దటీజ్‌ నీతా అంబానీ : పింక్‌ గాగ్రా, వెరీ, వెరీ స్పెషల్‌గా బ్లౌజ్‌ | Nita Ambani's blouse appears special attraction in Shubh Aashirwad ceremony | Sakshi
Sakshi News home page

దటీజ్‌ నీతా అంబానీ : పింక్‌ గాగ్రా, వెరీ, వెరీ స్పెషల్‌గా బ్లౌజ్‌

Published Mon, Jul 15 2024 11:55 AM | Last Updated on Mon, Jul 15 2024 12:33 PM

Nita Ambani's blouse appears special attraction in Shubh Aashirwad ceremony

సందర్భం ఏదైనా రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ నీతా అంబానీ తన ప్రత్యేకతను చాటుకుంటారు.  తాజాగా  తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌లో వరుడి తల్లిగా  నీతా అద్భుతంగా కనిపించారు.  నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు, పెళ్లి, రిసెప్షన్‌, ఇలా  ప్రతీ వేడుకను దగ్గరుండి మరీ ఘరంగా నిర్వహించడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.  అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ వివాహ తొలి  పత్రికను తనకెంతో ఇష్టమైన పవిత్ర వారణాసిలోని కాశీ విశ్వనాథుడి పాదల వద్ద ఉంచి  ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

తాజాగా  'శుభ్ ఆశీర్వాద్' వేడుకలో తన స్పెషల్‌ ఫ్యాషన్‌తో అలరించారు  నీతా . డిజైనర్లు అబు జానీ సందీప్ ఖోస్లా  ప్రత్యేకంగా రూపించిందిన పింక్‌ గాగ్రాలో హుందాగా కనిపించారు. కాశీలోని క్లిష్టమైన వాస్తుశిల్పం, దేవాలయాల ప్రేరణతో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన జర్దోజీ గాగ్రాను ఎంచుకున్నారు.  ముఖ్యంగా దీనికి మ్యాచింగ్‌గా ఆమె ధరించిన బ్లౌజ్‌ విశేషంగా నిలిచింది.

ఇందులో హ్యాండ్‌ మేడ్‌ ఎంబ్రాయిడరీ ఝుమ్కా మోటిఫ్‌లు, బ్లౌజ్‌ వెనక వీపుపై శుభప్రదమైన ఏనుగు డిజైన్‌లు ఉన్నాయి. ఆకాష్, ఇషా  అనంత్, తోపాటు  మనవళ్ల పేర్లు-కృష్ణ, ఆదియా, పృథ్వీ , వేద చోళీపై  హిందీలో  చేతితో ఎంబ్రాయిడరీ చేయించారు. ఇంకా సంస్కృత శ్లోకాలతో, స్పెషల్‌ జరీ వర్క్‌ , ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టా మరింత ఆకర్షణీయంగా నిలిచింది. విరేన్ భగత్  సెట్ చేసిన పచ్చలు,  వజ్రాలఆభరణాలతో తన లుక్‌ మరింత ఎలివేట్‌ అయ్యేలా జాగ్రత్త పడ్డారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement