Nov 2nd : చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | Chandrababu Cases, Petitions, Court Hearings On Nov 2 Updates | Sakshi
Sakshi News home page

Nov 2nd CBN Cases Live Updates: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Thu, Nov 2 2023 7:01 AM | Last Updated on Thu, Nov 2 2023 5:38 PM

Chandrababu Cases Petitions Court Hearings Nov 2 Updates - Sakshi

Chandrababu Naidu Cases, Petitions, Court Hearings & Political Updates

17:30 PM, నవంబర్‌ 02 2023 
BRS పార్టీలో చేరనున్న కాసాని జ్ఞానేశ్వర్‌
బాబూ.. మీకో దండం..

► చంద్రబాబు, లోకేష్‌ల నుంచి బయటకొచ్చేసిన కాసాని
► రేపు ఉదయం బీఆర్‌ఎస్‌లో  చేరనున్న కాసాని
► గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక
► తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులుగా రెండు రోజుల క్రితం వరకు పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్.

17:00 PM, నవంబర్‌ 02 2023 
రేపటి దాకా ఆస్పత్రిలోనే చంద్రబాబు.!
► హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు
► ఉదయం 11 గంటలకు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన బాబు
► రేపు మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలోనే చంద్రబాబు

16:45 PM, నవంబర్‌ 02 2023 
చంద్రబాబుపై మరో కేసు నమోదు
► టిడిపి హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు
► APMDC ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిఐడీ
► ఏ1 గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు
► ఏ3గా చింతమనేని, ఏ4 గా దేవినేని ఉమ
► ప్రభుత్వ ఖజానాకు తీవ్రనష్టం చేకూర్చారని ఫిర్యాదు
► ఇప్పటి  వరకు చంద్రబాబుపై స్కిల్ స్కాం, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్, అసైన్డ్ ల్యాండ్, మద్యం కేసులు 
► మొత్తం 6 కేసుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు

15:45 PM, నవంబర్‌ 02 2023 
జనసేనలో ఏం జరుగుతోంది?
► పవన్‌ కళ్యాణ్‌ చర్యలతో విసుగు చెందుతోన్న జనసేన నాయకులు
► నెల్లూరు జనసేన ఇన్‌ఛార్జ్‌ కేతంరెడ్డి వినోద్‌ ఎందుకు దూరంగా ఉంటున్నారు?
► పిఠాపురం జనసేన ఇన్‌ఛార్జ్‌ మాకినేని శేషుకుమారి ముఖమెందుకు చాటేశారు?
► తిరుపతి జనసేన నాయకులు పసుపులేటి సురేష్‌, దిలీప్‌ సుంకర ఎందుకు దూరమయ్యారు?
► రాయలసీమ ప్రాంతీయ మహిళా కోఆర్డినేటర్‌ పసుపులేటి పద్మావతి  ఎందుకు పార్టీవైపు చూడడం లేదు?
► జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్‌ వెనక ఏం జరుగుతోంది?
► ఇప్పుడు జనసేనలో అధికారం ఎవరి చేతిలో ఉంది?
► జనసేన ప్రధాన కార్యాలయంలో రుక్మిణికి పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన బాధ్యతలేంటీ?

15:25 PM, నవంబర్‌ 02 2023 
నారా వారిది అబద్దాల ఫ్యాక్టరీ :  YSRCP
► సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్‌కు చెప్పింది.. అబద్ధం
► పది శాతం నిధులు పెడితే.. సీమెన్స్‌ సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా  ఇస్తుందన్నది.. అబద్ధం
► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే  వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నది.. అబద్ధం
►సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుడ్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేస్తే.. 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని చంద్రబాబు ఆరోపణ.. అబద్ధం
►48 రోజులకు పైగా జైల్లో ఉండి.. ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని చెప్తుండడం.. అబద్ధం
►చంద్రబాబు నాయుడు జైల్లో బరువు తగ్గారని నారా భువనేశ్వరి చేస్తున్న ప్రచారం.. అబద్ధం
► జైల్‌లో సదుపాయాల గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం.. అబద్ధం
►తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ చెప్తుండడం.. అబద్ధం
► చైనా నుండి డ్రాగన్ దోమలను  దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా  ప్రచారం చేయించడం.. అబద్ధం
►తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతుండడం.. అబద్ధం
► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు చెప్తుండడం.. అబద్ధం

