sebastian
-
చేయి పోయినా ఆత్మవిశ్వాసంతో సినిమా పూర్తి చేశాను
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘నరకాసుర’. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వంలో డా.అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సెబాస్టియన్ నోవా మాట్లాడుతూ– ‘‘దర్శకుడు కావాలనేది నా కల. ఓ ఫిల్మ్ స్కూల్లో శిక్షణ తీసుకుని అవకాశాల కోసం ప్రయత్నించినా కుదర్లేదు. టెక్నాలజీపై అవగాహన కోసం 2012లో ప్రసాద్ ల్యాబ్‌లో చేరాను. అక్కడ రిలీజ్‌కు నోచుకోని సినిమాలు కనిపించాయి. దీంతో సినిమా తీయడం కాదు.. తీసిన సినిమాను మార్కెట్ చేసుకోవడం ముఖ్యమని భావించి సాయి కొర్రపాటిగారి సహాయంతో డిస్ట్రిబ్యూషన్ రంగంలో చేరాను. ఆ తర్వాత నా దర్శకత్వంలో సినిమా కోసం కథ రెడీ చేసుకున్నాను. చిన్నతనంలో నేను తప్పిపోతే ట్రాన్స్‌జెండర్స్ నన్ను మా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కథకు ఈ సంఘటన ఓ స్ఫూర్తి. ఇక దర్శకుడిగా తొలి అవకాశమే కష్టం అనుకుంటే.. ‘నరకాసుర’ చిత్రీకరణ టైమ్‌లో ఒరిస్సాలో షూటింగ్ పూర్తి చేసుకుని జబల్పూర్ వెళ్తుంటే ప్రమాదం జరిగి, నా చేయి పోయింది. ప్రమాదం జరిగిన తర్వాత 27వ రోజు నేను సెట్స్‌లోకి వచ్చి, ఆత్మవిశ్వాసంతో సినిమాను పూర్తి చేశాను. ఇక మాధవన్, అరుణ్ విజయ్, వివేక్ ఒబెరాయ్, టొవినో థామస్ వంటి స్టార్స్‌తో ట్రైబల్ నేపథ్యంలో ఓ సినిమా ΄్లానింగ్లో ఉంది. మూడు భాషల్లో చిత్రీకరిస్తాం’’ అన్నారు. -
ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహా, సెబాస్టియన్
హైదరాబాద్: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ కేసులో ఏసీబీ కోర్టుకు రేవంత్‌రెడ్డి, ఉదయ్‌సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. కేసులో ఐ విట్నెస్లను వాగ్మూలం న్యాయస్థానం రికార్డు చేసింది. అసెంబ్లీ మాజీ కార్యదర్శి రాజా సదారాం వాంగ్మూలం నమోదు చేశారు. తదుపరి విచారణ వచ్చేనెల(సెప్టెంబర్) 6కు వాయిదా వేశారు. ఆరేళ్లుగా విచారణ 2015లో జరిగిన తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్కు ప్రలోభపెట్టేందుకు టీడీపీ పార్టీ తరఫున రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తూ కెమెరాకు అడ్డంగా దొరికి పోయారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది. దీంతో కేసు విచారణలో వేగం పుంజుకోనుంది. కాగా ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. -
ఓటుకు నోటు కేసు: వాంగ్మూలాలు నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోట్లు కేసు విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగా సోమవారం ఏసీబీ కోర్టులో సెబాస్టియన్, ఉదయసింహ , స్టీఫెన్ డ్రైవర్ శంకర్, రేవంత్ సోదరుడు కృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. వారి వాంగ్మూలాలను నమోదు ఏసీబీ న్యాయస్థానం నమోదు చేసుకుంది. ఈ కేసుపై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
ఓటుకు కోట్లు... ఆశ చూపింది సెబాస్టియనే..!
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి గెలుపు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు లంచం ఇస్తామని ప్రలోభపెట్టింది ఈ కేసులో రెండో నిందితునిగా ఉన్న బిషప్ హ్యారీ సెబాస్టియన్ అని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఈ కుట్రలో సెబాస్టియన్ పాత్రకు సంబంధించి అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు సెబాస్టియన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై గురువారం ఏసీబీ అదనపు ఎస్పీ రమణకుమార్ కౌంటర్ దాఖలు చేశారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో సెబాస్టియన్ పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలున్నాయి. సెబాస్టియన్ ఫోన్లో కుట్రకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. నామినేటెడ్ ఎమ్మెల్యేను ఓటు కోసం ప్రలోభపెట్టడం అవినీతి నిరోధక చట్టం కింద నేరం. ఈ కేసులో తనను అక్రమంగా ఇరికించారన్న సెబాస్టియన్ వాదనలో నిజం లేదు. స్టీఫెన్‌సన్‌తో ముందుగా ఫోన్లో మాట్లాడిందని సెబాస్టియన్. అడ్వాన్స్‌గా 50 లక్షల రూపాయలు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డితో కలసి సెబాస్టియన్ స్టీఫెన్సన్ సూచించిన అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. కేసు నమోదు చేసిన తర్వాత సెబాస్టియన్ సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా అనేక ఆధారాలు లభించాయి’’ అని తెలిపారు. ( ఓటుకు కోట్లు కుట్ర నిరూపిస్తాం: ఏసీబీ) అంతేకాక ‘‘అభియోగాల నమోదుపై 2018 మార్చి 5 నుంచి దాదాపు రెండున్నర ఏళ్లుగా నిందితులు సమయం తీసుకుంటూనే ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈనెల 9న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు అభియోగాలు నమోదు చేయాలని మరోసారి ప్రత్యేక కోర్టును కోరారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య, రుద్ర ఉదయసింహలు గత అక్టోబరు 12న డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయగా.. ఇతర నిందితులు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలని లేదా నేరుగా వాదనలు వినిపించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అయితే సెబాస్టియన్ తరఫు న్యాయవాది పలు వాయిదాలు తీసుకున్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు విచారణను జాప్యం చేసేందుకే ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేయండి’’ అని కౌంటర్లో కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. -
ఓటుకు కోట్లు కేసుపై విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై ఏసీబీ కౌంటరు దాఖలు చేసింది. సెబాస్టియన్ ఫోన్‌తో కుట్రలో కీలక వివరాలు బయటపడ్డాయని ఏసీబీ తెలిపింది. సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేయాలని ఏసీబీ కోర్టును కోరింది. విచారణ జాప్యం చేసేందుకే ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు దాఖలు చేశారని ఏసీబీ పేర్కొంది. ఓటుకు నోటు కేసుపై శుక్రవారం మరో సారి కోర్టులో వాదనలు జరగనున్నాయి. -
ఓటుకు కోట్లు కేసు: ‘నాకు ప్రాణహాని’
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో పెనుదుమారం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ కోర్టుకు హాజరయ్యారు. (తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు) కోర్టుకు హాజరయిన అనంతరం సెబాస్టియన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి.. అసలు దోషులను వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణ ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. బెదిరింపులు, దాడులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ తనను ఈ కేసులో ఇరికించిందన్నారు. ఆడియో టేపుల ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై విచారణ జరిగితే కీలక వ్యక్తులు వెలుగులోకి వస్తారని చెప్పారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన నగదు ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ జరగాలన్నారు. ఈ కేసులో అసలు సూత్రధారి ఎవరో ప్రజలందరికి తెలుసన్నారు. నిజనిజాలన్ని కోర్టుకు తెలుపుతానని అందుకే సూత్రధారులతో ప్రాణహాని ఉందని సబాస్టియన్ పేర్కొన్నారు. (రేవంత్ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు) -
