cermony
-
దటీజ్ నీతా అంబానీ : పింక్ గాగ్రా, వెరీ, వెరీ స్పెషల్‌గా బ్లౌజ్
సందర్భం ఏదైనా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ తన ప్రత్యేకతను చాటుకుంటారు. తాజాగా తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌లో వరుడి తల్లిగా నీతా అద్భుతంగా కనిపించారు. నిశ్చితార్థం, ప్రీ వెడ్డింగ్ వేడుకలు, పెళ్లి, రిసెప్షన్, ఇలా ప్రతీ వేడుకను దగ్గరుండి మరీ ఘరంగా నిర్వహించడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ తొలి పత్రికను తనకెంతో ఇష్టమైన పవిత్ర వారణాసిలోని కాశీ విశ్వనాథుడి పాదల వద్ద ఉంచి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.తాజాగా 'శుభ్ ఆశీర్వాద్' వేడుకలో తన స్పెషల్ ఫ్యాషన్‌తో అలరించారు నీతా . డిజైనర్లు అబు జానీ సందీప్ ఖోస్లా ప్రత్యేకంగా రూపించిందిన పింక్ గాగ్రాలో హుందాగా కనిపించారు. కాశీలోని క్లిష్టమైన వాస్తుశిల్పం, దేవాలయాల ప్రేరణతో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన జర్దోజీ గాగ్రాను ఎంచుకున్నారు. ముఖ్యంగా దీనికి మ్యాచింగ్‌గా ఆమె ధరించిన బ్లౌజ్ విశేషంగా నిలిచింది.ఇందులో హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ ఝుమ్కా మోటిఫ్‌లు, బ్లౌజ్ వెనక వీపుపై శుభప్రదమైన ఏనుగు డిజైన్లు ఉన్నాయి. ఆకాష్, ఇషా అనంత్, తోపాటు మనవళ్ల పేర్లు-కృష్ణ, ఆదియా, పృథ్వీ , వేద చోళీపై హిందీలో చేతితో ఎంబ్రాయిడరీ చేయించారు. ఇంకా సంస్కృత శ్లోకాలతో, స్పెషల్ జరీ వర్క్ , ఎంబ్రాయిడరీ చేసిన దుపట్టా మరింత ఆకర్షణీయంగా నిలిచింది. విరేన్ భగత్ సెట్ చేసిన పచ్చలు, వజ్రాలఆభరణాలతో తన లుక్ మరింత ఎలివేట్ అయ్యేలా జాగ్రత్త పడ్డారు. -
IPL 2023 Opening Ceremony : ఐపీఎల్ ప్రారంభ వేడుకలు అదరహో (ఫొటోలు)
-
ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె వివాహం (ఫొటోలు)
-
ఏపీలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
సాక్షి, అమరావతి : ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారిని దర్శించు కోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వివిధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైఎస్ఆర్ జిల్లా.. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.భక్తుల దర్శనార్థం వైకుంఠ ద్వారంలో గరుడ వాహనంపై కోదండరాముడు కొలువు దీరాడు. తెల్లవారు జామున 5 గంటల నుంచే సీతారామ లక్ష్మణుల దర్శనం కోసం భక్తజనం పోటెత్తారు. కోదండ రామాలయం మొత్తం గోవింద నామ స్మరణతో మార్మోగిపోయింది. తూర్పు గోదావరి జిల్లా.. అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యనారాయణ స్వామిని ఉత్తరద్వారం దిశగా భక్తులు దర్శించుకుంటున్నారు. శేష పానుపు పై సత్యనారాయణ స్వామి అనంత లక్ష్మి సత్యవతి అమ్మవార్లు ఉత్తర ముఖంగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు.ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఉత్తర ద్వారం గుండా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. విశాఖపట్నం.. సింహచల వరహా లక్ష్మీ నరసింహ స్వామి ఆయలం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సిద్దమైంది. పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. కోవిడ్ నియామాలు అనుసరించి భక్తులు దర్శనం చేసుకునేలా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.దేవస్థాన ఛైర్మన్ సంచయిత గజపతి, ట్రస్ట్ బోర్డ్ సభ్యులతో పాటు తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. గుంటూరు.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ అధికారులు ఉత్తర ద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం 3.30 గంటల నుంచే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. కోవిడ్ కారణంగా అధికారులు ఆలయంలో శంఖు తీర్థం నిలిపివేశారు.60సంవత్సరాల వృద్ధులు, 10 సంవత్సరాలు లోపు పిల్లలకి గుడిలోకి అనుమతించలేదు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ జిల్లా .. తిరుమలేశుని తొలి గడప దేవుని కడప ఆలయానికి భక్తులు పోటెత్తారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామున నుంచే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. కోవిడ్ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా.. ద్వారక తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా చిన్న వెంకన్న భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ఉత్తర ద్వారం వైపు వెండి గరుడవాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు భక్తులు దర్శించుకుంటున్నారు. సాధారణ, విఐపి భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయగా.. క్యూలైన్లన్ని గోవిందనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. -
కలసి నడుద్దాం
‘రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయత, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.కృష్ణా జలాలను ఒద్దికగా, పొదుపుగా వినియోగించుకుంటూ సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో రెండు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ అభిలషించారు. చిన్న వయసులో ముఖ్యమంత్రిగా చేపట్టిన పెద్ద బాధ్యతను అద్భుతంగా నిర్వహించగలిగే శక్తి, సామర్థ్యం, ధైర్యం, స్థైర్యం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్నాయని, అది గత తొమ్మిదేళ్లుగా ప్రస్ఫుటంగా నిరూపణైందని కొనియాడారు. సభలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. సాక్షి, అమరావతి/గన్నవరం: ‘నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వకంగా నా పక్షాన, తెలంగాణ ప్రభుత్వ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన అభినందనలు, ఆశీస్సులు. తెలుగు ప్రజల జీవన గమనంలో ఇదో ఉజ్వలమైన ఘట్టం. ఉభయ రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు ప్రేమతో అనురాగంతో పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. వయసుచిన్నదైనా ఆ శక్తి, తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నాను. మీ కార్యనిర్వహణలో, మీ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని మీరు సంపూర్ణ విజయాన్ని సాధించాలని భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తున్నాను.రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు చేయవలసింది ఖడ్గ చాలనం కాదు కరచాలనం. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలి. జగన్మోహన్రెడ్డి ముందున్న తక్షణ కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగం. 100 శాతం జరిగి తీరాలి. మీ ఆధ్వర్యంలో జరుగుతుందని విశ్వసిస్తున్నాను.కృష్ణా నదీ జలాల విషయంలో సమస్యలు ఉన్నాయి. అక్కడ నదిలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా ఒద్దికగా ఓపికగా ఉభయ రాష్ట్రాలు వినియోగించుకుంటూనే సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ఉభయ రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ కార్యనిర్వహణలో అవసరమైనటువంటి అన్ని విధాల అండదండలు, సహాయసహకారాలు తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తున్నాను. అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతమైన పాలన అందించి నాన్నగారి పేరు నిలబెట్టి చరిత్రలో నిలిచిపోయేలా కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలని.. ఒక టెర్మ్ కాదు కనీసం మూడు నాలుగు టెర్మ్‌ల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని మనసారా దీవిస్తూ మీకు శుభాశీస్సులు అందిస్తున్నాను.’ అంటూ ముగించారు. వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు: స్టాలిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పరిపాలనలో విజయవంతం కావాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆకాంక్షించారు. తన తండ్రి ఘన వారసత్వాన్ని నిలబెట్టేలా జగన్ మంచి పరిపాలన అందించాలని శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా స్టాలిన్ అందరికీ నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడారు. ఎయిర్‌పోర్టులో కేసీఆర్, స్టాలిన్‌కు ఘనస్వాగతం తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, డీఎంకే అధినేత స్టాలిన్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. తొలుత చెన్నై నుంచి 10.25 గంటలకు స్టాలిన్ ఇక్కడికి చేరుకున్నారు. ఆయనకు ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమం పూర్తయ్యా సాయంత్రం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై బయలుదేరివెళ్లారు. కేసీఆర్ ఉదయం 11.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, పలువురు మంత్రులు విచ్చేశారు. సాయంత్రం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్ అదే విమానంలో హైదరాబాద్ వెళ్లారు. -
శుభకార్యాలకు సెలవ్!
నిజామాబాద్ కల్చరల్ : వివాహ, గృహ ప్రవేశ తదితర శుభ కార్యాలకు అవసరమైన ముహూర్తాలు సోమవారంతో ముగిసాయి. జనవరి 5 నుంచి శూన్య మాసం ప్రారంభమై ఫిబ్రవరి 5 వరకు ఉంటుంది. తిరిగి వివాహ, గృహ ప్రవేశాలు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 16 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయి. పుష్యం శని దేవునికి ప్రీతికరం తెలుగు సంవత్సరాది పన్నెండు నెలల్లో 10వ నెల పుష్య మాసం. జనవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ కాలాన్ని జ్యోతిష్య శాస్త్రంలో శూన్యమాసంగా పేర్కొంటారు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రయాణం చేస్తూ మకరరాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశికి చెందిన రేఖ నుంచి కర్కాటక రాశికి చెందిన రేఖపై సూర్యగమనం ఉంటుంది. మకర రాశిపైన శని దేవుని ప్రభావం అధికంగా ఉంటుంది. అందు కోసం ఈ మాసంలో శని ప్రీతి కోసం నవగ్రహ ఆరాధనలు పిండివంటల్లో నువ్వులు అధికంగా వాడుతారు. ఫిబ్రవరి 9న వసంత పంచమి చదువుల తల్లి సరస్వతీమాత జన్మతిథి వసంత పంచమి. ఈ పర్వదినాన్ని ఫిబ్రవరి 9న జరుపుకుంటారు. నాటి నుంచి వివాహ గృహ ప్రవేశ, శంకుస్థాపనలు తదితర అనేక శుభ ముహూర్తాలు ఆరంభమవుతాయి. వసంత పంచమి నాడు అక్షరభ్యాసం చేస్తే పిల్లల్లో మేధాశక్తి పెరుగుతుందని పెద్దలంటారు. గృహ ప్రవేశం చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కళకళలాడుతుందనే నమ్మకం. ఆ రోజున వివాహం చేసుకుంటే దాంపత్యం దీర్ఘకాలం కొనసాగుతుందని పండితులు చెబుతారు. -
