ఈఎస్‌ఐ పరిధిలోకి కాంట్రాక్టు ఉద్యోగులు
హైదరాబాద్: భవిష్యత్తులో అంగన్ వాడీ, ఆశా వర్కర్స్ తో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల ను కూడా ఈఎస్‌ఐ పరిధి లోకి తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని.. అందుకోసం ఆర్ధిక శాఖ అనుమతి కోరినట్లు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కార్మిక శాఖ అద్వర్యంలో హైదరాబాద్‌లో మహిళా సదస్సు జరిగింది. ఈ సదస్సు పాల్గొన్న దత్తాత్రేయ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులను సంఘటిత రంగంలోకి తీసుకు వచ్చామని తెలిపారు. మహిళలకు ప్రసూతి సెలవులు పెంచామన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కూడా ఇచ్చామని పేర్కొన్నారు. మహిళ లకు సమాన హక్కుల కోసం తమ శాఖ ప్రయత్నం చేస్తుందన్నారు.
కార్మిక శాఖలో అవినీతి నిర్ములన కోసం కొత్త చట్టాలు తెస్తున్నామన్నారు. స్టార్ట్ అప్ లో భాగంగా ప్రధాని మోదీ.. మహిళలకు రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు తక్కువ వడ్డీకే ఇస్తున్నారని చెప్పారు. 33 శాతం రిజర్వేషన్ లో భాగంగా.. హోమ్ మంత్రి కోరగానే.. 7 రాష్ట్రాల్లోని పోలీస్ విభాగాలు ఒప్పుకున్నాయని తెలిపారు. 33 శాతం మహిళా రిజర్వేషన్స్ కు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.