సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ స్కాం కేసులో ఏసీబీ దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితురాలుగా ఉన్న మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయట పడుతోంది. సైబరాబాద్‌లో కమర్షియల్ రెసిడెన్షియల్ స్థలం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇచ్చిన రూ. 4 కోట్ల 47 లక్షల రూపాయలను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ప్రకారం బంగారపు ఆభరణాలు ఎక్కడికి తరలించారు అన్న అంశాలపై ఏసీబీ విచారణ చేస్తోంది.ఇంట్లో దొరికిన పత్రాల ఆధారంగా 10 కోట్ల బంగారు ఆభరణాలు రహస్య ప్రాంతంలో దాచిపెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తుంది.
స్కామ్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఆమె కు సంబంధించిన 35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి ఏసీబీ సీజ్ చేసింది. అయితే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 200 కోట్ల ఉందంటున్న ఏసీబీ భావిస్తోంది. దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఏసీబీ నమోదు చేసింది. ఒక పక్క విచారణ కోనసాగుతుండగానే నిందితులు తమ ఆస్తులను, బంగారపు ఆభరణాలను పక్క ప్లాన్ తో దారి మళ్లించినట్లు ఏసీబీ భావిస్తోంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 25 మంది నిందితులకు సంబంధించిన వందల కోట్ల ఆస్తులను ఏసీబీ సీజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ నిందితులకు సంబంధించి కోట్ల రూపాయలు బయట పడడంతో ఏసీబీ షాక్ గురైంది. దేవికారానికి నోటీసులు ఇచ్చి మరోసారి విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, ఫార్మా సిస్ట్ నాగలక్ష్మి భారీ స్కామ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. గతేడాది ఈ కేసు మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో పెను సంచలనాన్ని రేపింది. చదవండి: దేవికారాణి ‘రియల్’ దందా!
Comments
Please login to add a commentAdd a comment