Devika Rani
-
దిలీప్ కుమార్ ఎందుకు పేరు మార్చుకున్నారో తెలుసా?
ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ మరణం చిత్రపరిశ్రమను అశనిపాతంలా తాకింది. తన నటనతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసిన ఆయన నేడు(జూలై 7న) అందరికీ వీడ్కోలు చెప్తూ నింగికేగాడు. అందరికీ దిలీప్ కుమార్‌గా సుపరిచితులైన ఆయన అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. సినిమాల్లోకి రాకముందు వరకు ఆయనను అందరూ ఇదే పేరుతోనే పిలిచేవారు. మరి ఆయన పేరెందుకు మార్చుకున్నాడు? ఎవరు మార్చారు? అనేది తెలియాలంటే ఇది చదివేయండి.. యూసఫ్ ఖాన్‌కు నటుడిగా మొదటి ఛాన్స్ ఇచ్చింది నిర్మాత దేవికా రాణి. తను తెరకెక్కించిన 'జ్వర్ భాతా' సినిమా ద్వారా ఆయనను కథానాయకుడిగా పరిచయం చేసింది. అయితే ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముందే అతడికి పేరు మార్చుకోమని సలహా ఇచ్చింది. నిన్ను నటుడిగా ఆవిష్కరించబోతున్నానని, దానికంటే ముందు నీకు స్క్రీన్ నేమ్ ఉంటే బాగుంటుందని యూసఫ్ ఖాన్‌తో చర్చించింది. అప్పుడు ఆ స్క్రీన్ నేమ్‌తోనే అందరూ పిలుస్తారని, అందులోనూ రొమాంటిక్ ఇమేజ్ ఉన్న పేరైతే బాగుంటుందని అభిప్రాయపడింది. అంతేకాక ఏ పేరు పెడితే బాగుంటుందా? అని ఆలోచిస్తున్న సమయంలో దిలీప్ కుమార్ అనే పేరును కూడా ఆవిడే సూచించింది. ఆ పేరు తనకు కూడా సమ్మతమే కావడంతో యూసఫ్ ఖాన్ కాస్తా దిలీప్ కుమార్‌గా స్థిరపడ్డాడు. -
వాల్తేరులో పుట్టిన అగ్గిబరాటా
ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా అందరూ కీర్తించే దేవికా రాణి మన వాల్తేరులో పుట్టింది. మరణించే నాటికి బెంగళూరులో 450 ఎకరాల విలువైన ఎస్టేట్‌ను వారసులు లేకపోవడం వల్ల ఎవరికి చెందాలో తేల్చక వదిలిపెట్టింది. ఆమె 1933లోనే తెర మీద ముద్దు సన్నివేశంలో నటించింది. దిలీప్ కుమార్‌ను స్టార్‌ను చేసింది. ఈ రాణి గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలు... సాధారణంగా మగవాళ్లు లిఖించే చరిత్రలే నమోదవుతూ ఉండే సందర్భంగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించి కొత్తదార్లు, వేర్లూ వేసిన దేవికా రాణిని మాత్రం అందరూ మార్గదర్శిగా గుర్తించి గౌరవిస్తారు. ఆమెను ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా’గా అభివర్ణిస్తారు. అందుకు కారణం ఆమె చేసిన ఘనమైన పనులే. వాల్తేరులో సంపన్న బెంగాలీ కుటుంబానికి దేవికా రాణి జన్మించింది. ఆమె తండ్రి కల్నల్ మన్మథనాథ్ చౌదరి జన్మతః జమీందార్. తల్లి లీలాదేవి చౌదరి సాక్షాత్ రవీంద్రనాథ్ టాగూర్‌కు మేనకోడలు. అందుకని దేవికా రాణి 9 ఏళ్లకే లండన్ వెళ్లి అక్కడి బోర్డింగ్ స్కూల్లో చదువుకుంది. అక్కడే పరిచయమైన బారిస్టర్ చదువు చదివి సినిమా దర్శకుడైన హిమాంశును ప్రేమించింది. అతని కోరిక మేరకు సినిమా నటిగా మారింది. దానికి ముందే ఆమె సినిమా కళను అభ్యసించింది. మొత్తం మీద సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్‌ల అధ్యయనం తర్వాత ఆ జంట ఇండియా తిరిగి వచ్చి ముంబైలో ‘బాంబే టాకీస్’ను ప్రారంభించి సినిమాలు తీసి చరిత్ర సృష్టించారు. తెర మీద ముద్దు వెండి తెర మీద తొలి ముద్దు సన్నివేశంలో నటించిన భారతీయ నటి దేవికా రాణీయే. 1933లో తీసిన ‘కర్మ’ సినిమా కోసం భర్త హిమాంశును ఆమె నాలుగు నిమిషాలు ముద్దు పెట్టుకుంది. ఇప్పటికీ కూడా ఇది రికార్డు. ఆ తర్వాత అశోక్ కుమార్‌తో కలిసి ఆమె నటించిన ‘అఛూత్ కన్య’ సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత అశోక్ కుమార్‌తో ఆమె చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. అశోక్ కుమార్ ఆ సంస్థలో భాగస్వామి కూడా అయ్యాడు. దేవికా రాణి నటుడు దిలీప్ కుమార్‌ను హీరోను చేసింది. ఆ రోజుల్లో (1944) దిలీప్ కుమార్‌కు 250 రూపాయలు జీతం ఆఫర్ చేస్తే అతను అది నెలకా సంవత్సరానికా తేల్చుకోలేక సతమతమయ్యాడు. కాని ఆమె ఇచ్చింది నెలకే! అప్పటికి రాజ్ కపూర్‌కు సంవత్సరమంతా కలిపి ఆర్.కె. స్టూడియోలో 150 రూపాయల జీతం వచ్చేది. అలాంటి ప్రభావం దేవికా రాణిది. అశోక్ కుమార్, దేవికారాణి భర్తతో విడిపోయి భర్త హిమాంశు జీవించి ఉండగానే అతనితో వైవాహిక బంధంలో ఉండకుండా కేవలం ప్రొఫెషనల్ బంధంలోనే ఉండిపోయింది దేవికా రాణి. భర్త చనిపోయాక కొన్నాళ్లకు ఆమె రష్యన్ చిత్రకారుడు శ్వెతోస్లవ్ రోరిచ్‌ను వివాహం చేసుకుని మనాలిలో ఉండిపోయింది. ఆ సమయంలో ఆమెకు నెహ్రూ కుటుంబం సన్నిహితమైంది. ఆ తర్వాత ఆ జంట బెంగళూరు వచ్చి 450 ఎకరాల ఎస్టేట్ కొని అందులో ఎవరినీ కలవక జీవించారు. ఆమె దగ్గర పని చేసిన మేనేజర్ ఒకామె ఆమె ఎస్టేట్ విషయాలు గోల్మాల్ చేసిందనే విమర్శలు వచ్చాయి. దేవికా రాణి మరణించాక ఆ ఎస్టేట్‌ను సొంతం చేసుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేసింది. చివరకు సొంతం చేసుకుంది. వెండితెర గతిని మార్చిన దేవికా రాణి ముంబైకి, వెండితెర వ్యక్తులకు దూరంగా జీవించడం ఒక విచిత్రం. 1994లో ఆమె మరణించాక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. -
ఈఎస్ఐ కేసు: కోటి 99 లక్షలు సీజ్!
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన కోటి 99 లక్షలను బుధవారం ఏసీబీ సీజ్ చేసింది. తెలంగాణతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో దేవికారాణితో పాటు ఆమె కుటుంబ సభ్యులు చిట్ ఫండ్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రతి నెల చిట్ ఫండ్ కంపెనీకి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఏసీబీ అధికారులు సదరు చిట్‌ఫండ్ కంపెనీనుంచి కోటి 99 లక్షల రూపాయల డీడీని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే దేవికారాణికి సంబంధించి రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల నగదుతో పాటు రెండు కోట్ల 29 లక్షల రూపాయలను డీడీల రూపంలో స్వాధీనం చేసుకున్నారు. -
ఈఎస్ఐ స్కాంలో దేవికారాణికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కాంలో ప్రధాన నిందితురాలిగా ఉన్న దేవికారాణికి ఏసీబీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆమెతో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, ఫార్మసీస్ట్ వసంత, మరో ఇద్దరు ఫార్మా ఉద్యోగులకు కోర్టు బెయిలు మంజూరు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కిట్లు, ఫార్మా కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవకతవకల్లో రూ.కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఐటీతోపాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అవతవకల ద్వారా వచ్చిన సొమ్ముతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మ తదితరులు భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన విషయాన్ని ఏసీబీ తన దర్యాప్తులో వెల్లడించింది. దేవికారాణిపై దాడుల సమయంలో ఇందుకు సంబంధించిన పలు రసీదులు దర్యాప్తు అధికారులకు లభించడంతో ఈ విషయం వెలుగుచూసింది. -
దేవికారాణి నగలపై ఈడీ ఆరా!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కిట్లు, ఫార్మా కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవకతవకల్లో రూ.కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ ఏసీబీ విచారణ మొదలుపెట్టింది. ఈ కేసును ఐటీతోపాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఈడీ తన దర్యాప్తులో భాగంగా దేవికారాణి భర్త గురుమూర్తి స్టేట్మెంట్ను రికార్డు చేసింది. దేవికారాణి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ జ్యువెలరీ షాపులో రూ.7 కోట్లకు పైగా విలువ చేసే బంగారం కొనుగోలు చేసినట్లు తేలింది. సదరు నగల షాపు యజమానుల వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసింది. అయితే తమ బంధువుల డబ్బుతో ఈ బంగారం కొనుగోలు చేశామని గురుమూర్తి స్టేట్మెంట్లో పేర్కొన్నారు. (దేవికారాణి ‘రియల్’ దందా!) ముడుపుల మళ్లింపు..! ఈ అవతవకల ద్వారా వచ్చిన సొమ్ముతో మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మ తదితరులు భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన విషయాన్ని ఏసీబీ తన దర్యాప్తులో వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రధాన నిందితులంతా ఎక్కువగా భూములే కొన్నారు. వీరిలో దేవికారాణి మాత్రం భూములతో పాటు నగలపైనా దృష్టి సారించారు. అందుకే తనకు ముడుపులుగా అందిన నగదును నగరంలోని ప్రముఖæ నగల షాపులో అభరణాలు కొనేందుకు మళ్లించినట్లు గుర్తించారు. (ఈఎస్ఐ స్కాం: నిందితులకు 14 రోజుల రిమాండ్) చాలా సందర్భాల్లో ఆమెకు అందాల్సిన ముడుపులను తాను తీసుకోకుండా తన మనుషుల ద్వారా జ్యువెలరీస్‌కు మళ్లించి నగలకు ఆర్డర్ ఇచ్చేదని సమాచారం. ఈ క్రమంలోనే దాదాపు రూ.7 కోట్ల డబ్బును దేవికారాణి నగల కోసం చెల్లించింది. పూర్తి మొత్తం చెక్కులు, ఆన్లైన్ కంటే అధికంగా నగదు రూపంలో వచ్చినప్పటికీ.. నగల షాపు యాజమాన్యం కూడా ఎలాంటి అభ్యంతరం తెలపకపోవడం గమనార్హం. దేవికారాణిపై దాడుల సమయంలో ఇందుకు సంబంధించిన పలు రసీదులు దర్యాప్తు అధికారులకు లభించడంతో ఈ విషయం వెలుగుచూసింది. -
ఈఎస్ఐ స్కాం: నిందితులకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ కుంభకోణం కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి సహా తొమ్మిది మంది నిందితులను చంచల్‌గూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈకేసులో అరెస్ట్‌ను సవాలు చేస్తూ నిందితుల తరఫు న్యాయవాదులు ఏబీసీ కోర్టులో పిటిషనల్ దాఖలు చేశారు. ఉదేశ్య పూర్వకంగానే తమ క్లయింట్ లను ఇబ్బంది పెడుతున్నారంటూ వాదిస్తున్నారు. ఇదే తరహా కేసుల్లో గత సుప్రీం తీర్పులను కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. పాత కేసుకు ప్రస్తుత కేసుకు నిందితుల పై ఒకే తరహా అభియోగాలు మోపారని నిందితుల తరుఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. (ఈఎస్ఐ స్కాం: మరోసారి దేవికారాణి అరెస్ట్) కాగా శుక్రవారం దేవికారాణి, కంచర్ల శ్రీహరి బాబు అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్‌లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ స్కామ్‌లో ఏసీబీ అధికారులు 6.5 కోట్ల రూపాయల అవినీతిని గుర్తించారు. దేవికారాణిని మొదటిసారి అరెస్ట్ చేసిన తర్వాత ఆమెకు సంబంధించిన 35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి ఏసీబీ సీజ్ చేసింది. -
ఈఎస్ఐ స్కాం: మరోసారి దేవికారాణి అరెస్ట్
-
ఈఎస్ఐ స్కాం: మరోసారి దేవికారాణి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మెడికల్ కిట్ల కొనుగోళ్లలో మాజీ డైరెక్టర్ దేవికారాణితో సహా 9 మందిని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. మెడికల్ కిట్ల కొనుగోలులో వాస్తవ ధర కన్నా అనేక రెట్లు పెంచి ప్రభుత్వా నికి దాదాపుగా రూ.6.5 కోట్లు నష్టం కలిగించా రన్న అభియోగాలపై తాజాగా ఈ కేసు నమోదైంది. ఓమ్ని ఫార్మా ఎండీ కంచర్ల హరిబాబు, ఐఎంస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మతో సహా 9 మందిని శుక్రవారం అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. -
ఈఎస్ఐ స్కాంలో మరో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈఎస్ఐ స్కాంలో మరో 6.5 కోట్ల అక్రమాలను గుర్తించినట్లు గురువారం ఏసీబీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది.వారిలో కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్ తదితరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దీంతో పాటు నిందితుల ఇళ్లలో, కార్యాలయాల్లో 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ఈ కేసులో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ కె.వసంత ఇందిరాలపై కేసు నమోదు చేశారు. కాగా కేసుకు సంబంధించి ఏసీబీ తన విచారణను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. -
ఈఎస్ఐ స్కామ్: ఏసీబీ దర్యాప్తు వేగవంతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాం కేసులో ఏసీబీ దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితురాలుగా ఉన్న మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయట పడుతోంది. సైబరాబాద్‌లో కమర్షియల్ రెసిడెన్షియల్ స్థలం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇచ్చిన రూ. 4 కోట్ల 47 లక్షల రూపాయలను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంట్లో దొరికిన డాక్యుమెంట్ల ప్రకారం బంగారపు ఆభరణాలు ఎక్కడికి తరలించారు అన్న అంశాలపై ఏసీబీ విచారణ చేస్తోంది.ఇంట్లో దొరికిన పత్రాల ఆధారంగా 10 కోట్ల బంగారు ఆభరణాలు రహస్య ప్రాంతంలో దాచిపెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తుంది. స్కామ్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఆమె కు సంబంధించిన 35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి ఏసీబీ సీజ్ చేసింది. అయితే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ 200 కోట్ల ఉందంటున్న ఏసీబీ భావిస్తోంది. దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఏసీబీ నమోదు చేసింది. ఒక పక్క విచారణ కోనసాగుతుండగానే నిందితులు తమ ఆస్తులను, బంగారపు ఆభరణాలను పక్క ప్లాన్ తో దారి మళ్లించినట్లు ఏసీబీ భావిస్తోంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 25 మంది నిందితులకు సంబంధించిన వందల కోట్ల ఆస్తులను ఏసీబీ సీజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ నిందితులకు సంబంధించి కోట్ల రూపాయలు బయట పడడంతో ఏసీబీ షాక్ గురైంది. దేవికారానికి నోటీసులు ఇచ్చి మరోసారి విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, ఫార్మా సిస్ట్ నాగలక్ష్మి భారీ స్కామ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. గతేడాది ఈ కేసు మెడికల్ డిపార్ట్మెంట్లో పెను సంచలనాన్ని రేపింది. చదవండి: దేవికారాణి ‘రియల్’ దందా! -
దేవికారాణి ‘రియల్’ దందా!
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్)లో మందుల కొనుగోళ్లలో జరిగిన అవినీతి జాడలు తవ్వినకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. ఆమె రియల్ ఎస్టేట్ లావాదేవీ లను సైతం మంగళవారం వెలుగులోకి తెచ్చింది. దేవికారాణి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ రెసిడెన్షియల్ వెంచర్లో చదరపు అడుగుకు రూ.15 వేల విలువ కలిగిన 6 ఫ్లాట్లను కుటుంబ సభ్యుల పేరిట కొనేందుకు ఫార్మాసిస్ట్ నాగలక్ష్మితో కలిసి రూ.4.47 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించింది. ఇందులో దేవికారాణి వాటా రూ.3.75 కోట్లు కాగా, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి వాటా రూ.72 లక్షలని ఏసీబీ తేల్చింది. ఈ మొత్తం.. లెక్కల్లోలేని నగదుగా గుర్తించింది. ఈ పెట్టుబడుల్లో రూ.22 లక్షలు బినామీదార్ల పేరిట దేవికారాణి ఇన్వెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఫ్లాట్ల కొనుగోలుకు రూ.2,29,30,000 మొత్తాన్ని చెక్కులు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆమె చెల్లించినట్టు చెప్పారు. బయటపడిన నోట్ల కట్టలు ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులు సంబంధిత వెంచర్ డెవలపర్‌కు నోటీసులు అందజేశారు. ఆస్తులు అటాచ్ చేస్తామంటూ నోటీసుల్లో హెచ్చరించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తన ఖాతాకు దేవికారాణి, నాగలక్ష్మి పంపిన మొత్తం డబ్బును సదరు డెవలపర్ డ్రా చేసి ఏసీబీకి తిరిగి అప్పగించాడు. భారీ మొత్తం కావడంతో రూ.500, రూ.2,000 నోట్లకట్టలు నాలుగు టేబుళ్లను ఆక్రమించాయి. తాజా ఉదంతంలో రూ.4.47 కోట్లు దొరకడంతో కీసర తహసీల్దార్ వద్ద లభించిన రూ.కోటీ పది లక్షల రికార్డును తిరగరాసినట్లైంది. -
ఏసీబీ చేతికి దేవికారాణి ఐటీ వివరాలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కొనుగోళ్లలో అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తులో మరో ముందడుగేసింది. ఈ కేసు వెలుగుచూసినప్పటి నుంచి దేవికారాణి ఆస్తులపై ఏసీబీ కూపీలాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దేవికారాణి ఆదాయ వ్యయాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ నుంచి సమగ్ర వివరాలు అవినీతి నిరోధక శాఖకి అందినట్లు సమాచారం. దేవికారాణి ఐటీ రిటర్నులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని గత నెలలో ఏసీబీ కోరిన నేపథ్యంలో 2014 నుంచి 2019 వరకు ఆమె చెల్లించిన పన్నులకు సంబంధించిన పూర్తి వివరాలను ఐటీ శాఖ లేఖ ద్వారా అందజేసింది. శ్రీహరి వివరాలు ఇలాగే ఈ కేసులో శ్రీహరి వివరాలు తెలుసుకున్న పంథాలోనే ఏసీబీ దేవికారాణి ఐటీ వివరాలనూ సేకరించింది. శ్రీహరి ఏటా రూ.19 కోట్లు ఐటీ కట్టినట్లు తేలింది. ఇదే తరహాలో రూ.100 కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టిన దేవిక ఐటీ రిటర్నులను పరిశీలించాలని ఏసీబీ నిర్ణయించింది. మరోసారి కస్టడీకి... ఐఎంఎస్ కేసులో 22 మందిని ఏసీబీ అరెస్టు చేసింది. త్వరలోనే దేవికారాణి, పద్మలను మళ్లీ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు వీరు పలుచోట్ల కొనుగోలు చేసిన ఆస్తులు, చెల్లించిన ఆస్తుల రిటర్నులపై ఆరా తీసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
ఖాళీ ఇన్వాయిస్లతో కాజేశారు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ కలకుంట్ల పద్మలు నకిలీ బిల్లులతో, బినామీ కంపెనీలతో ఇష్టానుసారంగా పాల్పడ్డ అక్రమాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దేవికారాణికి ఈ కుంభకోణంలో సహకరించిన సికింద్రాబాద్‌లోని విశాల్ ఎంటర్ ప్రైజెస్‌కి చెందిన పందిల్ల భూపాల్‌రెడ్డి, సికింద్రాబాద్‌లోని వసుధ మార్కెటింగ్‌కి చెందిన రెడ్డిమల్లి నాగేందర్‌రెడ్డిలను ఏసీబీ శనివారం అరెస్టు చేసింది. ఎలా మోసం చేశారంటే..? ఎలాంటి టెండర్లు లేకుండా నాన్ రేటెడ్ కంపెనీ (ఎన్ఆర్సీ)లతో కుమ్మక్కయిన దేవికారాణి కొందరితో ఏకంగా డొల్ల కంపెనీలు ప్రారంభించింది. తేజ ఫార్మా కంపెనీకి చెందిన పందిరి రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు ఈ దందాలో భూపాల్‌రెడ్డి, నాగేందర్‌రెడ్డి బాగా సహకరించారు. అధిక ధరలకు కోట్ చేసిన ఖాళీ బిల్లులు, ఇన్వాయిస్లు, సాఫ్ట్‌కాపీలు సృష్టించి, సనత్‌నగర్‌లోని దేవికారాణి నమ్మిన బంటు ఫార్మాసిస్టు కొడాలి నాగలక్షి్మకి ఇచ్చేవారు. ఆమె వాటిని దేవికారాణి వద్దకు తీసుకెళ్లి సంతకాలు చేయించి నిధులు విడుదలయ్యేలా చూసేది. వీరిచేత దేవికారాణి దాదాపు 25 డొల్ల కంపెనీలు తెరిపించినట్లుగా ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. లేని కంపెనీలతో బిల్లులు పెట్టడం, వాటికి చెల్లింపులు చేయడం, తర్వాత అంతా కలిసి పంచుకోవడం ద్వారా ఈఎస్ఐ సొమ్మును కాజేశారని ఏసీబీ ఉన్నతాధికారులు వివరించారు. వచ్చిన సొమ్ముతో భూముల కొనుగోలు డొల్ల కంపెనీలు తెరిపించడంలో, నకిలీ బిల్లులు సృష్టించడంలో తేజఫార్మా, దేవికారాణికి సహకరించినందుకు వీరికీ భారీగా ముడుపులు ద క్కాయి. ఈ డబ్బులతో భూపాల్‌రెడ్డి, నాగేందర్‌రెడ్డిలు కామారెడ్డి జిల్లా బికనూర్ వద్ద భారీగా వ్యవసాయ భూములు కొనుగోలు చేశారని విచారణలో తేలింది. నిందితులిద్దరిపైనా కుట్ర, మో సం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌పై చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
ఈఎస్ఐ స్కాం: మరో ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల గోల్మాల్ కేసులో అరెస్ట్‌ల పర్వం ఇంకా కొనసాగుతూ ఉంది. తాజాగా మరో ఇద్దరిని అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. మెడికల్ ఏజెన్సీ ప్రతినిధులుగా వ్యవహరించిన భూపాల్ రెడ్డి, నాగేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి బినామీ కంపెనీలకు వీరిద్దరూ సహకరించినట్లు ఏసీబీ విచారణలో వెల్లడి అయింది. ఫార్మా కంపెనీల పేరుతో తప్పుడు లెక్కలు చూపించి, అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు నిర్థారణకు వచ్చారు. -
దేవికారాణి.. కరోడ్‌పతి
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో మరో సంచలనం వెలుగుచూసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు, ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఆమె బంధువుల ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో చేసిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఈ ఆస్తులన్నీ దేవికారాణి, ఆమె భర్త గురుమూర్తి కుటుంబసభ్యుల పేరిట ఉన్నాయి. గురువారం హైదరాబాద్, తిరుపతి, కడపలోని ఆమె బంధువుల ఇళ్లల్లో అధికారులు సోదాలు చేసి పలు కీలక డాక్యుమెంట్లు, భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.25 కోట్లుగా లెక్కగట్టారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.250 కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐఎంఎస్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో పలు ఫార్మా కంపెనీలతో కుమ్మక్కయి అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టులు అప్పగించి రూ.కోట్లల్లో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలకు ఏసీబీ అధికారులు భారీగా ఆధారాలు సంపాదించారు. దిమ్మతిరిగేలా ఆస్తులు.. ఐఎంఎస్‌లో కోట్ల రూపాయల అవినీతి జరిగిన కేసులో ఇప్పటిదాకా మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మలతోపాటు పలువురు ఫార్మా కంపెనీల యజమానులు, వారి బినామీలను ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బుధవారం దేవికారాణి భర్త గురుమూర్తి అరెస్టుతో ఈ సంఖ్య 18కి చేరింది. అనంతరం అతడిని చంచల్‌గూడ జైలుకు రిమాండ్ కోసం తరలించారు. ఏసీబీ దాడుల్లో ఆమె విలాసవంతమైన ఆస్తులు చూసి అధికారులే విస్తుపోయారని విశ్వసనీయ సమాచారం. విల్లాలు, అపార్ట్మెంట్లు, స్థలాలు, ఇళ్లు, నగలు, లగ్జరీ కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కోట్ల రూపాయల డిపాజిట్లను గుర్తించారు. లగ్జరీ కార్లను కుటుంబసభ్యుల పేరిట కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏపీలో అమరావతి, తిరుపతి, వైజాగ్‌లో, తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లా రామాయంపేట, చేగుంట, రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఉన్నాయని వెల్లడించారు. ఐఏఎస్ అధికారి పాత్రపైనా ఆధారాలు? ఆమెకు చెందిన స్థిరాస్తుల డాక్యుమెంట్ విలువ రూ.25 కోట్లు ఉండగా.. బహిరంగ మార్కెట్లో రూ.250 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు దాడుల్లో దొరికిన వివరాలన్నీ చూస్తే దేవికారాణి ఆస్తులు రూ.350 కోట్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఒక్క పీఎంజే జ్యువెల్లరీస్‌కే నగల కోసం ఏకంగా రూ.7.3 కోట్లు చెల్లించినట్లు తేలింది. ఈ కేసులో దేవికారాణి బినామీలైన నాగలక్ష్మి, వీరన్న ఆస్తుల లెక్క తేలాల్సి ఉంది. మరో బినామీని త్వరలోనే ఏసీబీ అరెస్టు చేయనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పాత్రపైనా ఏసీబీ కొన్ని ఆధారాలు సంపాదించినట్లు సమాచారం. సదరు ఐఏఎస్‌కు కూడా ముడుపులు అందాయని మొదటి నుంచీ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన పాత్రపై మరిన్ని ఆధారాలు లభించి, స్పష్టత వస్తే ఈ కేసు మరో మలుపు తిరగనుంది. -
మాకేం గుర్తులేదు.. తెలియదు..
