సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను తెలుసుకునేందుకు ప్రతి జిల్లాలో జనాభా ఆధారిత సెరో–సర్వే నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీలు కీలకంగా నిర్వహించే ఈ సర్వేకు రా ష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలు సహకరిస్తాయి. వారానికి 200 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సోమవారం అన్ని రాష్ట్రాలకు కేం ద్రం ఆదేశాలు జారీచేసింది. ప్ర తి జిల్లాలో 6 ప్రభుత్వ, 4 ప్రై వేటు ఆసుపత్రులను ఎంపిక చేస్తారు. ఔట్ పేషెంట్ల తరఫు న ఆసుపత్రులకు వచ్చే వారిలో 50 మంది, మరో 50 మంది గర్భిణుల శాంపిళ్లను సేకరించాలని సూచించింది.
వీళ్లను లో–రిస్క్ గ్రూప్‌గా వర్గీకరించింది. అలాగే హైరిస్క్‌లో ఉండే వైద్య సిబ్బందికి ప్రతీ వారం 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. మొత్తంగా వారానికి 200, నెలకు 800 మందికి ప్రతీ జిల్లాలో ర్యాండమ్‌గా పరీక్షలు చేయాలని పేర్కొంది. కాగా, కరోనా నిర్ధారణకు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చిందా లేదా తెలుసుకుంటారు. మరొకటి పూలింగ్ పరీక్ష. దీనిద్వారా ఒకేసారి కొందరి నమూనాలను కలిపి పరీక్ష చేస్తా రు. ఇంకొకటి ఎలిసా పరీక్ష. శరీరంలో వైరస్ ప్రభావాన్ని, యాంటీబాడీలను కనుక్కునేందుకు దీన్ని నిర్వహిస్తారు. వీటి ద్వారా వైరస్ వ్యాప్తి తీవ్రతతో పాటు ఎక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నా యో గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment