![నేతన్నకు ఆరోగ్య బీమా!](/styles/webp/s3/article_images/2017/09/5/71491171847_625x300.jpg.webp?itok=CiCvZZKp)
నేతన్నకు ఆరోగ్య బీమా!
న్యూఢిల్లీ: కార్మిక రాజ్య బీమా కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పథకం కింద నేత కార్మికులకు(హ్యాండ్‌లూమ్, పవర్‌లూమ్) ఆరోగ్య బీమా పథకంపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని ద్వారా 8 కోట్ల మంది చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఈఎస్‌ఐసీ కింద మేలు జరగనుందని మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. నేత కార్మికులకు ఈఎస్‌ఐ పథకం కిందకు చేర్చాలన్న కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాసిన లేఖపై మంత్రి స్పందించారు.