
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ స్కామ్‌లో ప్రధాన నిందితురాలుగా ఉన్న సంస్థ మాజీ డైరెక్టర్ దేవికారాణి మరో సారి అరెస్టయ్యారు.
సాక్షి, హైదరాబాద్ : ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మెడికల్ కిట్ల కొనుగోళ్లలో మాజీ డైరెక్టర్ దేవికారాణితో సహా 9 మందిని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. మెడికల్ కిట్ల కొనుగోలులో వాస్తవ ధర కన్నా అనేక రెట్లు పెంచి ప్రభుత్వా నికి దాదాపుగా రూ.6.5 కోట్లు నష్టం కలిగించా రన్న అభియోగాలపై తాజాగా ఈ కేసు నమోదైంది. ఓమ్ని ఫార్మా ఎండీ కంచర్ల హరిబాబు, ఐఎంస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మతో సహా 9 మందిని శుక్రవారం అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.