న్యూఢిల్లీ: సంఘటిత రంగంలోని రెండు కోట్ల మందికిపైగా కార్మికులకు శుభవార్త. బహిరంగ మార్కెట్‌లో లభించే ఆరోగ్య బీమా ప్లాన్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు వారికి త్వరలో లభించనుంది. ప్రస్తుతం నెలకు రూ.21 వేల వరకు వేతనం పొందే కార్మికులు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ) ఆధ్వర్యంలోని ఆరోగ్య బీమా పథకంలో చేరడం తప్పనిసరి.
అయితే ఇకమీదట ఈఎస్‌ఐసీ ఆరోగ్య బీమా పథకానికి బదులుగా మార్కెట్‌లో లభించే ఆరోగ్య బీమా ఉత్పత్తులను ఎంచుకునే ప్రత్యామ్నాయం వారికి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ చట్టం, 1948కి సవరణలు చేస్తూ ఒక బిల్లును కార్మిక మంత్రిత్వశాఖ త్వరలో కేంద్ర మంత్రివర్గం ఆమోదానికి పంపనుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదానికి మంత్రిత్వశాఖ ప్రయత్నిస్తుం దని ఆ శాఖకు చెందిన వర్గాలు తెలిపాయి.
ఈఎస్‌ఐసీకి బదులు ఇతర బీమాల ఎంపిక!
Published Mon, Oct 17 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM
Advertisement
Advertisement