15:25 PM, నవంబర్‌ 02 2023 
కాసాని దెబ్బకు కళ్లు బైర్లు కమ్మిన తెలుగుదేశం
► తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదని అధిష్టానాన్ని ప్రశ్నించిన కాసాని.!
► మీకో దండం, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటేనా అని ప్రశ్నించిన కాసాని
► కాసాని ప్రకటనను ఇప్పటివరకు ఖండించలేకపోతోన్న తెలుగుదేశం అధిష్టానం
► ఎందుకు పోటీ చేయలేకపోతుందో చెప్పలేకపోతోన్న చంద్రబాబు, లోకేష్‌
► హైదరాబాద్‌లో చాలా బలంగా ఉన్నామంటూ ర్యాలీలు చేసిన వారు పోటీకి ఎందుకు భయపడ్డారు?
► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150  డివిజన్ లలో గత ఎన్నికల్లో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు?  
► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా బిల్డప్‌లు ఎందుకు?
► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు?
► చింత చచ్చినా.. పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్‌ కోసం ఎందుకు కుటిల ప్రయత్నాలు
► చంద్రబాబు ఏం చేస్తున్నారో నిన్న ఢిల్లీలో బయటపెట్టిన బీజేపీ నేత ఈటల రాజేందర్‌
► తెలంగాణలో చంద్రబాబును ఎవరూ నమ్మబోరన్న డాక్టర్‌ లక్ష్మణ్‌
► బీజేపీని బ్లాక్‌మెయిల్‌ చేసేలా ఉంటోన్న చంద్రబాబు చర్యలు

15:20 PM, నవంబర్‌ 02 2023 
బాబు విడుదల తర్వాత తేడా కొడుతున్న నెంబర్లు
► తెలుగుదేశం, జనసేన పొత్తుపై పలు సందేహాలు
► జైల్లో చంద్రబాబును కలిసి బయట పొత్తు ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌
► ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు
► తమకు 50 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లు కావాలని చెప్పిన పవన్‌
► ఇప్పుడు 20 అసెంబ్లీ, 3 పార్లమెంటు ఇవ్వాలన్న యోచనలో తెలుగుదేశం
► చంద్రబాబు విడుదలైన తర్వాత కరకట్ట ఇంట్లో సుదీర్ఘంగా చర్చలు
► అన్ని చోట్లా మనమే పోటీ చేద్దామని బాబుకు చెబుతోన్న టిడిపి నేతలు
► తెలంగాణలో పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీ ఇచ్చేది 10కి మించబోవంటున్న టిడిపి నేతలు
► జనసేన సీను అంతే అయినప్పుడు మనమెందుకు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటున్న టిడిపి నేతలు
► పునరాలోచనలో పడ్డ తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌

15:15 PM, నవంబర్‌ 02 2023 
భువనేశ్వరీ నిజం నిలిచిపోయిందా?
► రూ.3లక్షల చొప్పున ఇస్తామంటూ ఘనంగా తెలుగుదేశం ప్రకటనలు
► చంద్రబాబు కోసం చనిపోయారు కాబట్టి రూ.3లక్షలు ఇస్తామన్న భువనేశ్వరీ
► అలా ఓ నలుగురికి పంచేసరికి మారిపోయిన సీను
► చంద్రబాబు విడుదల కాగానే నిలిచిపోయిన నిజం యాత్ర
► మిగతా వాళ్లకెపుడు ఇచ్చేది మూడు లక్షల చెక్కులు?
► పాత డేట్లతో ముందే చెక్కులు ఎలా తయారు చేశారు?
► మీ నిజం యాత్రకు నిజంగానే బ్రేకులేశారా?

14:55 PM, నవంబర్‌ 02 2023 
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టిడిపి చెప్పిన రోగాల జాబితా
► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్‌

► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక

► చంద్రబాబుకు యాంగిల్‌ క్లోజర్‌ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్‌ ప్రెజర్‌ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్‌

► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్‌

► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక

► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, నడుము తట్టుకోలేదు, వీపరీతంగా నొప్పి ఉంది : ఎల్లోమీడియాలోని మరో ఛానల్‌

►మరి, వీటన్నింటికి సరైన ట్రీట్‌మెంట్‌ ఇప్పుడయినా చేయిస్తున్నారా? : YSRCP

►ఇన్ని సమస్యలున్నా.. చంద్రబాబు 14గంటల పాటు ర్యాలీ చేశారా? : YSRCP

14:35 PM, నవంబర్‌ 02 2023 
మ్యానిఫెస్టోను అలా విజయవంతంగా మరిచిపోయారు.!
► నవంబర్‌ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో అంటూ టిడిపి, జనసేన గత వారం ఘనంగా ప్రచారం
► అక్టోబర్‌ 25న రాజమండ్రిలో ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ప్రకటించిన లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌
► చంద్రబాబు జైల్లో (అక్టోబర్‌ 25న) ఉన్నాడు కాబట్టి మినీ మ్యానిఫెస్టో అని ప్రకటన
► ప్రకటన చేసిన పవన్‌కళ్యాణ్‌ ఇటలీకి జంప్‌, కోరస్‌ ఇచ్చిన లోకేష్‌ ఢిల్లీకి జంప్‌
► జైలు నుంచి విడుదలయిన చంద్రబాబు హైదరాబాద్‌కు జంప్‌
► మ్యానిఫెస్టో గురించి ఎవరయినా అడిగినా.? అంతే సంగతులు
► మ్యానిఫెస్టోను మాయం చేసిన చరిత్ర ఉన్న పార్టీలే టిడిపి, జనసేన : YSRCP

14:29 PM, నవంబర్‌ 02 2023 
స్కిల్‌ అంతా స్కామే : ఆర్థికమంత్రి బుగ్గన
►విజయవాడలో ఆర్థికమంత్రి బుగ్గన
►స్కిల్ స్కామ్ GST వల్ల బయట పడింది
►2018 లోనే మన రాష్ట్రానికి విచారణ చెయ్యమని లేఖ రాశారు
►GST, SEBI, ED విచారణ చేసిన స్కామ్ ఇది
►2017 నుండి ఈ కేసులో విచారణ జరుగుతోంది
►అలాంటి కేసు CID విచారణ చెయ్యకూడదా..?
►అసలు వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా..?
►5 రోజుల్లోనే ట్రైనింగ్ సాధ్యమా..? దానిని ట్రైనింగ్ అంటారా..?
►డెమో చూపించి దాన్నే ట్రైనింగ్ అని కోట్లు కొల్లగొట్టారు..?
►370 కోట్ల కి డిజైన్ టెక్ ఈరోజు కి ఎంత ఖర్చయ్యిందో బిల్లే ఇవ్వలేదు
►సీమన్స్ కంపెనీ అసలు ఈ గ్రాంట్ ఇన్ కైండ్ అన్న పద్ధతే లేదు అని చెప్పింది
►అనంతపురం JNTU సెంటర్ లో లెక్కేస్తే 8 కోట్లు పరికరాలు ఉన్నాయి
►ఎంత చూసిన ఈ స్కామ్ లో 250 కోట్లు లెక్కలు దొరకడం లేదు
►పయ్యావుల కేశవ్ కోర్టు తేల్చేంత వరకు ఓపిక పట్టాలి
►కోర్టుకి ఆధారాలు చూపించామో లేదో వీళ్లకు తెలుసా..?
►విచారణలో సేకరించిన ఆధారాలు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తారు

14:12 PM, నవంబర్‌ 02 2023 
పయ్యావులకు బోలెడు అనుమానాలు
►స్కిల్‌ కేసుపై పయ్యావుల కేశవ్‌ పరిశోధన
►90%-10% అనేదే కాదని చెబుతున్నారు, మరో 5 రాష్ట్రాలు చేశాయి
►MOUపై తేదీ లేకుండా సంతకం పెట్టారని ఆరోపిస్తున్నారు
►ప్రధాన కంపెనీ జర్మనీలో ఉంది, సీమన్స్ కు మీరు లేఖ రాశారా?
►గ్రాంట్ ఇన్ ఎయిడ్ కు బదులు గ్రాంట్ ఇన్ కైండ్ అని రాసుకున్నారు. పదాలు మార్చినా.. ఆరోపణలు చేస్తారా?
►అయ్యా.. కేశవా.. ఇదే ఆర్గ్యుమెంట్‌ కోర్టు ముందు వినిపిస్తారా? : YSRCP
►ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉంటే.. 17a ప్రకారం గవర్నర్‌ అనుమతి లేకుండా అరెస్ట్‌ చేశారని ఎందుకు వాదిస్తున్నారు?
►తప్పు చేయలేదు అన్న ఏకవాక్యాన్ని కోర్టు ముందు ఎందుకు వినిపించడం లేదు?

14:09PM, నవంబర్‌ 02 2023 
చంద్రబాబు కేరాఫ్‌ AIG
►చంద్రబాబుకు వైద్య పరీక్షలు ప్రారంభించిన ప్రత్యేక వైద్య బృందం
►ముందుగా చర్మ సంబంధ వైద్య పరీక్షలు
►దాంతో పాటు సాధారణ పరీక్షలు చేయనున్న వైద్యులు
►వెన్నుముక సంబంధిత వైద్య పరీక్షలు
►చంద్రబాబు వైద్య పరీక్షలకు 3 నుంచి 4 గంటల సమయం

13:29PM, నవంబర్‌ 02 2023 
టీడీపీ ఖేల్‌ ఖతం
►చంద్రబాబు ఒక దొంగ.. ప్రజల డబ్బులు దోచేశాడు
►దొంగ అయిన చంద్రబాబు బయటకు వస్తే జనాలు ఏం ఆదరిస్తారు?
►40ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు సింపతీ కోసం ఒక గేమ్‌ ఆడుతున్నాడు
►ఈ రాష్ట్రంలో అతి పెద్ద రోగిస్టు చంద్రబాబు
►అనేక రోగాలు ఉన్నాయి అని కోరితే కోర్టు చంద్రబాబుకి బెయిల్ ఇచ్చింది
►లోకేష్ వల్ల కాకపోవడంతో పురందేశ్వరి బీజేపీ ముసుగులో బాబు కోసం పని చేస్తున్నారు
►టీడీపీ పని అయిపొయింది.. ఇక కోలుకోదు
:::విజయవాడలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్లు 

12:53PM, నవంబర్‌ 02 2023 
మళ్లీ 4 వారాలకు చంద్రబాబు జైలుకే!
►చంద్రబాబు హయాంలో అడ్డగోలు అవినీతి జరిగింది
►బాబు నిజాయితీపరుడు అయితే జైలుకు ఎందుకు వెళ్లారు?
►కన్ను బాగోలేదనే బెయిల్‌ ఇచ్చారు
►మళ్లీ నాలుగు వారాల తర్వాత జైలుకు రమ్మన్నారు
►అనకాపల్లి సామాజిక సాధికార యాత్ర ప్రారంభ సమావేశంలో మంత్రి బొత్స వ్యాఖ్యలు
ఇదీ చదవండి: బాబుకు అనారోగ్యం సాకు మాత్రమే!