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల గోల్ మాల్ నిందితులు ఏసీబీకి సహకరించడం లేదు. ఏ ప్రశ్న అడిగినా.. తెలియదని, గుర్తులేదని చెబుతున్నారు. ఈ కేసులో ఇటీవల రెండో కేసు నమోదు చేసిన ఏసీబీ నిందితులను 3 రోజుల కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మ, వసంత్ ఇందిరా, ఓమ్నీ ఫార్మా ఎండీ శ్రీహరిబాబు, మెడికల్ రిప్రజెంటేటివ్ నాగరాజులను శనివారం ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. తొలిరోజు ఏసీబీ ప్రశ్నలపై నోరు మెదపని నిందితులు, రెండోరోజైన ఆదివారం అదే పంథా అనుసరించారు. ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు మౌనంగా ఉండటం, గుర్తులేదు, తెలియదు అంటూ సమాధానాలు దాటవేయడంతో విచారణాధికారులు తలలు పట్టుకుంటున్నారు. రెండోసారి చాలా మార్పు.. తొలుత కస్టడీలోకి తీసుకున్నపుడు నిందితులు చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, విచారణకు సహకరించారని, పలు సందర్భాల్లో చేసిన తప్పులను తలచుకుని ఏడ్చారని గుర్తు చేశారు. మాజీ జేడీ పద్మ అయితే.. చంచల్‌గూడ జైల్లో అధిక మొత్తంలో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం కూడా చేసిన సంగతి తెలిసిందే. రెండోసారి విచారణలో నిందితులు వ్యూహాత్మకంగా, తెలివిగా సమాధానాలు దాటేయడం అధికారులకు ఇబ్బందిగా మారింది. డొల్ల కంపెనీలపై రెండో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు డొల్ల కంపెనీలు ఎలా నిర్వహించారు, మెడికల్ కిట్లు ఎలా పంపారు? ధర ఎవరు నిర్ణయించారు? రేటెడ్ కంపెనీ(ఆర్సీ)లను వదిలి.. నాన్‌రేటెడ్ (ఎన్ఆర్సీ) కంపెనీల వైపు ఎందుకు మొగ్గు చూపాల్సి వచ్చింది. ఆర్సీ కంపెనీలకు బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టారు? అన్న విషయాలపై ప్రశ్నించినా.. దేవికారాణి, పద్మలు సమాధానాలు గుర్తులేవని చెప్పినట్లు సమాచారం. ఇక బంగారు ఆభరణాల విషయం గురించి, ఓ జ్యువెల్లరీ షోరూంలోనే ఎందుకు బంగారం కొనాల్సి వచి్చంది? ఆ మొత్తాన్ని ఎలా చెల్లించారు? అన్న ప్రశ్నలకు దేవికారాణి మౌనం వహించినట్లు తెలిసింది. ఇక సాయంత్రం నిందితులందరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. మొత్తం కుంభకోణం విలువ రూ.700 కోట్లపైమాటే అని ఈఎస్ఐ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో సేకరించింది చాలా తక్కువని, తవ్వాల్సిన అక్రమాలు చాలా ఉన్నాయంటున్నారు. -
ఈఎస్ఐ స్కాం: వెలుగు చూస్తున్న దేవికారాణి లీలలు
-
దేవికా రాణి ఆఫీసులోనే పార్టీలు
-
జల్సా రాణి..!
-
దేవికారాణి, నాగలక్ష్మిల విలాస జీవితాలు!
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ దేవికారాణికి సంబంధించి ప్రతిరోజూ కొత్త లీలలు వెలుగుచూస్తున్నాయి. అక్రమంగా దోచుకున్న డబ్బుతో ఆమె విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గుర్తించారు. ఆమె అక్రమాస్తులు, చేసిన విలాసాలు, వాటికి వెచ్చించిన డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది అన్న విషయాలపై ఏసీబీ ఇప్పటికే కూపీ లాగడం ప్రారంభించింది. మందుల డబ్బును దోచుకునేందుకు అందుబాటులో ఉన్న అన్నిరకాల అడ్డదారులను ఆమె ఉపయోగించారు. ఇటీవల ఈ కేసులో తేజా ఫార్మా ఎండీ సోదరుడు శ్రీనివాసరెడ్డి ఇంట్లో దాడులు చేసిన ఏసీబీ శుక్రవారం అతన్ని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తన వద్ద పనిచేసే కొడాలి నాగలక్ష్మి సాధారణ ఫార్మాసిస్ట్ అయినప్పటికీ ఆమె కూడా కోట్ల రూపాయల అక్రమార్జన గడించడం విశేషం. వీరిద్దరి అరాచకాలను గతంలోనే ‘సాక్షి’బయటపెట్టిన విషయం తెలిసిందే. చదవండి: రూ.3 కోట్లతో నగలు కొన్న దేవికారాణి డొల్ల కంపెనీల దందా.. డైరెక్టర్‌గా ఉన్న కాలంలో దేవికారాణి అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆమెకు.. నాన్ రేటెడ్ కంపెనీ (ఎన్ఆర్సీ)ల నుంచి వచ్చే కమీషన్లు సరిపోలేదు. అందుకే తన అనుచరురాలు ఫార్మాసిస్ట్ నాగలక్ష్మితో కలసి 2 డొల్ల కంపెనీలు సృష్టించారు. ఇందులో మహీధర మెడికల్ అండ్ సర్జికల్స్‌ను నాగలక్ష్మి బంధువైన ఎం.మురళీకృష్ణ పేరుపై ఉంచగా, మురళీకృష్ణ భార్య ఎం.విజయలక్ష్మీ పేరిట జై సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్ను స్థాపించారు. వీటిని తేజా ఫార్మాస్యూటికల్స్ ఎండీ రాజేశ్వర్‌రెడ్డి 2016లో రిజిస్టర్ చేయించారు. ఈ వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బంది ఆమెకు సహకరించినట్లుగా ఏసీబీ గుర్తించింది. విందులు.. విలాసాలు.. అక్రమమార్గంలో కోట్ల రూపాయలు సంపాదించిన డబ్బును దేవికారాణి, నాగలక్ష్మి, రాజేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగీ కలలో కూడా ఊహించనంత డబ్బు రావడంతో జల్సా జీవితాలకు అలవాటు పడ్డారు. ఖరీదైన హోటళ్లలో బర్త్‌డే పార్టీలు, విందులు, వినోదాలు, పబ్‌లు అంటూ అందుబాటులో ఉన్న ప్రతీ విలాసాన్నీ అనుభవించారు. తేలిగ్గా వస్తున్న డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలియక వీరు చాలా కొత్త పనులు ముందేసుకునేవారు. ఆఫీసులో సందర్భాలను సృష్టించుకుని అందులో డ్యాన్సులు చేయడం, పార్టీలు జరుపుకునేవారు. ఆ పార్టీల్లో దేవికారాణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు తహతహలాడేవారు. ప్రత్యేకంగా బ్యూటీషియన్లు, డ్యాన్స్ మాస్టర్లను పెట్టుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవారు. స్వయంగా అన్ని వేడుకల్లో ఆమెనే నర్తించేవారు. అంతేకాదు ఆత్మరక్షణ కోసం నాన్చాక్ తిప్పడం కూడా నేర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మోసం చేసిందిలా..? ►1. 2016–18లో మహీధర మెడికల్ అండ్ సర్జికల్స్ కంపెనీకి రూ.3,69,58,500 విలువైన పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ మందులు రేట్ కాంట్రాక్ట్ కంపెనీ (ఆర్సీ)ల ద్వారా కొనుగోలు చేస్తే వాస్తవానికి కేవలం రూ.61,99,972 మాత్రమే ఖర్చయ్యేది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రూ.3,07,58,528 నష్టం వాటిల్లింది. ►2. జై సాయిరాం కంపెనీకి రూ.4 కోట్ల పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారు. ఇదే రేటెడ్ కంపెనీలో వీటి విలువ రూ.1.12 కోట్లు మాత్రమే. ఫలితంగా 2.88 కోట్లు నష్టం వాటిల్లింది. ►3. రాజేశ్వర్‌రెడ్డి తమ్ముడు శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వైష్ణవి ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.5.50 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చారు. ఇవి రేట్ కాంట్రాక్ట్ ప్రకారం రూ.1.41 కోట్లు మాత్రమే. ఫలితంగా ప్రభుత్వానికి రూ.4.09 కోట్లు నష్టం వాటిల్లింది. ►4. తేజా ఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి, అతడి సోదరుడు శ్రీనివాసరెడ్డిలకు మొత్తం 8 డొల్ల కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు వచ్చిన కాంట్రాక్టులన్నీ నిబంధనలకు విరుద్ధంగా దేవికారాణి కట్టబెట్టినవే కావడం గమనార్హం. ►5. ఇలా వచ్చిన ఆదాయాన్ని పీఎంజే జ్యువెలరీస్‌కు మళ్లించారు. అయితే అక్కడ నుంచి కేవలం నగల కొనుగోలుకే పరిమితమయ్యారా? ఇంకేదైనా లావాదేవీలు జరిపారా? అన్న విషయంలో ఏసీబీ లెక్కలు తవ్వుతోంది. ►6. మహీధర మెడికల్ అండ్ సర్జికల్, జై సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్, ఎస్ఎస్ అసోసియేట్స్, సాయి శ్రీనివాస తదితర కంపెనీలకు ప్రాసెసింగ్, ఇన్వాయిస్, కొటేషన్స్ చేసి దాని ద్వారా వచ్చిన సొమ్మును నేరుగా అప్పటి డైరెక్టర్ దేవికారాణికి లేదా ఆమె సూచించిన వ్యక్తులకు అందజేసేవారు. ►7. మొత్తంగా ఇలా అక్రమమార్గాల్లో దాదాపు రూ.10.85 కోట్ల మేరకు దేవికారాణి ముఠా కాజేసినట్లు ఏసీబీ పరిశీలనలో వెల్లడైంది. ►8. ప్రభుత్వ జీవో నం.51 ప్రకారం రేటెడ్ కంపెనీల ద్వారా మందులు కొనాలి. కానీ, నిబంధనలను తుంగలో తొక్కిన దేవికారాణి.. రేటెడ్ కంపెనీలను పక్కనబెట్టి, తన బినామీలు సమర్పించిన నాన్‌రేటెడ్ కంపెనీలకు ముందుగా బిల్లులు చెల్లించేది. అందుకు రేటెడ్ కంపెనీల పనితీరు బాగా లేదని నిందలు వేసి నాన్‌రేటెడ్ కంపెనీలకు వాస్తవ ధర కంటే 10 రెట్లు అధికంగా కట్టబెట్టేది. ►9. ఈ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగించేందుకు అంతకుముందున్న నిబంధనలకు తిలోదకాలిచ్చి ఎస్డీడీయూ (స్పెషల్ డ్రగ్ డిస్పెన్సరీ యూనిట్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. దానికి సనత్‌నగర్‌లో ఓ గోదాము ఏర్పాటు చేసింది. ఇక్కడ మందులు వచ్చినట్లు బిల్లులు సృష్టించి వాటిని తన అనుచరులతో డ్రా చేసుకునేది. -
