
పుణే: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ అమ్మాయి గుండ్లపల్లి మేఘన రెడ్డి కాంస్య పతకాన్ని సాధించింది. అండర్–21 రిథమిక్ జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ విభాగంలో మేఘన 39.30 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. అదితి దండేకర్ (మహారాష్ట్ర–46.40 పాయింట్లు) స్వర్ణం సాధించగా... కిమాయ కదమ్ (మహారాష్ట్ర–41 పాయింట్లు) రజత పతకం గెల్చుకుంది. బ్యాడ్మింటన్ అండర్–17 బాలుర సింగిల్స్‌లో తెలంగాణ కుర్రాడు గంధం ప్రణవ్ రావు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ప్రణవ్ రావు 21–19, 12–21, 21–12తో టుకుమ్ లా (అరుణాచల్ ప్రదేశ్)పై గెలుపొందాడు. నేడు జరిగే ఫైనల్లో రవి (హరియాణా)తో ప్రణవ్ తలపడతాడు.