12:29PM, నవంబర్‌ 02 2023 
ఆధారాలివ్వండి
►ఏపీ హైకోర్టులో సంజయ్, పొన్నవోలుపై పిల్
►ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ పిటిషన్‌
►ప్రెస్ మీట్ల కోసం వారు ప్రజాధనం ఖర్చు చేసినట్లు ఆధారాలున్నాయా? 
►ఏఏజీ, సీఐడీ చీఫ్ ఏం మాట్లాడారో....తర్జుమా చేసి ఇవ్వండి 
►పిటిషనర్ కు ధర్మాసనం ప్రశ్న
►విచారణ 8వ తేదీకి వాయిదా

12:07PM, నవంబర్‌ 02 2023 
బాబుకు వైద్య పరీక్షలు
►హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు
►చంద్రబాబు వైద్య పరీక్షలకు సుమారు 4 గంటలు పట్టే అవకాశం

11:54AM, నవంబర్‌ 02 2023 
చంద్రబాబుపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు
►అరెస్ట్‌ తర్వాత నిన్న హైదరాబాద్‌కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
►బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి జూబ్లీహిల్స్‌ నివాసానికి ర్యాలీ
►ర్యాలీపై హైదరాబాద్ లో కేసు నమోదు
►ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై కేసు నమోదు  చేసిన బేగంపేట పోలీసులు
►పనిగట్టుకుని జనసమీకరణ చేపట్టిన తెలుగుదేశం నేతలు
►చంద్రబాబు ర్యాలీ యాత్రలను సమర్థించుకున్న అచ్చెన్నాయుడు

10:30AM, నవంబర్‌ 02 2023 
ఏఐజీ ఆసుపత్రికి నారా లోకేశ్‌
►హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న నారా లోకేశ్‌
►మరికాసేపట్లో ఆసుపత్రికి వెళ్లనున్న చంద్రబాబు
►చంద్రబాబు వెళ్తున్న దృష్ట్యా ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు

08:20AM, నవంబర్‌ 02 2023 
వైద్యపరీక్షలు చేయించుకోనున్న చంద్రబాబు
►ప్రత్యేక విమానంలో నిన్న హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు
►జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి
►నిన్న చంద్రబాబును కలిసిన ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యుల బృందం
►వైద్యుల సూచన మేరకు నేడు ఏఐజీకి
►హైకోర్టు ఆదేశాల ప్రకారం.. వైద్య పరీక్షల నివేదికల్ని ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశం

07:18AM, నవంబర్‌ 02 2023 
ఫైబర్ నెట్ కుంభకోణంలో సీఐడీ దూకుడు
►ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు నిర్ణయం
►ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలని ప్రతిపాదన
►సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం
►అనుమతి కోసం నేడు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్న సీఐడీ
►టెరాసాఫ్ట్‌ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలన్న సీఐడీ ప్రతిపాదన
►ఆమోదిస్తూ రాష్ట్ర హోంశాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ 
►ఫైబర్ నెట్ కుంభకోణంలో 114 కోట్లు దుర్వినియోగమయ్యామని ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు
►ఈ కేసులో ఎ 1 గా వేమూరి హరికృష్ణ, ఎ 11 గా టెర్రా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్, ఎ -25 గా చంద్రబాబునాయుడి పేర్లు
►ఫైబర్ నెట్ కుంభకోణంలో నిందితులైన టెర్రా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్ కి ఆస్ధులతో పాటు పలు కంపెనీల ఆస్ధులు అటాచ్ చేయాలని ప్రతిపాదన
►తుమ్మల గోపీచంద్ మరియు ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు అటాచ్
►ఈ కుంభకోణంలో నిందితులైన నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇల్లులు అటాచ్
►మొత్తంగా అటాచ్‌ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి
►హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయనున్న సీఐడీ