అవినీతి సొమ్ముతో ఆభరణాలు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో వెలుగుచూసిన మందుల కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దేవికారాణికి చెందిన డొల్ల కంపెనీలను గుర్తించారు. ఈ కంపెనీలు దేవికారాణితో కలసి మం దుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డ తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి తమ్ముడు శ్రీనివాసరెడ్డి పేరిట ఉన్నాయి. దీం తో గురువారం అల్వాల్‌లోని శ్రీనివాసరెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఇంటి నుంచి పలు కీలక డాక్యుమెంట్లు, బిల్లులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అర్ధరాత్రి వరకు దాడులు కొనసాగాయి. తాజా సమాచారంతో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి. రూ.కోట్లలో ఆర్జన.. ఈఎస్ఐలో ప్రభుత్వ జీవో 51 ప్రకారం.. ఆర్సీ (రేటెడ్ కంపెనీ)లకే మందుల సరఫరా కాంట్రాక్టు ఇవ్వాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎన్ఆర్సీ కంపెనీలకు అవకాశం ఇవ్వాలి. కానీ డైరెక్టర్ హోదాలో ఉన్న దేవికారాణి ఈ లొసుగును ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారన్నది ఏసీబీ అభియోగం. కమీషన్ల కోసం తేజ, ఓమ్ని, మెడీ వంటి కంపెనీల చేత అవసరానికి మించి, అధిక ధరలకు మందులు కొనుగోలు చేయించినట్లు ఏసీబీకి ఆధారాలు దొరుకుతున్నాయి. కాగితాల మీద కంపెనీలు సృష్టించి వాటికి బిల్లులు మంజూరు చేయించుకుని, పంచుకున్నారన్న ఆరోపణలు తాజాగా ఏసీబీ తనిఖీల్లో లభిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో దేవికారాణికి ఫార్మాసిస్ట్ కొడాలి నాగలక్ష్మి సహకరించింది. నకిలీ కంపెనీలకు భారీగా బిల్లులు మంజూరు చేసి వీరిద్దరూ రూ.కోట్లు గడించారు. దేవికారాణి ఏకంగా రూ.3 కోట్లు విలువైన బంగారు ఆభరణాలు కొన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంత డబ్బు ఎక్కడిది? అంత విలువైన ఆభరణాలు ఎలా కొనగలిగారు? అన్న వివరాలపై అధికారులు కూపీ లాగుతున్నారు. రూ.10 కోట్లు దాటిన అక్రమాలు ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల గోల్‌మాల్‌లో మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మలు పోటీపడ్డారు. ఫలితంగా ఈఎస్ఐకి రూ.9.28 కోట్లు నష్టం వాటిల్లింది. తాజాగా 2017–18కి సంబంధించిన 22 ఇండెంట్లలో రెండింటిని విశ్లేషించిన ఏసీబీ అధికారులు రూ.70 లక్షలకుపైగా ఈఎస్ఐ సొమ్ము పక్కదారి పట్టిందని తేల్చారు. దీంతో ఈ వ్యవహా రంలో వెలుగుచూసిన అవినీతి రూ.10 కోట్లు దాటింది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టైన 16 మంది రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సేకరించిన ఆధారాలతో మరిం త మందిని అరెస్టు చేయనున్నారని సమాచారం. -
ఈఎస్ఐ స్కాం: వెలుగులోకి మరో అంశం
-
రూ.3 కోట్లతో నగలు కొన్న దేవికా రాణి
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎఫ్) కుంభకోణం కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తులు జరుపుతున్న విషయం విదితమే. కాగా ఈ కేసులో ఐఎంఎఫ్ డైరెక్టర్ దేవికా రాణితో పాటు పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేయగా.. రోజూరోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో లో ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేయడంతో డైరెక్టర్ దేవికా రాణి డొల్ల కంపెనీల వ్యవహరం వెలుగులోకి వచ్చింది. తేజ ఫార్మా కంపెనీతో రాజేశ్వర్ రెడ్డి తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డి పేరిట రెండు షెల్ కంపెనీలను నడుపుతున్నట్లు తెలిసింది. ఈ కంపెనీల పేరిట దేవికా రాణి, నాగలక్ష్మిలు కోట్ల రూపాయలను దండుకున్నట్లు అధికారులు తెలిపారు. డొల్ల కంపెనీల పేరిట నొక్కేసిన డబ్బుతో దేవికా రాణి రూ.3 కోట్లు విలువ చేసే బంగారం కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం అల్వాల్‌లోని శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లొ, కార్యాలయాల్లో సోదాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. (చదవండి: హెచ్ఐవీ, డయాబెటిస్ కిట్లలో చేతివాటం) -
ఈఎస్ఐ మెడికల్ కిట్ల కొనుగోళ్లలో కొత్తకోణం
-
హెచ్ఐవీ, డయాబెటిస్ కిట్లలో చేతివాటం
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) విభాగంలో మరో కొత్త అవినీతి కోణాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెలికితీసింది. మెడికల్ కిట్ల కోసం పెట్టిన ఇండెంట్లలో గోల్మాల్ జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మతోపాటు ఓమ్నీ మెడీ ఫార్మా కంపెనీల పాత్ర ఉండటం గమనార్హం. ఇప్పటికే ఈ కేసులో దేవికారాణి, పద్మ, ఓమ్ని మెడీ సిబ్బందిని విచారించిన ఏసీబీ అధికారులు రాబట్టిన పలు కీలక విషయాల ఆధారంగా కేసులో ముందుకెళ్తున్నారు. ఏం జరిగింది? ఐఎంఎస్‌లో 2017–18కి సంబంధించిన మెడికల్ కిట్ల కోసం దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగింది. ఈ మొత్తం నిధులతో హెచ్ఐవీ, డయాబెటిస్, హిమోగ్లోబిన్ తదితర కీలక వైద్య పరీక్షలకు సంబంధించిన కిట్లు కొనుగోలు చేయాలి. అయితే అలా కొనుగోలు చేసిన మెడికల్ కిట్లలో సగానికిపైగా ఈఎస్ఐ డిస్పెన్సరీలకు చేరనేలేదని ఏసీబీ దర్యాప్తులో తేలింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 22 పర్చేసింగ్ ఆర్డర్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటిదాకా ఏసీబీ అధికారులు కేవలం 2 పర్చేసింగ్ ఆర్డర్లు మాత్రమే పరిశీలించారు. వీటి ప్రకారం.. హెచ్ఐవీ, డయాబెటిస్, హిమోగ్లోబిన్ కిట్లు ఒక్కోటి రూ.1,750 చొప్పున మొత్తం 1,000 కిట్లు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.1.76 కోట్లు. అందులో 583 కిట్లు స్థానిక ఈఎస్ఐ డిస్పెన్సరీలకు చేరలేదని దర్యాప్తులో వెలుగుచూసింది. వీటి విలువ రూ.1.02 కోట్లుగా తేల్చారు. ఈ కిట్లన్నీ సరఫరా చేసింది ఓమ్నీ మెడీ ఫార్మా కంపెనీగా గుర్తించారు. సదరు సంస్థ యజమాని హరిబాబు, మెడికల్ రిప్రజెంటేటివ్ నాగరాజులు కూడా పాలుపంచుకున్నట్లు సమాచారం. ఏడు డిస్పెన్సరీలు ఇవే..! దేవికారాణి, పద్మ కేంద్రంగా సాగిన ఈ దందాలో కొనుగోలు చేసిన వాటిలో సగానికిపైగా బ్లాక్‌మార్కెట్‌కు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా బొల్లారం, కాటేదాన్, శభాష్‌పల్లి, సదాశివపేట్, బొంతపల్లి, చర్లపల్లి, జహీరాబాద్ ఈఎస్ఐ డిస్పెన్సరీలకు పంపినట్లు రికార్డుల్లో రాసినా.. అక్కడి రికార్డులో పంపినట్లు నమోదు కాకపోవడం గమనార్హం. ఈ మొత్తం నిధులు ఏమయ్యాయి? మధ్యలో ఎవరు పక్కదారి పట్టించారు? అన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా దేవికారాణి, పద్మ కార్యాలయాల్లో కీలకంగా పనిచేసిన వారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. నాలుగేళ్ల అక్రమాలకు సంబంధించి వందలాది పర్చేసింగ్ ఆర్డర్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటిదాకా ఏసీబీ పరిశీలించింది చాలా తక్కువ. 2014 నుంచి 2019 వరకు ఐఎంఎస్‌లో జరిగిన మొత్తం మందుల కొనుగోళ్లను పూర్తిగా పరిశీలించాలంటే ఏసీబీకి మరింత సమయం పట్టేలా ఉంది. -
స్కాంపై ఏసీబీ ప్రశ్నల వర్షం
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సరీ్వసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో నిందితులను ఏసీబీ బుధవారం విచారించింది. విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు సంధించిన ప్రశ్నలకు దేవికారాణి, పద్మ ఇతర సభ్యులు ఉక్కిరిబిక్కిరి అయ్యారని సమాచారం. ఈ కుంభ కోణంలో ముఖ్య నిందితులందరినీ విచారణకు అప్పగించాలని ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ మేరకు న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం ఉదయం నిందితులందరినీ చంచల్‌గూడ జైలు నుంచి మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మలతోపాటు మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిర, మాజీ ఫార్మాసిస్ట్ రాధిక, మాజీ సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్, ఓమ్ని ఫార్మా ప్రతినిధి శివనాగరాజు, ఓమ్ని ఫార్మా ఎండీ శ్రీహరిలను బంజారాహిల్స్‌లోని ప్రధాన కార్యాలయానికి తరలించారు. వీరందరినీ వేర్వేరుగా విచారించారు. అందరికీ ప్రత్యేక ప్రశ్నావళిని ముందే సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా దేవికారాణి, పద్మలు ఏసీబీ అధికారుల ప్రశ్నల ధాటికి ఉక్కిరిబిక్కిరి అయి సరిగా సమాధానం చెప్పలేదని సమాచారం. తొలిరోజు కీలక సమాచారం.. మందుల కొనుగోళ్లకు సంబంధించి జీవో నం.51 ని ఎందుకు అమలు చేయలేదు? మందుల టెండ ర్లకు నోటిఫికేషన్ ఎందుకివ్వలేదు? రిజిస్టర్డ్ కంపెనీలను (ఆర్సీ) కాదని నాన్‌రిజిస్టర్డ్ కంపెనీ (ఎన్ఆర్సీ)లకు మందుల కొనుగోళ్లు ఎందుకు కట్టబెట్టాల్సి వచి్చంది? నిబంధనలను ఎందుకు పాటిం చలేదు? కార్యాలయంలో ప్రైవేటు ఫార్మా కంపెనీల వ్యక్తుల ఇష్టారాజ్యం, వారితో సంబంధాలు, బ్యాంకు ఖాతాలు, ఇతర ఆస్తులకు సంబంధించి విషయాలపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. దేవికారాణి, పద్మలు పలు సమాధానాలు దాటివేసేందుకు ప్రయత్నించినా.. ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా సాక్ష్యాలను ముందుపెట్టేసరికి పలుమార్లు తెల్లముఖం వేసినట్లు సమాచారం. తొలిరోజు చాలా కీలకమైన విషయాలకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని ఏసీబీ రాబట్టగలిగినట్లు తెలిసింది. సాయంత్రం నిందితులందిరినీ తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. విజిలెన్స్‌లోనూ ఇదే ధోరణి.. ఈఎస్ఐలో మందుల కొనుగోలుకు సంబంధించి దేవికారాణి, పద్మలు 2018, 2019లో విజిలెన్స్ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో వీరు ఇచ్చిన సమాధానంతో విజిలెన్స్ సంతృప్తి చెందలే దు. చాలా నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పారని, ఉద్దేశపూర్వకంగా అవినీతికి పాల్పడ్డారని అనుమానించింది. వీరితోపాటు మరికొందరిపై శాఖాపరమైన చర్యలకూ సిఫార్సు చేసింది. -
దేవికారాణి వెనుక ఎవరు?
