
హైదరాబాద్: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ కేసులో ఏసీబీ కోర్టుకు రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. కేసులో ఐ విట్నెస్‌లను వాగ్మూలం న్యాయస్థానం రికార్డు చేసింది. అసెంబ్లీ మాజీ కార్యదర్శి రాజా సదారాం వాంగ్మూలం నమోదు చేశారు. తదుపరి విచారణ వచ్చేనెల(సెప్టెంబర్) 6కు వాయిదా వేశారు.
ఆరేళ్లుగా విచారణ
2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్‌సన్‌కు ప్రలోభపెట్టేందుకు టీడీపీ పార్టీ తరఫున రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికి పోయారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకోనుంది. కాగా ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.