సాక్షి, హైదరాబాద్ : ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు దేవికారాణి సహా తొమ్మిది మంది నిందితులను చంచల్‌గూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈకేసులో అరెస్ట్‌ను సవాలు చేస్తూ నిందితుల తరఫు న్యాయవాదులు ఏబీసీ కోర్టులో పిటిషనల్ దాఖలు చేశారు. ఉదేశ్య పూర్వకంగానే తమ క్లయింట్ లను ఇబ్బంది పెడుతున్నారంటూ వాదిస్తున్నారు. ఇదే తరహా కేసుల్లో గత సుప్రీం తీర్పులను కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. పాత కేసుకు ప్రస్తుత కేసుకు నిందితుల పై ఒకే తరహా అభియోగాలు మోపారని నిందితుల తరుఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. (ఈఎస్‌ఐ స్కాం: మరోసారి దేవికారాణి అరెస్ట్)
కాగా శుక్రవారం దేవికారాణి, కంచర్ల శ్రీహరి బాబు అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృప సాగర్ రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, తింకశల వెంకటేష్‌లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ స్కామ్‌లో ఏసీబీ అధికారులు 6.5 కోట్ల రూపాయల అవినీతిని గుర్తించారు. దేవికారాణిని మొదటిసారి అరెస్ట్ చేసిన తర్వాత ఆమెకు సంబంధించిన 35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి ఏసీబీ సీజ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment