
న్యూఢిల్లీ: కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం కిందకు ఏప్రిల్ నెలలో కొత్తగా 10.41 లక్షల మంది సభ్యులుగా చేరారు. వ్యవస్థీకృత రంగంలో ఈ మేరకు నూతనంగా ఉపాధి అవకాశాలు లభించినట్టుగా భావించాలి. 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈఎస్‌ఐసీ కిందకు స్థూలంగా 1.15 కోట్ల మంది నమోదు అయ్యారు. 2019–20లో నమోదు 1.51 కోట్ల మందితో పోలిస్తే 24 శాతం తగ్గినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) శుక్రవారం గణాంకాలను విడుదల చేసింది. కరోనా వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు గతేడాది మార్చి 25న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను కేంద్రం ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత సడలింపులు చేసినప్పటికీ ఉపాధిపై ఆ ప్రభావం గణనీయంగానే పడింది. ఈఎస్‌ఐసీ కింద 2018–19లో స్థూలంగా 1.49 కోట్ల మంది చేరారు. 2017 సెప్టెంబర్ నుంచి 2021 ఏప్రిల్ వరకు ఈఎస్‌ఐసీ పరిధిలో స్థూలంగా 5.09 కోట్ల మంది సభ్యులయ్యారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌వో) కింద 12.76 లక్షల మంది కొత్తగా చేరారు.
Comments
Please login to add a commentAdd a comment