సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈఎస్ఐ స్కాంలో మరో 6.5 కోట్ల అక్రమాలను గుర్తించినట్లు గురువారం ఏసీబీ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది.వారిలో కంచర్ల శ్రీ హరి బాబూ అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్ తదితరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దీంతో పాటు నిందితుల ఇళ్లలో, కార్యాలయాల్లో 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ఈ కేసులో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవిక రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ కె.వసంత ఇందిరాలపై కేసు నమోదు చేశారు. కాగా కేసుకు సంబంధించి ఏసీబీ తన విచారణను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment