా మరణం తరువాత ఆ బంగ్లాను కొనుక్కున్న శశి కిరణ్ శెట్టి అక్కడ మరో భారీ భవంతి నిర్మించాలనే ఆలొచనతో ఈ ఐకానిక్ బంగ్లాను నేలమట్టం చేసే పనిని మొదలు పెట్టాడు. దశాబ్దాల పాటు కపూర్ల ఫాలోయింగ్‌కి సాక్ష్యంగా నిలిచిన ఆశ్వీరాద్ చరిత్రలో కలిసిపోతుండటం బాలీవుడ్ సినీ అభిమానులు తీవ్రంగా కలిచి వేస్తుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా 1970లో నటుడు రాజేంద్ర కుమార్ నుంచి 3.5 లక్షలకు ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ బంగ్లాకు డింపుల్ అనే పేరుండేది. అయితే రాజేంద్ర కుమార్ అదే పేరుతో మరో బంగ్లాను నిర్మించటంతో రాజేష్ ఖన్నా స్యయంగా తన ఇంటికి ఆశీర్వాద్ అని పేరు పెట్టుకున్నారు. ఆఖరి రోజు వరకు ఖన్నా ఇదే ఇంట్లో నివాసం ఉన్నారు. 2014లో రాజేష్ ఖన్నా వారసులు ట్వింకిల్, రిన్నీలు 90 కోట్లకు ఈ ఐకానిక్ బంగ్లాను శశి కిరణ్ శెట్టికి విక్రయించారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన పాత భవంతి స్థానంలో కొత్తగా అపార్ట్మెంట్ నిర్మించే ఆలోచనలో ఉన్నాడు శశి కిరణ్, ఇప్పటికే అన్ని రకాల అనుమతులు తీసుకున్న శెట్టి, ఆశీర్వాద్‌ను కూల్చేసే పని కూడా మొదలు పెట్టాడు. -
మళ్లీ కోర్టుకెక్కనున్న ‘ఆశీర్వాద్’
-
మళ్లీ కోర్టుకెక్కనున్న ‘ఆశీర్వాద్’
బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాకు ఎంతో ఇష్టమైన 'ఆశీర్వాద్' బంగ్లా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ముంబయి బాంద్రాలోని ఇదే బంగ్లాలో రాజేశ్ ఖన్నా 2012 జూలై 18న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించిన తర్వాత వారసత్వం కింద కుమార్తెలు ట్వింకిల్, రింకీ ఖన్నాలకు ఆ ఆస్తి సంక్రమించింది. వారు ఇప్పుడు ఆ బంగ్లాను నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు విక్రయించినట్లు సమాచారం. నాలుగు దశాబ్దాలకు పైగా ఆ ఇంట్లో నివసించిన అనుబంధంతో ఆశీర్వాద్‌ను మ్యూజియంగా మార్చాలని ఖన్నా ఆశించారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం తన కూతుళ్లదేనని మరణానికి కొన్నేళ్ల ముందు ఆయన చెప్పారు. ప్రస్తుతం వరదాన్ ఆశీర్వాద్‌గా పిలుస్తున్న ఆ ఇంటిని ఆల్ కార్గో లాజిస్టిక్స్ చైర్మన్ శశికిరణ్ శెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కాగా బంగ్లా ఆస్తిలో తనకు వాటా ఉంటుందని, రాజేశ్ ఖన్నా తనకు కూడా భర్తేనని ఆయన సహచరి అనితా అద్వానీ గతంలో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఖన్నా కుటుంబ సభ్యులకు ఆమె లీగల్ నోటీసులు పంపించారు కూడా. డింపుల్ ఖన్నాతో విడిపోయిన అనంతరం రాజేశ్ ఖన్నా ఎనిమిదేళ్లు అనితా అద్వానీతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఖన్నా మృతి చెందిన అనంతరం ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే.. అనితా అద్వానీకి ఇందులో ఎలాంటి సంబంధం లేదని రాజేశ్ ఖన్నా భార్య డింపుల్, కూతుళ్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా వాదిస్తూ వచ్చారు. ఆశీర్వాద్ బంగ్లా తమ పేరు మీద ఉందని, అందుకే అమ్మకానికి పెట్టినట్లు వారు చెబుతున్నారు. దాంతో ఆశీర్వాద్ బంగ్లా అమ్మకం చెల్లదని పేర్కొంటూ అనితా అద్వానీ మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఇదే వివాదంలో కోర్టులో తనకు అనుకూలంగానే తీర్పు వచ్చిందన్నారు. అయితే కాకాజీ కుటుంబీకులు న్యాయస్థానంపై గౌరవం ఉంచకుండా బంగ్లాను విక్రయించాలనుకోవటం సరికాదన్నారు. దీనిపై తాను తుది వరకూ పోరాడతానకి అనితా అద్వానీ స్పష్టం చేశారు. సముద్రానికి అభిముఖంగా 603 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం రూ.90 కోట్ల వరకు పలుకుతుందని మార్కెట్ వర్గాల కథనం. అయితే ఎవరైనా థర్డ్ పార్టీ.. యాజమాన్య హక్కును కోరడానికి సంబంధించి జారీ చేసిన 14 రోజుల నోటీసు గడువు ముగిసిన తర్వాతే ఈ కొనుగోలు ఒప్పందం పూర్తి అవుతుంద నేది విశ్వసనీయ వర్గాల కథనమని టైమ్స్ ఆఫ్ ఇండియూ పేర్కొంది. 60వ దశకం చివర్లో మరో బాలీవుడ్ దిగ్గజం రాజేంద్రకుమార్ నుంచి ఈ భవనాన్ని కొనుగోలు చేసిన రాజేశ్‌ఖన్నా 80వ దశకంలో దాన్ని పునర్నిర్మించారు.