మంచి టీం వర్క్ చేస్తే విజయం మనదే
తోట గోపాలకృష్ణ వర్ధంతి సభలో కన్నబాబు సామర్లకోట: వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సేవా దృక్పథంతో మంచి టీం వర్కు చేస్తే 2019 ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. తోట గోపాలకృష్ణ 5వ వర్ధంతి సందర్బంగా గురువారం స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గోపాలకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తోట గోపాల కృష్ణ ఆత్మకు శాంతి కలగాలంటే ఆయన ఆయన తనయుడు తోట సబ్బారావునాయుడును 2019లో ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగు పెట్టే విధంగా కృషి చేయాలన్నారు. ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని పిలుపు నిచ్చారు. సుబ్బారావు నాయుడుకు జిల్లా పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. గోపాలకృష్ణ వర్దంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరికీ కన్నబాబు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కాకినాడ టౌన్ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్, జగ్గంపేట కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాసు, పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు అభినందనలు తెలిపారు. గోపాలకృష్ణ ఉన్న చోట అలసటను మరిచి పోయేవారం ఓదార్పు యాత్రలోను, ఎన్నికల ప్రచారంలోను అలిసి పోయిన సమయంలో తోట గోపాలకృష్ణ ఉంటే అలసట మరచి పోయేవారమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. గోపాలకృష్ణ ఆశయాలు అమలు చేయడానికి సుబ్బారావునాయుడును ఎమ్మెల్యేగా చేయాలన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఆవాల లక్ష్మీనారాయణ, జిగిని వీరభద్రరావు, కంటే వీర్రాఘవరావు, జిల్లా , నియోజకవర్గ నాయకులు, కౌన్సిలర్లు, తదితరులు రక్తదానం చేశారు. -
శునకానికి పెద్ద కర్మ
దుగ్గిరాల : శునకానికి పెదకర్మ నిర్వహించి దానిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని చెన్నకేశవనగర్‌కు చెందిన చిమట శ్రీనివాసరావు కుటుంబసభ్యులు. శ్రీనివాసరావు దంపతులకు పిల్లలు లేకపోవడంతో 10 ఏళ్ళ నుంచి ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి స్నూపి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. సంతానం లేకపోవడంతో స్నూపియే తమ బిడ్డగా భావించి కుటుంబ సభ్యునిగా ఆదరించారు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన అనారోగ్యంతో శునకం మతి చెందింది. స్నూపి మరణం వారిని ఎంతగానో కలచివేసింది. చనిపోయిన శునకానికి తమ ఇంటి ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించి, అందంగా టైల్స్‌తో సమాధిని నిర్మించారు. సోమవారంతో స్నూపి మరణించి 11 రోజులు కావడంతో పెద్దకర్మ నిర్వహించారు. కార్యక్రమానికి బంధువులను, రాజకీయ ప్రముఖులను, స్నేహితులను పిలిపించి విందు ఏర్పాటు చేశారు. స్నూపి చిత్రపటానికి మాజీ ఎంపీపీ వెనిగళ్ళ శ్రీ కష్ణప్రసాద్, న్యాయవాదులు జొన్ను శివరామ్, జింకా సురేష్‌కుమార్ యాదవ్, పసుపులేటి నాగయ్య, బొజ్జా నాగేశ్వరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
రాజ్యాధికారం లక్ష్యంగా పని చేయాలి
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంపత్‌రావు కాకినాడ సిటీ : కాన్షీరామ్ స్ఫూర్తితో రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు వెళ్లాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సంపత్‌రావు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ భవన్లో బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరామ్ 10వ వర్ధంతి సభను ఆదివారం నిర్వహించారు. తొలుత జ్యోతిరావు పూలే, అంబేడ్కర్, కాన్షీరామ్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాన్షీరామ్ ఉత్తరప్రదేశ్‌లో రాజ్యాధికారాన్ని సాధించడంలో చేసిన కృషిని స్మరించుకుని, ఆయన సేవలను కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బర్రె కొండబాబు మాట్లాడుతూ పార్టీని జిల్లాలో సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ కంకణబద్దులు కావాలన్నారు. త్వరలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని సూచించారు. 50 డివిజన్లలో అభర్థులను పోటీకి నిలుపుతామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బత్తుల లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బతి కృష్ణప్రసాద్, జిల్లా కార్యదర్శులు ఎం.వి.సుబ్బారావు, మేడిది చిట్టినాయన, జిల్లా ఉపాధ్యక్షుడు కె.నరసింహమూర్తి, కాకినాడ నగర అధ్యక్షుడు దాసరి వెంకట్, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్‌్జలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.