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) డైరెక్టర్ దేవికారాణి రూ.వందల కోట్ల కుంభకోణం నడిపిందంటే.. సిబ్బంది–కారి్మక సంఘాలు విశ్వసించడం లేదు. కేవలం ఆమె తన ముఠా సభ్యులతో కలిసి ఇన్ని వందల కోట్లను యధేచ్ఛగా మింగుతూ పోతుందంటే.. తప్పకుండా రాజకీయ సహకారం ఉండే ఉంటుందని ఆరోపిస్తున్నారు. నాలుగేళ్లుగా ఆమె దందా సాగుతున్నా ఎవరూ ఎందుకు నోరు మెదపలేదు? విడుదలవుతు న్న నిధులకు అదనంగా నిధులు ఎందుకు కేటాయిం చాల్సి వచి్చంది? నాలుగేళ్లుగా నాన్ రేటెడ్ కంపెనీలకు (ఎన్ఆర్సీ) మందుల కొనుగోళ్లు కాంట్రాక్ట్ ఎం దుకు ఇవ్వాల్సి వస్తోంది? 2014లో రూ.700 కోట్ల మేరకు కొన్న మందుల్లో రూ.300 కోట్లకుపైగా దేవికారాణి, ఆమె ముఠా మింగేశారంటే తప్పకుండా వారి వెనక మరెవరో ఉన్నారనే అనుమానాలు రోజురోజు కు బలపడుతున్నాయి. 2015 నుంచి 2019 వరకు రాష్ట్ర బడ్జెట్లో ఈఎస్ఐకి కేటాయించిన (రూ.1,278 కోట్లు) నిధుల కంటే అధికంగా (రూ.1,616.93 కోట్లు) నిధులు ఖర్చు అయ్యాయి. ఈఎస్ఐలోని మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ 2018, 19లలో విజిలెన్స్ రెండుసార్లు నివేదిక ఇచ్చినా ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడానికి పెద్ద తలలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. సంబంధం ఉన్న కంపెనీలివే..! దేవికారాణి పలు కంపెనీలతో మందుల కొనుగోళ్లు జరిపింది. వీటిలో అక్రమంగా కాంట్రాక్టులు దక్కించుకున్న పలు కంపెనీల ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఈఎస్ఐ కాంట్రాక్టు దక్కగానే అవన్నీ ఆర్థికంగా బలపడ్డాయి. ఆర్థికంగా చితికిపోయిన తేజ ఫార్మా కంపె నీ దేవికారాణితో చేతులు కలిపాక లాభపడింది. పలు బినామీ కంపెనీలతోపాటు తన కొడుకుని ఆరిజిన్, సెరిడియా, తేజ ఫార్మాల్లో స్లీపింగ్ పార్ట్నర్గా చేసింది. పృథ్వి ఎంటర్ప్రైజెస్, మైత్రి ఫార్మా, మహీధర మెడికల్ అండ్ సర్జికల్స్, ఆర్ఆర్ ట్రేడర్స్, వైష్ణవ ఎంటర్ప్రైజెస్, గాయత్రి ఫార్మా, వసుధ మార్కెటింగ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ సర్జికల్ డి్రస్టిబ్యూటర్స్, సీకోట్రిక్ ఫార్మా, స్వస్తిక్ ఫార్మాస్యూటికల్స్, హిమాలయా ఫార్మసీ, శ్రీరామ ఫార్మా డి్రస్టిబ్యూటర్స్ పేరిట దేవికారాణి తన బినామీలతో నడుపుతోందని ఏసీబీ డీజీకి ఫిర్యాదులు అందాయి. ముగ్గురు బినామీలు.. దేవికారాణి మొత్తం వ్యవహారాన్ని ముగ్గురు వ్యక్తులతో నడిపిందని, వీరే కాలక్రమంలో ఆమెకు బినామీలుగా మారారని లేఖలో ఆరోపించారు. ఈ ముగ్గురి గురించి లేఖలో ఇంకా ఏమన్నారంటే? మొదటి బినామీ ఫార్మాసిస్ట్ నాగలక్ష్మి దేవికారాణికి మొదటి బినామీ. పర్చేస్ డిపార్ట్మెంట్లో ఈమె విధులు నిర్వహించేది. దేవికారాణికి ఈమె కుడి భుజం. ఆమె ఆదేశాల మేరకు 5 బినామీ కంపెనీలు నడిపిస్తున్నట్లు సమాచారం. అర్హతలు లేకున్నా ఈమెను దేవికారాణి పలుకుబడి ఉపయోగించి సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో నియమించిందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈమె ఆస్తుల విలువ దాదాపుగా రూ.50 కోట్లు దాటి ఉంటుందని సమాచారం. ఇదిలావుండగా.. ఈమెను ఏసీబీ అ«ధికారులు ఈ నెల 7వ తేదీన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రెండో బినామీ ఇతను సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో ఉద్యోగి. దేవికారాణి బినామీ కంపెనీల సమస్త సమాచారం ఇతని వద్ద ఉంది. కుంభకోణంలో అక్రమంగా సంపాదించిన డబ్బు ద్వారా సంగారెడ్డి, బీహెచ్ఈఎల్, గచి్చ»ౌలి ప్రాంతాల్లో రూ.30 కోట్ల విలువ చేసే భూములు కొన్నట్లు సమాచారం. ఇతని ఇంట్లో ఇటీవల సోదాలు చేసిన ఏసీబీ త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉంది. మూడో బినామీ సూపరింటెండెంట్ వీరన్న. ఈఎస్ఐ అకౌంట్స్ శాఖలో పనిచేస్తోన్న వీరన్న వద్ద కూడా బినామీ కంపెనీల సమాచారం ఉంది. వీరన్న బంధువుల పేరిట దాదాపు రూ.40 కోట్ల విలువ చేసే ఆస్తులు కొన్నాడు. ఇతని ఇంట్లోనూ ఇటీవల ఏసీబీ సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇతన్ని కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆస్తులివి... 1.రాజ్‌భవన్‌లోని సేథీ బిల్డర్లో అత్యాధునిక ప్లాట్ విలువ రూ.3 కోట్లు 2. షేక్‌పేట గ్రామంలో ఆదిత్య బిల్డర్స్‌లోని విల్లా విలువ రూ.9.50 కోట్లు సమీపంలో 10 వేల గజాల స్థలం 4.ఉప్పల్ సమీపంలో నారపల్లిలో మూడు ఎకరాల స్థలం 5.మహేశ్వరం మండలంలోని కందుకూరు సమీపంలో 20 ఎకరాల స్థలం 6. రూ.2 కోట్ల విలువైన వజ్రాలు -
ఈఎస్ఐ కుంభకోణం: కస్టడీకి నిందితులు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) స్కామ్ దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఈ కేసులో ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణితో పాటు ఆరుగురు నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు బుధవారం తెలిపారు. విచారణ నిమిత్తం నిందితులను బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు నిందితులను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 13 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇంకా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయనీ, మరికొంత మందిని అరెస్ట్ చేయనున్నట్లు ఆ విభాగ అధికారులు పేర్కొన్నారు. ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఫార్మసిస్ట్ రాధిక, ఉద్యోగి నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్, ఎండీ శ్రీహరిలను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరందరినీ విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. నిందితుల వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నారు. తాజాగా జరిపిన ఏసీబీ సోదాల్లో అరవింద్ రెడ్డి కార్యాలయంలో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. సాక్ష్యాలు మొత్తం నిందితుల ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. నిందితులు ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొంత మందిని ఏసీబీ అదుపులోకి తీసుకోనుందని తెలుస్తోంది. -
గ్యాంగ్ లీడర్ నాగలక్ష్మి.. రూ.50 కోట్లు స్వాహా!
సాక్షి,హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్)లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఈ కేసులో నాచారం ఫార్మాసిస్ట్ నాగలక్ష్మిని అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు ఆదివారం తెలిపారు. నాచారం డిస్పెన్సరీలో గ్రేడ్–2 ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్న కొడాలి నాగలక్ష్మి ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణికి కీలకమైన వ్యక్తి. ఇండెంట్లను ట్యాంపరింగ్ చేయడంలో ఈమె దిట్ట. దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ కలకుంట పద్మ సూచన మేరకు లైఫ్‌కేర్ డ్రగ్స్ అండ్ ఫార్మా ఎండీ సుధాకర్‌రెడ్డితో కుమ్మక్కై మందుల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడినట్లు ఏసీబీ ఆధారాలు సంపాదించింది. వీరి కారణంగా ఐఎంఎస్‌కు రూ.9.28 కోట్ల నష్టం వాటిల్లిందని తేల్చింది. ఈ వ్యవహారంలో 23 మందిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. అరెస్టయిన వారి సంఖ్య 10కి చేరింది. రాష్ట్రంలోని పలు డిస్పెన్సరీల ఫార్మాసిస్టులకు గ్యాంగ్‌లీడర్ నాగలక్ష్మి అనే ఆరోపణలున్నాయి. దేవికారాణికి సన్నిహితురాలు.. నాగలక్ష్మిని నాచారం నుంచి సనత్‌నగర్‌లో సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు హెడ్‌గా దేవికారాణి నియమించింది. సీనియర్లు ఉన్నా నాగలక్ష్మీని ఏరికోరి తీసుకువచ్చి పెట్టారు. డ్రగ్‌స్టోర్‌లో ఆమె ఎంత చెబితే అంత. అక్కడ సీసీ కెమెరాలను నాగలక్ష్మినే ఏర్పాటు చేయించింది. ఏసీబీ దర్యాప్తు ప్రారంభించగానే సీసీ కెమెరాలను, హార్డ్ డిస్కులను హడావిడిగా తీయించేసింది. నాగలక్ష్మికి 5 నకిలీ మందుల కంపెనీలు కూడా ఉన్నాయి. అవన్నీ పేపర్ల మీదే ఉంటాయి. వీటి ద్వారా వచ్చే బిల్లులను దేవికారాణికి పంపుతూ సొమ్ము చేసుకునేవారు. నాగలక్ష్మి అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బులతో రూ.50 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఐఎంఎస్‌కు చెందిన వివిధ డిస్పెన్సరీల్లో ఫార్మాసిస్టుగా పనిచేసే వడ్డెం రేణుక, వి.లావణ్య, కె.వసంత ఇందిరా, నూన్సావత్ గాయత్రీబాయి, కుంచం కరుణ సహకరించారు. ఏసీబీ అదుపులో సుదర్శన్‌రెడ్డి..? ఈ కుంభకోణంలో ఓ ఫార్మా కంపెనీ యజమాని సుదర్శన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో బాలానగర్‌లోని అతని కంపెనీలో దాడులు నిర్వహించారు. ఎలా చేస్తుందంటే..? దేవికారాణి చెప్పినట్లుగా నాగలక్ష్మి చేసేది. మెడికల్ క్యాంపుల్లో సరఫరా చేయాల్సిన ఇండెంట్‌ను వారికి అనుకూలంగా మార్చి పంపడంలో ఈమె సిద్ధహస్తురాలు. రాష్ట్రంలోని వివిధ డిస్పెన్సరీల నుంచి గత నాలుగేళ్లుగా వెళ్లిన మందులను పరిశీలించిన ఏసీబీ ఇదే విషయాన్ని గుర్తించింది. పలుచోట్ల మార్చిన అంకెలను, మార్చిన ఇంకుల్లో వ్యత్యాసాలను అధికారులు పట్టుకోగలిగారు. ఇలా పెంచిన బిల్లులను దేవికారాణికి పంపడం.. వాటికి ఆమోదం రావడం.. ఫార్మా కంపెనీకి చెల్లింపులు.. వీరికి కమీషన్ రావడం.. చకచకా జరిగిపోయేవి. -
నాగరాజుకే ఎక్కువగా వణికిపోయేవారు....
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్ ) కుంభకోణంలో నాగరాజు లీలలు క్రమంగా వెలుగుచూస్తున్నాయి. ఐఎంఎస్ కుంభకోణంలో నాగరాజు పాత్రపై బుధవారం ‘అవినీతిలో పోటీపడ్డారు’అనే పేరుతో సాక్షి ప్రచురించిన కథనంపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. అతని ఇంటిపై బుధవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తనిఖీల్లో రూ.46 కోట్ల విలువైన ఒరిజినల్ పర్చేజ్ ఆర్డర్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఐఎంఎస్ డైరెక్టరేట్‌లో ఉండాల్సిన పత్రాలు ప్రైవేటు వ్యక్తి ఇంట్లో ఉండటంపై అధికారులే విస్తుపోయారని తెలిసింది. ఇప్పటికే నాగరాజును అరెస్టు చేసిన ఏసీబీ రిమాండుకు పంపిన విషయం తెలిసిందే. దేవికారాణి డైరెక్టర్‌గా చార్జ్ తీసుకున్నాక నాగరాజే డైరెక్టరేట్‌లో చక్రం తిప్పాడని, అతడే సూడో డైరెక్టర్‌గా వ్యవహరించిన వైనం బయటపడింది. నాగరాజు ఎంత చెబితే అంత! ఐఎంఎస్‌లో నాగరాజు వ్యవహారాలు నడపడం ఇదే కొత్తకాదు. దేవికారాణి రాక ముందు అంతకు ముందున్న డైరెక్టర్లతోనూ చాలా తతంగాలు నడిపాడు. దేవికారాణి డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాక ఐఎంఎస్ డైరెక్టరేట్ పేషీలో అతని ఆగడాలు శృతిమించాయి. అతను వచ్చాడంటే తన చాంబర్లో ఎంత బిజీ మీటింగ్‌లో ఉన్నా దేవికారాణి అందరినీ పంపించేసేది. ఆఫీసులో తయారు చేయాల్సిన మెడిసిన్స్ ఇండెంట్‌ను ఇంటి వద్దే నాగరాజు తయారు చేసుకుని వచ్చేవాడు. నాగరాజు చెబితే ఏకబిగిన పదుల సంఖ్యలో ఇండెంట్లపై దేవికారాణి సంతకాలు చేసేది. మందుల ధరలు, కొనుగోలు చేయాల్సిన కిట్లు, యంత్రాలు మొత్తం తానే నిర్ణయించేవాడు. అతనికి పేషీలో ఎంత ప్రాధాన్యం ఉండేదంటే.. తనకు నచ్చిన అధికారి సీట్లో కూర్చుని కంప్యూటర్లపై వీడియో గేములు ఆడేవాడని సిబ్బంది గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ సెక్షన్లో ఇతని ఫైల్ ఆలస్యమైనా సరే.. ఆ బాధ్యతలు చూసే ఉద్యోగిని అక్కడ నుంచి మరో సెక్షన్‌ను ఆగమేఘాల మీద మార్పించేవాడు. సిబ్బంది మాటల్లో చెప్పాలంటే.. దేవికారాణి కంటే నాగరాజుకే ఎక్కువగా వణికిపోయేవారు. నాగరాజు ఆగడాలపై సమాచారం అందుకున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శశాంక్ గోయల్ ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణిని హెచ్చరించడంతో మే నెల నుంచి పేషీకి రావడం కాస్త తగ్గించాడు. దీంతో సంతకాలన్నీ కారులోనే తీసుకునేవాడని సమాచారం. ఏపీలోనూ ఇతనిదే హవా! నాగరాజు కమీషన్ దందా కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. ఇతడిచ్చే కమీషన్లకు ఆశపడి అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీగా మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల తిరుపతి, విజయవాడల్లోనూ ఏపీ విజిలెన్స్ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఇతని అక్రమాలు విస్తరించాయని, దర్యాప్తు చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తాయని సిబ్బంది చెబుతున్నారు. కంపెనీలన్నీ అతని వెనకాలే..! గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన నాగరాజు పూర్తిపేరు సీహెచ్ శివ నాగరాజు. మెడికల్ రిప్ర జెంటేటివ్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. అధికారులకు విలువైన బహుమతులు, పార్టీలు ఇచ్చి మచ్చిక చేసుకునేవాడు. తర్వాత అధిక ధరలకు ఇండెంట్లు పెట్టుకుని వారికి రూ.లక్షల కమీషన్లు వచ్చేలా స్కెచ్ గీసేవాడు. దీంతో ఇతని ద్వారా మందుల కొనుగోలుకు అధికారులు, రిజిస్టర్డ్, నాన్ రిజిస్టర్డ్ కంపెనీలు ఆసక్తి కనబరిచేవి. 42 కంపెనీలకు ఇతనే అధికారిక రిప్రజెంటేటివ్‌గా మారాడంటే అతని హవా ఎలా నడిచిందో చెప్ప వచ్చు. దేవికారాణి అక్రమాలపై విజిలెన్స్ నివేదిక ఇవ్వగానే అప్రమత్తమయ్యాడు. దేవికా రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల మధ్య రాజీ కుదర్చడంలో సఫలీకృతమయ్యాడు. -
దేవికారాణి, పద్మల మధ్య రాజీకి నాగరాజు యత్నం!
సాక్షి, హైదరాబాద్: తిలాపాపం.. తలా పిడికెడు అన్నట్లుగా ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో నిందితులంతా పోటాపోటీగా అవినీతికి పాల్పడ్డారు. మందుల కొనుగోళ్లలో ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మలు ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యవహరించారు. అసలేం జరిగిందంటే.. 2015లో దేవికారాణి బాధ్యతలు చేపట్టేనాటికే అక్కడ జాయింట్ డైరెక్టర్‌గా పద్మ విధులు నిర్వహిస్తున్నారు. ఐఎంఎస్‌కు మందులు సరఫరా చేసే పలు రిజిస్టర్ కంపెనీలతో ఆమె ముందే కుదుర్చుకున్న అవగాహన తెలుసుకున్న దేవికారాణి తానేం తక్కువ తిన్నానా అని నాన్ రిజిస్టర్డ్ కంపెనీలపై కన్నేశారు. అత్యవసర సమయాల్లో నాన్ రిజిస్టర్ కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేయవచ్చన్న చిన్న వెసులుబాటును ఆసరాగా చేసుకుని దేవికారాణి సొంతంగా వ్యవహారం నడిపారు. ఇందుకోసం పలు రకాల కంపెనీలను కూడా అప్పటికప్పుడు సృష్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018లోనే విజిలెన్స్ విచారణ.. వాస్తవానికి డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆకాశరామన్న ఉత్తరాలతో 2018 నవంబర్లోనే అవినీతి విషయం విజిలెన్స్‌కు చేరింది. ఈ విషయంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని విజిలెన్స్ 2019 ఫిబ్రవరిలోనే నివేదిక ఇచి్చంది. అయినా ఈ విషయం బయటకు పొక్కనీయలేదు. ఈ విషయంపై పలుమార్లు ముఖ్య కార్యదర్శి శశాంక్ గోయల్ హెచ్చరించినా దేవికారాణి పట్టించుకోలేదు. ఓమ్నీ, అవేంటార్, లెజెండ్ కంపెనీల నుంచి రూ.20 కోట్లకు పైగా అధిక ధరలకు చెల్లించి కొనుగోలు చేసిన విషయంపై శశాంక్ గోయల్ తీవ్రంగా పరిగణిస్తూ లేఖ రాయడంతో దేవికారాణిలో కాస్త చలనం వచి్చంది. తెలంగాణ స్టేట్ మెడికల్ సరీ్వసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ధరల కంటే మీకు ఎక్కువ చెల్లించామని, అధిక మొత్తాన్ని వెంటనే తిరిగిచ్చేయాలని ఓమ్నీ, అవేంటార్, లెజెండ్ కంపెనీలకు దేవికారాణి విడివిడిగా లేఖలు రాశారు. దీనిపై ఆ కంపెనీ లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తాము ముందు గా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ధర నిర్ధారించామని, తీసుకున్న డబ్బును వెనక్కిచ్చేది లేదని కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాయి. చక్రం తిప్పడంలో నాగరాజు కీలకం.. వీరిద్దరి అవినీతిలో మెడికల్ రిప్రజెంటేటివ్ నాగరాజు పాత్ర చాలా కీలకం. ఐఎంఎస్‌లో కొన్నేళ్లుగా చిన్న మందుబిళ్లల కొనుగోళ్లలో ఇతనే ఆధారం. ఐఎంఎస్‌కు మందులు సరఫరా చేసే ఓమ్నీ, అవేంటార్, లెజెండ్ కంపెనీలతోపాటు ఏకంగా 42 కంపెనీలకు ఇతనే రిప్రజెంటేటివ్ అంటే ఐఎంఎస్‌లో ఇతను ఏ స్థాయిలో చక్రం తిప్పాడో అర్థం చేసుకోవచ్చు. ముందు నుంచి జాయింట్ డైరెక్టర్ పద్మతో అధిక ధరలకు కోట్ చేసుకుంటున్న నాగరాజు.. తర్వాత డైరెక్టర్ దేవికారాణినీ కుంభకోణంలో భాగస్వామిని చేశాడు. వాళ్లిద్దరూ ఒకరిపై ఒకరు ఏసీబీ, విజిలెన్స్‌కు ఉత్తరాలు రాయడం, విజిలెన్స్ నివేదికలో అక్రమాలు నిజమే అని నిర్ధారణ జరగడంతో నాగరాజు రంగప్రవేశం చేశాడు. విషయం బయటికి పొక్కకపోవడంతో వీరిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడు. అతడి ముందు రాజీకి అంగీకరించినా.. తర్వాత వీరి తీరులో మార్పురాకపోవడంతో విషయం కార్మిక సంఘాలు, ఏసీబీ వరకు వెళ్లింది. నాగరాజు కేవలం తెలంగాణకే కాదు, ఏపీలోనూ ఇవే కంపెనీలకు ప్రతినిధిగా ఉండటం గమనార్హం. -
ఈఎస్ఐ స్కాంలో మరొకరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణంలో మరొకరిని అవీనీతి నిరోధక శాఖ(ఏసీబీ) సోమవారం అరెస్ట్ చేశారు. డైరెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా అనధికారంగా పని చేస్తున్న ఎం సురేంద్రనాథ్ బాబును ఆర్సీ పురంలో విధుల్లో ఉండగా పట్టుకున్నారు. ఆరు సంవత్సరాలుగా అనధికారికంగా పని చేస్తున్న సురేంద్రనాథ్ మెడికల్ క్యాంపులు నిర్వహించకుండా తప్పడు బిల్లులతో కోట్ల రూపాయలను కొల్లగొట్టినట్టు ఆరోపణలున్నాయి. డైరెక్టర్ కార్యాలయంలో అనధికారికంగా దేవికరాణి, పద్మల కోసం పని చేసిన అతడిపై పన్నెండు మంది ఫార్మాసిస్టులను బెదిరించి తప్పుడు మెడికల్ బిల్స్ తెప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు. సురేంద్రనాథ్‌కు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. -
ఎవరా ఐఏఎస్?
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కొనుగోళ్లల్లో రోజుకో అక్రమం వెలుగుచూస్తోంది. ఈ వ్యవహారంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి హస్తం ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విజిలెన్స్ విచారణకు ముందు సనత్‌నగర్‌లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ కార్యాలయంలోని రికార్డు రూముల్లో లెక్కలు తారుమారు చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలోని సీసీటీవీ ఫుటే జీని పరిశీలిస్తే మరిన్ని విష యాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. బోరబండ, పటాన్చెరు, చర్లపల్లి డిస్పెన్సరీల్లోనే రూ.100 కోట్లకుపైగా అవినీతి జరిగిందని సమాచారం. నాలుగేళ్లలో రూ.700 కోట్ల మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.200 కోట్లకుపైగా మింగేశారని ఆరోపిస్తున్నారు. ఎలా నడిపారంటే? 2015 నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంలో డైరెక్టర్ దేవికారాణిది కీలక పాత్ర. ఈమె నేతృత్వంలో జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ కూరపాటి వసంత ఇందిరా, ఫార్మాసిస్ట్ రాధిక, సీనియర్ అసిస్టెంట్ ఒగ్గు హర్షవర్ధన్, ఆమ్ని ఫార్మాకు చెందిన చెరుకూరి నాగరాజు, కంచర్ల హరిబాబు అలియాస్ బాబ్జీలతో కథ నడిపారు. వాస్తవానికి మందుల కొనుగోళ్లలో నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు సంబంధించి జీవో నంబర్ 51ను ప్రభుత్వం 2012లోనే విడుదల చేసింది. దాని ప్రకారం.. రిజిస్టర్డ్ కంపెనీల నుంచే కొనుగోళ్లు చేయాలి. రిజిస్టర్ కంపెనీలు అందుబాటులో లేని అత్యవసర సమయాల్లో మాత్రమే గుర్తింపులేని ప్రైవేటు కంపెనీల నుంచి కొనుక్కోవచ్చన్న వెసులుబాటు ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని జాయింట్ డైరెక్టర్ పద్మతో కలసి దేవికారాణి కథ మొత్తం నడిపింది. నలభైకి పైగా నకిలీ కంపెనీలు దేవికా రాణికి చెందినవేనని సిబ్బంది ఆరోపిస్తున్నారు. మొత్తం 140 కంపెనీలను అప్పటికప్పుడు సృష్టించి నకిలీ బిల్లులు పెట్టి కోట్లు డ్రా చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని, ముందే ఖాళీ బిల్లులపై, ఇండెట్లపై ముందుగానే సంతకాలు చేసి ఉంచేవారు. దేవికారాణి ఎంత చెబితే అంత వేసి డబ్బు డ్రా చేసుకునేవారు. దీంతో ఈ ముఠాలోని సభ్యులంతా హైదరాబాద్ శివార్లలో భారీగా భూములు, అపార్ట్మెంట్లు, నగలు, బంగారం బిస్కెట్లు కొన్నారని సమాచారం. సీఎం నాకు బంధువు.. జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మ అక్రమాలకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిని బెదిరిస్తూ ఉండేదనిసిబ్బంది చెబుతున్నారు. ‘నా ఇంటి పేరు తెలుసా? సీఎం కేసీఆర్‌ది నాదీ ఒకే ఇంటిపేరు. ఆయన నాకు బంధువు’ అంటూ నేమ్ ప్లేట్ చూపించి బెదిరించేదని వాపోతున్నారు. ఈ కుంభకోణంలో డైరెక్టర్ నుంచి మెడికల్ రిప్రంజెంటేటివ్ వరకు అంతా పాత్రధారులే కావడంతో కథ సాంతం సాఫీగా సాగేది. ఎక్కడైనా కొత్త సిబ్బంది వస్తే.. వారిని ప్రలోభ పెట్టడం, లేకపోతే బెదిరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఐఎంఎస్‌లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్ ఓ డాక్టర్‌ను ఖాళీ బిల్లులపై సంతకాలు చేయాల్సిందిగా ప్రలోభపెట్టిన ఆడియో టేపులు లీకవడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో దేవికారాణి ముఠా ఓ ఐఏఎస్ ఆఫీసర్‌ను తమతో కలుపుకొన్నారని ఉద్యో గ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయనకు భారీగా లంచం ముట్టజెప్పడంతో ఆడిట్ రికార్డులను చెరిపేందుకు వచ్చాడని ఆరోపిస్తున్నారు. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో బ్యాంకు మేనేజర్లతో పెద్ద మొత్తంలో కమీషన్ మాట్లాడుకుని కొత్త నోట్లు మార్చుకున్నారని సమాచారం. దారి మళ్లించి దండుకున్నారు! మెడికల్ రీయింబర్స్మెంట్ నిధులతో మందుల కొనుగోళ్లు బీమా వైద్య సేవల సంచాలక (డీఐఎంఎస్) విభాగంలో ఉన్నతాధికారుల అక్రమాలు క్రమంగా బయటపడుతున్నాయి. ఈఎస్ఐ నిబంధనలకు తూట్లు పొడిచి భారీగా నిధులను స్వాహా చేసిన వైనం తాజాగా వెలుగు చూసింది. కేంద్ర ప్రభుత్వం డీఐఎంఎస్‌కు విడు దల చేసిన నిధులను నిర్దేశిత కార్యక్రమాల కోసం కాకుండా అక్రమాలకు వినియోగించిన తీరు బహిర్గతమైంది. రాష్ట్రంలో ఈఎస్ఐ ఖాతాదారులు 18.5 లక్షల మంది ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 58 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో సేవల లభ్యత కష్టమైనప్పుడు ఈఎస్ఐసీ గుర్తింపు పొందిన ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో లబ్ధిదారులు చికిత్స పొందొచ్చు. వీరికి నిబంధనల ప్రకారం ఈఎస్ఐసీ వైద్య ఖర్చును రీయింబర్స్మెంట్ చేస్తుంది. ఈ రీయింబర్స్మెంట్ మొత్తాన్ని కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా డీఐఎంఎస్‌లకు విడుదల చేస్తుంది. అక్కడ వైద్య బిల్లులను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత చెల్లింపులను ఖరారు చేసి లబ్ధిదారు ఖాతాలో జమ చేస్తుంది. ఇలా మెడికల్ రీయింబర్స్మెంట్ నిధులను క్రమం తప్పకుండా ఈఎస్ఐసీ విడుదల చేస్తుండగా... డీఐఎంఎస్ మాత్రం వీటిని దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడింది. ఐదేళ్లలో రూ.110 కోట్ల మళ్లింపు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందిన ఈఎస్ఐ ఖాతాదారులు రీయింబర్స్మెంట్ కోసం డీఐఎంఎస్‌కు పెట్టుకున్న అర్జీల పరిశీలన, పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దాదాపు ఐదేళ్లుగా వీటి చెల్లింపుల ప్రక్రియ గాడి తప్పింది. అత్యవసర కార్యక్రమం కింద మందుల కొనుగోలుకు మళ్లించారు. గత ఐదేళ్లలో దాదాపు 110 కోట్లను ఇలా మందులు కొనుగోలు చేయడం గమనార్హం. డీఐఎంఎస్‌లో మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పెరుకుపోయాయి. దాదాపు లక్ష బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ బిల్లులను పూర్తిస్థాయిలోచెల్లించాలంటే రూ.178 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. -
బయటపడ్డ ఆడియో టేపులు
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ మందుల కుంభకోణానికి సంబంధించిన అక్రమాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి మరో సంచలన విషయం శనివారం బయటపడింది. డాక్టర్లను తప్పుడు బిల్లులు పెట్టాలంటూ సెక్షన్ ఆఫీసర్ సురేంద్ర నాథ్ బెదిరించిన ఆడియో టేపులు బయటకి రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల విచారణంలో ఈ ఆడియో టేపులు బయటకి వచ్చినట్టు సమచారం. వీటి ఆధారంగా కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సురేంద్ర నాథ్, డాక్టర్ మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈఎస్ఐ డాక్టర్లను తప్పుడు బిల్లులు పెట్టాలంటూ సెక్షన్ ఆఫీసర్ సురేంద్రనాథ్ ఒత్తిడి చేశాడు. క్యాంపుల పేరుతో మెడిసిన్ పంపించినట్లు రాసుకొని ఓ రికార్డు తయారుచేయాలని డాక్టర్‌కు చెప్పాడు. అయితే డాక్టర్ ఒప్పుకోకపోవడంతో సెక్షన్ ఆఫీసర్ బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా మరో మహిళా డాక్టర్‌కు కూడా సురేంద్ర ఫోన్ చేసి బెదిరించాడు. ఏడాది తర్వాత క్యాంప్ నిర్వహించినట్లు బిల్లులు తయారు చేయాలని ఆ మహిళా వైద్యురాలిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే ఏడాది తర్వాత బిల్లులు తయారు చేయలేనని ఆ ఈఎస్ఐ డాక్టర్ తెగేసి చెప్పారు. అయితే డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ బిల్లుల కోసం అడుగుతున్నారని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ డాక్టర్ మాత్రం నిబంధనల ప్రకారమే ముందకు వెళ్తానని సురేంద్రకు స్పష్టంగా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరోవైపు నిందితుల ఇళ్లలో సోదాలు కొనసాగాతున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణితోపాటు వరంగల్ జాయింట్ డైరెక్టర్ కె.పద్మ, అడిషనల్ డైరెక్టర్ వసంత ఇందిర, ఫార్మసిస్ట్ రాధిక, రిప్రజెంటేటివ్ శివ నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్, ఆమ్ని మెడికల్‌కు చెందిన హరిబాబు అలియాస్ బాబ్జీలను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నించారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 455 (ఏ), 465, 468, 471, 420, 120–బీ 34 కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కుంభకోణానికి సంబంధించి 17మంది ఐఎంఎస్ ఉద్యోగులు, ఐదుగురు మెడికల్ కంపెనీల ప్రతినిదులు, ఓ టీవీ చానల్ రిపోర్టర్‌పై ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చదవండి: కర్త, కర్మ, క్రియా దేవికా రాణినే.. -
కర్త, కర్మ, క్రియా దేవికా రాణినే..
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) అక్రమాలు ఒక్కోటిగా బయటపడుతున్నాయి. ఈ కేసులో విచారణ మొదలుపెట్టిన అవినీతి నిరోధకశాఖ రెండో రోజు దూకుడు పెంచింది. శుక్రవారం ఉదయం పోలీసులు ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరోవైపు నిందితుల ఇళ్లలో సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణితోపాటు వరంగల్ జాయింట్ డైరెక్టర్ కె.పద్మ, అడిషనల్ డైరెక్టర్ వసంత ఇందిర, ఫార్మసిస్ట్ రాధిక, రిప్రజెంటేటివ్ శివ నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్, ఆమ్ని మెడికల్‌కు చెందిన హరిబాబు అలియాస్ బాబ్జీలను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నించారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 455 (ఏ), 465, 468, 471, 420, 120–బీ 34 కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కుంభకోణానికి సంబంధించి 17మంది ఐఎంఎస్ ఉద్యోగులు, ఐదుగురు మెడికల్ కంపెనీల ప్రతినిదులు, ఓ టీవీ చానల్ రిపోర్టర్‌పై ఏసీబీ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కర్త, కర్మ, క్రియా దేవికా రాణినే.. 2015 నుంచి 2019 వరకు ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి మందుల టెండర్లను పర్యవేక్షించారు. దాదాపు రూ. 200 కోట్ల విలువైన మందుల కొనుగోళ్లలో గోల్మాల్ జరిగిందని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ రంగంలోకి దిగింది. శుక్రవారం దేవికారాణిని విచారించిన ఏసీబీ అధికారులు పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఆమెను సూత్రధారిగా గుర్తించారు. తన కొడుకు ద్వారా తేజ, ఆమ్ని కంపెనీలతో దేవిక కుమ్మక్కయ్యారు. చదవండి: ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్ టెండర్లు లేకుండానే ఏకపక్షంగా అర్హతలేని మందుల కంపెనీలకు సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అలా నకిలీ బిల్లులతో కోట్లాది రూపాయలను జేబులో వేసుకున్నారని, మందుల సరఫరా టెంటర్లలో స్వార్ధపూరితంగా, స్వప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిచ్చారని ఏసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. పటాన్చెరు, బోరబండ, బాచుపల్లి, చర్లపల్లి, బొల్లారం, వరంగల్ డిస్పెన్సరీలకు పంపిన మందుల్లో అనేక అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. వాటిలో చాలామటుకు నకిలీ బిల్లులుగా తేల్చింది. గురువారం దాదాపు రూ. 12 కోట్ల వరకు తప్పుడు ఇన్వాయిస్లను గుర్తించిన ఏసీబీ... శుక్రవారం షేక్‌పేటలోని దేవికారాణి ఇంటి నుంచి కీలక పత్రాలు, ఎల్రక్టానిక్ వస్తువులను స్వా«దీనం చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారిపైనా అభియోగాలు.. ఈ వ్యవహారంలో ఏసీబీ సరిగా దర్యాప్తు జరపడం లేదని ఈఎస్ఐ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నాలుగేళ్లలో దాదాపుగా రూ. 700 కోట్ల మేరకు కొనుగోళ్లు జరిగాయని, వాటికి సంబంధించిన మొత్తం ప్రక్రియను ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతున్నాయి. కేవలం రూ. 12 కోట్ల మేరకే అక్రమాలు జరిగాయంటూ కుంభకోణం తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబడుతున్నాయి. దేవికారాణి సూత్రధారి కాదని, ఆమె వెనకాల ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఉన్నారని, మందుల సరఫరాకు అడ్డగోలుగా అనుమతిచి్చన మందుల కంపెనీల్లో సగం ఆయనవేనని ఆరోపిస్తున్నాయి. మెడికల్ ఏజెంట్ సుధాకర్‌రెడ్డి వారిద్దరి సంధానకర్తగా వ్యవహరించారని తెలిపారు. మాజీ మంత్రి బంధువు పాత్రపైనా ఈ వ్యవహారంలో విచారించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈఎస్ఐ కారి్మక సంఘానికి నాయకుడిగా ఉన్న ఆయన పేరును దేవికారాణి ఏసీబీ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో ఆరోపణలు వచి్చన అందరి పాత్రపైనా దర్యాప్తు జరుపుతామని ఏసీబీ అధికారులు వివరణ ఇచ్చారు. విభేదాలతోనే బయటికి.. ఈ మొత్తం వ్యవహారంలో ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మల మధ్య తలెత్తిన విభేదాలే కుంభకోణాన్ని వెలికితీశాయి. దీంతో ఆకాశరామన్న ఉత్తరాలతో దేవికారాణిపై పద్మ వర్గం విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసింది. ప్రతిగా దేవికారాణి పద్మపై ఏసీబీకి ఉత్తరాలు రాయించింది. విచారణ చేపట్టిన విజిలెన్స్... దేవికారాణితోపాటు పద్మ ఆధ్వర్యంలో జరిగిన కొనుగోళ్లలోనూ అవతవకలు ఉన్నాయని గుర్తించింది. రిమాండ్‌లో సంచలన విషయాలు.. మందుల కొనుగోళ్ల అక్రమాలపై ఇప్పటికే ఏసీబీ రిమాండ్ రిపోర్టు రూపొందించింది. మొత్తం 44 పేజీల రిపోర్ట్‌లో దేవికారాణి ఎలా అవతవకలకు పాల్పడింది? ఏయే డిస్పెన్సరీలకు ఎన్ని మందులు సరఫరా చేసింది? ఎలాంటి వ్యాధులకు మందులు పంపారు? ఏయే మెడికల్ కంపెనీలను ఎంచుకున్నారు? వాటిని ఎంతకు కోట్ చేశారు? వంటి విషయాలన్నీ పొందుపరిచినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో మరిన్ని వ్యవహారాలు దాగి ఉన్నాయని ఏసీబీ కూడా అనుమానిస్తోంది. ఈ మొత్తం వ్యవహరంలో ఆమ్ని మెడి, అవెంటార్, లెజెంట్ కంపెనీలకు అత్యధికంగా చెల్లింపులు జరిగినట్లు గుర్తించారు. ముఖ్యమంత్రి సీరియస్.. ఐఎంఎస్‌లో కుంభకోణంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారని తెలిసింది. ఈ స్కాంలో ఎవరు ఉన్నా వదలవద్దని, ఆరోపణలు వచ్చిన అందరిపైనా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన ఏసీబీని ఆదేశించారని సమాచారం. కాగా, ఉన్నతాధికారుల అరెస్టు నేపథ్యంలో ముషీరాబాద్‌లోని బీమా వైద్య సేవల విభాగం డైరెక్టరేట్ (డీఐఎంఎస్) కార్యాలయానికి రోజువారీగా వచ్చే సందర్శకులు, ఫిర్యాదుదారులను అనుమతించట్లేదు. ముందుగా సెక్యూరిటీ వద్ద విషయాన్ని ప్రస్తావించి సంబంధిత సెక్షన్ ఆమోదం పొందితే తప్ప ప్రవేశాన్ని కల్పించట్లేదు. -
ఈఎస్ఐ కుంభకోణంలో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ ఆసుపత్రిపై అవీనీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి డైరెక్టర్ దేవిక రాణితో పాటు మరో ఏడుగురిని గురువారం అరెస్టు చేశారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో దేవికా రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో దేవిక కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవసరం లేకున్నా.. నకిలీ బిల్లులు సృష్టించి మందులు కొనుగోలు చేసి ఈఎస్ఐ అధికారులు భారీ స్కాంకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ. 10కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చి దేవికా రాణిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో దేవిక రాణి ఈఎస్ఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలపై శుక్రవారం ఆరా తీశారు. ఈఎస్ఐ నిబంధనలకు విరుద్ధంగా మందులు కొనుగోలు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. అలాగే ఇప్పటి వరకు కేవలం 5 ఇండెంట్లు మాత్రమే పరిశీలించామని, ఇంకా 200 ఇండెంట్లు పరిశీలించాల్సి ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా పది శాతం దర్యాప్తు పూర్తి చేసిన క్రమంలో డైరెక్టర్ దేవికా రాణితో పాటు, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఫార్మసిస్ట్ రాధిక, నాగరాజు, ఓమ్నీ మెడికల్ సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్, ఎండీ శ్రీహరిలను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టామని, అలాగే మరో నలుగురిని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించి వారిపై ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం’, ఫోర్జరీ, చీటింగ్, క్రిమినల్ కాన్స్ఫరెసి, విధులను దుర్వినియోగ పరచడం వంటి పలు సెక్షన్ల(120 (B) r/w 34, 477(A) 465, 468, 471, 420) కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అలాగే వీరిని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించామని తెలిపారు. దీంతో ఏసీబీ అధికారులు వారం రోజులు పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, ఇది సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే సుమారు 200 మెడికల్ ఏజెన్సీల రికార్డులు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. కాగా ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎమ్ఎస్) విభాగంలోని అవీనీతి పుట్ట బద్దలైన విషయం తెలిసిందే. అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు ఐఎమ్ఎస్ విభాగానికి చెందిన 23 మంది ఉద్యోగుల ఇళ్లపై నిన్న (గురువారం) ఏకకాలంలో దాడులు జరిపారు. దాదాపు రూ.12 కోట్ల నకిలీ బిల్లులకు సంబంధించి కీలకమైన ఆధారాలు సంపాదించారు. (చదవండి: ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్) -
ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. షేక్‌పేటలోని తన నివాసం నుంచి ఆమెను బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో దేవికా రాణి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయంలో తెలిసిందే. దీంతో నిన్నంతా దేవికా రాణి కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 17మంది ఉద్యోగులు, నలుగురు ప్రయివేట్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నకిలీ బిల్లులు సృష్టించి, అవసరం లేకున్నా మందులు కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ, సుమారు రూ.10 కోట్ల వరకూ కుంభకోణం జరిగినట్లు ప్రాథమికంగా తేల్చింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్లోనూ ఇంకా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో దేవికా రాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఫార్మసిస్ట్ రాధిక, ఈఎస్ఐ ఉద్యోగి నాగరాజు, సీనియర్ అసిస్టెంట్ హర్షవర్థన్, ఎండీ శ్రీహరిని అరెస్ట్ చేసి, ఈఎస్ఐ సిబ్బందిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే 23 ప్రదేశాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు, బంగారాన్ని సీజ్ చేశారు. మరోవైపు దేవికా రాణి ఇంట్లో రెండు సూట్‌కేసులు, రెండు బ్యాగుల డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈఎస్ఐలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎమ్ఎస్) విభాగంలోని అవీనీతి పుట్ట బద్దలయింది. అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు ఐఎమ్ఎస్ విభాగానికి చెందిన 23 మంది ఉద్యోగుల ఇళ్లపై నిన్న (గురువారం) ఏకకాలంలో దాడులు జరిపింది. దాదాపు రూ.12 కోట్ల నకిలీ బిల్లలుకు సంబంధించి కీలకమైన ఆధారాలు సంపాదించింది. దేవికా రాణిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలింపు నేపథ్యం ఏంటి? ఐఎమ్ఎస్ విభాగంలో మందుల కొనుగోళ్లలో నిబంధనలు తుంగలో తొక్కారని, భారీగా అక్రమాలు జరిగాయని, కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఐఎమ్ఎస్ ఉద్యోగులు, మెడికల్ ఏజెన్సీలు టెండర్లు లేకుండా నకిలీ బిల్లులతో కోట్లాది రూపాయలు దిగమింగారని ఫిర్యాదులు వెల్లువెతాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజానిజాలను తేల్చాని ఈఎస్ఐ ముఖ్యకార్యదర్శి శశాంక్ గోయల్ ఏసీబీకి లేఖ రాసారు. ఈ మేరకు ఈ కేసును ఏసీబీ స్వీకరించింది. ముందుగా విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. పలు రికార్డులను, కొనుగోళ్లను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు అక్రమాలను ధ్రువీకరిస్తూ ఏసీబీకి నివేదిక అందజేసారు. దేవిక రాణి నివాసంలో ఏసీబీ తనిఖీలు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంగా ఐఎమ్ఎస్ అధికారుల ఇళ్లపై దాడులు చేసారు. ఈ విభాగానికి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఆమ్నీ మెడికల్ ఎండీ శ్రీధర్, నాగరాజు, తేజ్ ఫార్మాకు చెందిన సుధాకర్‌రెడ్డి, వీ–6 చానల్ రిపోర్టర్ నరేందర్‌రెడ్డితోపాటు పలువురు ఉద్యోగులు కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా నకిలీ బిల్లులు, తప్పుడు రికార్డులతో టెండర్లు లేకుండా మందులకు ఆర్డర్లు ఇచ్చినట్లు తేలింది. షేక్‌పేటలోని దేవికా రాణి నివాసం ఏసీబీ అధికారులు ఏమంటున్నారు ఐఎమ్ఎస్ జాయింట్ డైరెక్టర్ డా.కె.పద్మ 2018 మే 26, 28వ తేదీల్లో రూ.1.03 కోట్ల నకిలీ బిల్లులను రూపొందించారు. వీటిని పటాన్చెరు, బోరబండ ఇన్‌ఛార్జి మెడికల్ ఆఫీసర్ల సాయంతో ఈ బిల్లులు క్లెయిమ్ చేశారు.అదే నెలలో బొంతపల్లి, బొల్లారం డిస్పెన్సరీలకు రూ.1.22 కోట్ల నకిలీ బిల్లులు తయారు చేసి మందులను మాత్రం పంపకుండా డబ్బులు జేబులో వేసుకున్నారు. ఐఎమ్ఎస్ డైరెక్టర్ దేవికారాణి ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివింది. అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిరతో కలిసి ఏకంగా రూ.9.43 కోట్లను బిల్లులపేరిట 2017–18 ఆర్థిక సంవత్సరంలో స్వాహా చేశారు. మొత్తంగా మందుల కోనుగోళ్ల పేరిట రూ.11.69 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఐఎమ్ఎస్ సిబ్బందితోపాటు పలువురు ప్రైవేటు మెడికల్ ఏజెన్సీల ఉద్యోగులు కూడా పాలుపంచుకున్నారు. మెడికల్ రిప్రజెంటేటివ్ శివ, తేజ ఫార్మా ఏజెంట్ సుధాకర్‌రెడ్డి, ఆమ్నీ మెడిసిన్స్కు చెందిన శ్రీహరి, వీ–6 చానల్ రిపోర్టర్ నరేందర్‌రెడ్డి ఇళ్లపైనా దాడులు జరిగాయి. ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరిపితే...మరిన్నిఅ క్రమాలు వస్తాయని ఈఎస్ఐ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
రికార్డులను ట్యాంపరింగ్ చేశారు..
సాక్షి, హైదరాబాద్: మందుల కొనుగోలులో భారీ అవకతవకలు జరగడం ద్వారా వెలుగులోకి వచ్చిన ఈఎస్ఐ కుంభకోణంలో మరో కొత్త కోణం తెరపైకి వచ్చింది. రూ.300 కోట్ల విలువైన ఈ స్కామ్‌లో ముఖ్య పాత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్, ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిలపై సంచలన ఆరోపణలు చేస్తూ బి.గురవయ్య అనే యూనియన్ నేత పేరిట మంగళవారం పత్రికా కార్యాలయాలకు బహిరంగ లేఖలు వచ్చాయి. ఈ లేఖలో పేర్కొన్న మేరకు శశాంక్ గోయల్, దేవికా రాణి, నాగలక్ష్మిలు కలిసి శనివారం సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు సనత్‌నగర్‌లోని సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్‌లో సీడీఎస్ సెక్షన్‌కు వెళ్లి రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. వారు ఆధారాలు తారుమారు చేసేందుకు అక్కడకు వెళ్లడం నిజమో కాదో అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే తేలుతుందని ఆ లేఖలో వెల్లడించారు. మొదటి నుంచీ నాన్‌ఆర్‌సీ కంపెనీలను బినామీలుగా ఏర్పాటు చేసి దాదాపు 40కి పైగా కంపెనీల్లో అడ్డగోలుగా చెల్లింపులు చేసుకున్నారని తెలిపారు. విజిలెన్స్ నివేదికలో ఉన్న కంపెనీల పేర్లను పరిశీలించి నాన్ ఆర్సీ కంపెనీల లిస్టులో ఉన్న ఎన్ని కంపెనీలకు రెండేళ్లుగా డబ్బులు పంపారో పరిశీలిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. నాన్ ఆర్సీ కంపెనీలను బినామీలుగా సృష్టించినట్లు విజిలెన్స్ నివేదిక చెబుతుంటే ఆర్సీ కంపెనీల వైపు ఏసీబీ అధికారుల దృష్టి మరల్చే విధంగా తప్పుడు లేఖలు రాసి ఏసీబీని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రూ.కోట్లలో ముడుపులు.. ప్రధాన సూత్రధారులకు బినామీగా వ్యవహరించిన సుధాకర్‌రెడ్డి పేరిట చాలా ఫర్మ్‌లున్నాయని, గత రెండేళ్లలో సుధాకర్‌రెడ్డి మొబైల్ ఫోన్ నుంచి శశాంక్ గోయల్, దేవికా రాణిలకు వచ్చిన ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తే వీరి అక్రమాలు బయటపడుతాయని ఆ లేఖలో గురవయ్య వెల్లడించారు. సచివాలయం వేదికగానే సుధాకర్‌రెడ్డి, కమల్ అనే వ్యక్తుల నుంచి శశాంక్ గోయల్ రూ.కోట్లలో ముడుపులు తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కుంభకోణంలో కార్మిక శాఖ కార్మికుల యూనియన్ కార్యదర్శి పేరుతో పత్రికా కార్యాలయాలకు వచ్చిన లేఖలో పేర్కొన్న అంశాలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి. -
శిల్పికారాణి
కళ డి.దేవికారాణి ఉడయార్. శిల్పం గురించి కొంచెమైనా తెలిసిన వారికి పరిచయం అక్కరలేని శిల్పకళాకారిణి. అయినా ఇంకొంచెం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే.. దేవిక ఆల్‌రౌండర్. నృత్యం, సంగీతం, సాహిత్యం, జ్యోతిష్యం, వాస్తు, వైద్యం, చిత్ర లేఖనం... వీటన్నింటిలోనూ తనదైన శైలిలో రాణిస్తున్నారు. బడుగుల కుటుంబంలో జన్మించిన తొలి తెలుగు శిల్పి కళారాణి దేవికారాణి. వృత్తి, ప్రవృత్తిగా ఒకటి రెండు రంగాల్లోనే మాత్రమే రాణించే వారిని చూశాం. ఏకంగా ఐదారు రంగాల్లో ఆమెది తనదైన ముద్రే. శుక్రవారం రవీంద్రభారతిలో ‘లత రాజ సాంస్కృతిక శిరోమణి అవార్డు’ అందుకున్న దేవిక సాక్షి ‘ఫ్యామిలీ’తో ముచ్చటించారు. ఆ విశేషాలు. బాల్యంలోనే: దేవిక ఐదవ తరగతిలో ఉండగా స్కూల్‌కి ఇన్స్పెక్టర్ వచ్చారు. వివిధ రకాల పోటీలు నిర్వహించారు. దేవిక శంకరాచార్యులు, రామానుజాచార్యుల చిత్రాలు గీశారు. వాటిని స్కూల్ హెచ్ఎం, ఇన్స్పెక్టర్ చూశారు. రూ. 5 బహుమతిగా అందిస్తూ జీవితంలో మహాశిల్పివి అవుతావని ఆశీర్వదించారు. దేవిక చెన్నైలో బీఎఫ్ఏ చేశారు. తండ్రి దగ్గర శిష్యురాలిగా శిల్ప విద్య నేర్చుకున్నారు. ‘‘నెహ్రూగారు తన కుమార్తె ఇందిరా గాంధీని ఎలా తన వెంట తిప్పారో... మా నాన్న మహా శిల్పి భద్రగిరి శ్రీనాధ రత్న కూడా నన్ను అలాగే ఎక్కడికి వెళ్లినా తీసుకెళ్లేవారు’’ అని చెప్పారు దేవిక. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను రూపొందించడంలో కూడా ఆ తండ్రి తన కూతురి సహకారం తీసుకున్నారు! 60 వేల విగ్రహాలు: దేవిక స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా నత్తా రామేశ్వరం. 1973 ఆగస్ట్ 15న జన్మించారు. గత 32 ఏళ్ల ప్రయాణంలో తండ్రితో కలిసి అన్ని రకాలవి కలిపి 60 వేలు విగ్రహాలు చేశారు. అందులో 30 వేల వరకు అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. 2003 తండ్రి కాలం చేసి తర్వాత నుంచి ఇప్పటి వరకు సొంతంగా ఒక్కరే ఆరువేల విగ్రహాలు.. మహానుభావులవి, పురాణపురుషులవి, రాజకీయ నాయకులవి తయారు చేశారు. జ్యోతిభాపూలే, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, రాణి రుద్రమ దేవి, అన్నమాచార్యులు, తిక్కన, మొల్ల, వివేకానంద, నెహ్రూ, అక్కినేని నాగేశ్వరావు, రఘుపతి వెంకయ్య, ఒబామా, పాప్ రారాజు మైఖేల్ జాక్సన్, సముద్రాల (సీనియర్) విగ్రహాలకూ ప్రాణం పోశారు. పవిత్రమైనది ఈ కళ: ‘‘శిల్ప కళ ఎంతో ఉత్కృష్టమైంది. ఎంతో నిష్ఠగా చేయాలి. ఫొటోను చూచి వ్యక్తిని చూస్తున్నట్లుగా శిల్పకారుడు లీనం అవ్వాలి. ఏ మాత్రం మన ఆలోచనల్లో తేడా వచ్చినా శిల్పం అసలు రూపం పోతుంది. అన్నం ఎంత పవిత్రంగా వండుతామో.. అంతకన్నా పవిత్రంగా శిల్ప కళను ప్రారంభించాలి. అప్పుడే అసలు రూపం వస్తుంది’’ అని చెప్పారు దేవిక. ‘మొదట మట్టితో తయారు చేస్తాం. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో రూపొందించిన నమూనా ఓకే అయిన తర్వాత వాటిని అచ్చులుగా రూపొందిస్తాం’’ అని వివరించారు. యునెస్కో గోల్డ్‌మెడలిస్ట్: దేవిక అసంఖ్యాంగా అవార్డులు అందుకున్నారు. మహిళా శిల్పిగా గిన్నీస్ బుక్‌లోకి ఎక్కాలనేది ఆమె ఆశయం. పాఠశాల స్థాయి నుండే ఆయా రంగాల్లో తన ప్రతిభకు సానబెట్టుకున్నారు. యునెస్కో గోల్డ్ మెడలిస్ట్గా కూడా ఖ్యాతి గడించారు. హైదరాబాద్ క్రిస్టల్ గార్డెన్స్‌లో లక్ష్మిదేవిగా నటించి ప్రదర్శించిన ‘ శ్రీలక్ష్మి వైభవం’ భరతనాట్య నృత్య ప్రదర్శన అంతర్జాతీయ కీర్తిని నార్జింపజేసింది. ‘‘ఒక తెలుగు మహిళా శిల్పిగా గ్లోబల్ స్థాయిలో రాణించాలనేదే నా ఆశయం. ధ్యేయం. కష్టం నా వంతు ఫలితం దేవుని వంతు’’ అంటారు దేవిక. ట్రస్ట్ ద్వారా సేవలు: దేవిక తాడేపల్లిగూడెంలో స్థిరపడ్డారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఉడయార్ అకాడమీ అండ్ ఫైనార్ట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ స్థాపించి కళామతల్లికి ఇతోధిక సేవలు అందిస్తున్నారు. తనకున్న దానిలోనే పదిమంది పేదలకు సహాయ పడాలనే సంకల్పంతో పని చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో ముందుంటున్నారు. బడుగు, బలహీన వర్గాల్లో ఐక్యత, రాజకీయ చైతన్యం తీసుకురావడంతో పాటు పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఎవరు తనని ఏ విధంగా ఆశ్రయించినా ముందుండి సేవ చేసి, వారి కష్టాలు తీర్చి పంపుతున్నారు. అందుకే స్థానికులు దేవికను బడుగుల రాణిగా పిలుస్తుంటారు. - కోన సుధాకర్‌రెడ్డి