సాక్షి, హైదరాబాద్ : ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణికి చెందిన కోటి 99 లక్షలను బుధవారం ఏసీబీ సీజ్ చేసింది. తెలంగాణతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో దేవికారాణితో పాటు ఆమె కుటుంబ సభ్యులు చిట్ ఫండ్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ప్రతి నెల చిట్ ఫండ్ కంపెనీకి లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. ఏసీబీ అధికారులు సదరు చిట్‌ఫండ్ కంపెనీనుంచి కోటి 99 లక్షల రూపాయల డీడీని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే దేవికారాణికి సంబంధించి రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల నగదుతో పాటు రెండు కోట్ల 29 లక్షల రూపాయలను డీడీల రూపంలో స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment