
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారులు వై. సాయి దేదీప్య, అదితి ఆరే నిలకడగా రాణిస్తున్నారు. మహారాష్ట్రలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్ టెన్నిస్ టోర్నీ డబుల్స్ విభాగంలో వీరిద్దరూ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. అండర్–21 బాలికల డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో సాయి దేదీప్య– అదితి (తెలంగాణ) ద్వయం 6–4, 6–2తో స్నేహల్ మానే– సృష్టి దాస్ (మహారాష్ట్ర) జంటపై విజయం సాధించారు. గురువారం జరిగే సెమీస్ మ్యాచ్‌లో గుజరాత్‌కు చెందిన జీల్ దేశాయ్– వైదేహి చౌదరి జంటతో సాయిదేదీప్య జోడీ తలపడుతుంది..
Comments
Please login to add a commentAdd a comment