ఇదీ చదవండి: చంద్రబాబు కనుసన్నల్లోనే ‘ఫైబర్‌ గ్రిడ్‌’ అక్రమాలు

07:13AM, నవంబర్‌ 02 2023 
అదనపు షరతుల పిటిషన్‌పై నిర్ణయం రేపే
►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సీఐడీ అనుబంధ పిటిషన్‌
►బెయిల్‌కు మరికొన్ని షరతులు విధించాలని కోర్టుకు విజ్ఞప్తి 
►బుధవారం కొనసాగిన వాదనలు 
► సీఐడీ కోరుతున్న షరతులు చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయన్న బాబు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్‌
►కోర్టు ఉత్తర్వులను చంద్రబాబు ఉల్లంఘించారని.. జైలు బయట మీడియా సమావేశం నిర్వహించారన్న సీఐడీ తరఫు లాయర్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
►ప్రత్యేక పరిస్థితుల్లోనే చంద్రబాబుకి కోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చిందని గుర్తు చేసిన ఏఏజీ 
► శుక్రవారం నిర్ణయం వెల్లడిస్తామన్న జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు

06:59AM, నవంబర్‌ 02 2023 
మళ్లీ ఢిల్లీకి వెళ్లిన లోకేష్‌పై సెటైర్లు
►మళ్లీ నిన్న ఢిల్లీకి వెళ్లిపోయిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబు
►టీడీపీ అధినేత, తండ్రి చంద్రబాబు మీద ఉన్న కేసులపై న్యాయ నిపుణులతో చర్చించేందుకేనన్న ప్రచారం
►వ్యక్తిగత పని మీద అని టీడీపీ వివరణ
►నవంబర్‌ 8న సుప్రీంలో క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు.. 9న ఫైబర్‌కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
►పదుల సంఖ్యలో పిటిషన్లపై చర్చ కోసమేనంటూ ప్రచారం
►మళ్లీ.. అరెస్ట్‌ భయంతోనేనంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు

06:49AM, నవంబర్‌ 02 2023 
చంద్రబాబు కోసం జనాలు.. టీడీపీ నేతల తంటాలు 

►జైలు జీవితం తర్వాత కరకట్ట ఇంటి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు
►యథేచ్ఛగా కోర్టు షరతులను ఉల్లంఘించిన చంద్రబాబు
►మొన్న సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం వరకు చంద్రబాబు యాత్రల పేరిట హడావిడి
►నిన్న సాయంత్రం హైదరాబాద్‌కు చేరిక 
►బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంటి దాకా టీడీపీ భారీ ర్యాలీ
►జనసమీకరణలో పోటీ పడ్డ తెలుగుదేశం నాయకులు

06:40AM, నవంబర్‌ 02 2023 
స్కిల్డ్‌ దొంగ.. చంద్రబాబు
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో అవినీతికి పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 
►సీఎంగా ఉన్న టైంలో ప్రభుత్వ ఖజానా నుంచి షెల్‌ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు
►కొల్లగొట్టిన రూ.371 కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాకు చేరాయని ఆధారాలు సమర్పించిన సీఐడీ
►సెప్టెంబర్‌ 09వ తేదీన అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అక్టోబర్‌ 31 సాయంత్రం మధ్యంతర బెయిల్‌ మీద విడుదల
►52 రోజుల పాటు రిమాండ్‌ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు
►కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలతో వరుస పిటిషన్లు
►చివరకు ఏపీ హైకోర్టులో స్వల్ఫ ఊరట
►షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు
►నాలుగు వారాల తర్వాత.. నవంబర్‌ 28వ తేదీ సాయంత్రం 5గం.లోపు జైల్లో సరెండర్‌ కావాలని చంద్రబాబుకి ఆదేశం
►కేవలం మానవతా ధృక్పథం.. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్‌ ఇస్తున్నామన్న హైకోర్టు
►కంటి సర్జరీ కోసం బెయిల్‌.. ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనద్దని ఆదేశం
►షరతులు ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్‌ రద్దు అవుతుందని హెచ్చరిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement