
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పథకంలో ఈ ఏడాది మేలో 23 లక్షల మంది కొత్త ఉద్యోగులు చేరారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వీరి సంఖ్య 13.9% పెరిగింది. నెలవారీగా ఈఎస్‌ఐసీలో చేరే సరాసరి ఉద్యోగులు 16.4 లక్షల మందితో పోలిస్తే 39.9% వృద్ధిని నమోదు చేసింది. ఈమేరకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ డేటా విడుదల చేసింది.
ఈఎస్‌ఐసీ తాజాగా విడుదల చేసిన పేరోల్ డేటా ప్రకారం..2024 ఏప్రిల్‌లో ఈఎస్‌ఐసీ పరిధిలో 18,490 మంది చేరారు. అదే మేలో మాత్రం ఆ సంఖ్య 20,110 కు చేరింది. మే నెలలో నమోదైన మొత్తం 23 లక్షల ఉద్యోగుల్లో 25 ఏళ్లలోపు వయసు ఉన్నవారు 11 లక్షల మంది, మహిళలు 44 వేలు, 60 మంది ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు ఈఎస్‌ఐ పథకం కింద నమోదు చేసుకున్నారు. నెలవారీ వేతనం రూ.21,000 వరకు ఉంటే వారి జీతాల్లో 0.75% ఈఎస్‌ఐ కింద జమ చేస్తారు. సంస్థ యాజమాన్యం మరో 3.25% విరాళంగా అందిస్తుంది. మొత్తం 4% నగదు ఈఎస్‌ఐలో జమ అవుతుంది. ఇది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య, నగదు ప్రయోజనాలను అందించేందుకు ఉపయోగిస్తారు.
ఇదీ చదవండి: వీడియో స్ట్రీమింగ్ రంగంలో 2.8 లక్షల మందికి ఉపాధి
Comments
Please login to add a commentAdd a comment