ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) తన ఆరోగ్య బీమాను మరింత సంఘటితం చేసేందుకు.. బీమాలో చేరటానికి నెల వారీ వేతన పరిమితిని ప్రస్తుతమున్న రూ. 15,000 నుండి రూ. 21,000కు పెంచాలని నిర్ణయింది. ఈ విషయాన్ని కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ఢిల్లీలో ఈఎస్‌ఐసీ బోర్డు భేటీ అనంతరం పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.