రూ.5 కోట్లకు చంద్రబాబు ఓకే
సాక్షి, హైదరాబాద్: ‘మనవాళ్లు.. బ్రీఫ్డ్ మీ, అయామ్ విత్ యూ బ్రదర్, ఫర్ ఎవ్రీ థింగ్ అయామ్ విత్ యూ, వాట్ ఆల్ దె కమిటెడ్.. వి విల్ ఆనర్, ఫ్రీలీ యుకెన్ డిసైడ్.. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్’ఈ నాలుగు డైలాగులు తెలుగు ప్రజలకు చాలా బాగా పరిచయం. 2015 జూన్‌లో నమోదైన ‘ఓటుకు కోట్లు’కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రలోభపెట్టారంటూ అప్పట్లో విడుదలైన వీడియోల సారాంశమిది. చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాలుగేళ్ల క్రితం నాటి ఈ ‘ఓటుకు కోట్లు’కుంభకోణంలో.. తాజాగా మరో అత్యంత కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు వెలుగుచూడని తాజా వీడియోతో ఈ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 11 నిముషాల నిడివి ఉన్న ఈ వీడియోలో తెలంగాణ అసెంబ్లీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ను ప్రలోభ పెట్టేందుకు ఇచ్చిన రూ.50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలున్నాయి. డీల్‌లో భాగంగా ‘బాబు’మొదట రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని.. ఈ కేసులో రెండో ముద్దాయిగా ఉన్న సెబాస్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు చెప్పారు. అయితే తాను గట్టిగా పట్టుబట్టడం వల్లే ‘బాబు’చివరకు రూ.5 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారని.. ఇందులో భాగంగా రూ.50 లక్షలు పంపించారనేది వెల్లడైంది. సెబాస్టియన్ చేసిన వ్యాఖ్య ఈ వీడియోలో రికార్డయింది. రూ.50 లక్షల నగదును స్టీఫెన్సన్ టేబుల్ మీద పెట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి వెళ్లిపోయారు. అయితే అక్కడే ఆగిపోయిన సెబాస్టియన్ మాత్రం తనకు రావాల్సిన కమిషన్ గురించి స్టీఫెన్‌సన్‌తో మంతనాలు జరిపారు. ‘బాబు’తో మధ్యవర్తిత్వం వహించినందుకు తనకు పర్సంటేజీ ఇవ్వాలని స్టీఫెన్సన్ను కోరాడు. ఈ వీడియో నాలుగో నిముషంలో ‘నోటుకు కోట్లు’సూత్రధారి ఎవరో సెబాస్టియన్ వెల్లడించారు. వీడియోలో ఏముంది? ‘ఈ డీల్‌లో మధ్యవర్తులు కూడా ఉన్నారు. నిజానికి ‘బాబు’మొదట్లో రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్లు మాత్రమే ఇస్తానన్నారు. అయితే నేను పట్టుబట్టడంతో పాటు, డబ్బులు పెంచే విషయంలో బాధ్యతను తీసుకున్నా. ‘బాబు’నన్ను నమ్ముతున్నారు. నువ్వు మాత్రం రేవంత్‌రెడ్డిని విశ్వసిస్తున్నావు. అందుకే అతడిని రంగంలోకి దించాల్సి వచ్చింది’అని డీల్‌లో తన పాత్రను సెబాస్టియన్ వివరించారు. ఈ క్లిప్‌లో సెబాస్టియన్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ‘బాబు’, ‘బాస్’గురించి పదే పదే ప్రస్తావించగా.. స్టీఫెన్సన్, సెబాస్టియన్లకు ‘బాబు’ఎవరో తెలుసనే విషయం స్పష్టమవుతోంది. 11 నిముషాల నిడివి ఉన్న వీడియో క్లిప్ ప్రకారం గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఓటు వేస్తే.. మధ్యవర్తుల ద్వారా ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు ఇవ్వాల్సిన డబ్బును ‘బాబు’సమకూర్చారు. వీడియో క్లిప్‌తో గుట్టు రట్టు? 2015 జూన్‌లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్యే కోటా ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ను టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రలోభ పెట్టినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఎల్విస్ స్టీఫెన్సన్కు డబ్బులు ఇచ్చే క్రమంలో రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ప్రలోభాలకు సంబంధించిన తతంగాన్ని ఏసీబీ రహస్య కెమెరాలతో చిత్రీకరించింది. అయితే ఓటుకు కోట్లు కేసు నమోదై నాలుగే«ళ్లవుతున్నా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టేందుకు ఇచ్చిన రూ.50లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై చిక్కుముడి వీడటం లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ), ఇన్‌కంట్యాక్స్ (ఐటీ) విభాగాలు, ఏసీబీ ఇదే కోణంలో నాలుగేళ్లుగా విచారణ జరుపుతున్నాయి. ‘ఓటుకు కోట్లు’కేసులో అత్యంత కీలకమైన ఈ వీడియో క్లిప్ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ విచారణ ఏజెన్సీకి చిక్కలేదు. 2015లోనే ఏసీబీ ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలతో పాటు, ఓ ఫోన్ ద్వారా ఈ వీడియోను చిత్రీకరించారు. నోటుకు ఓటు కేసు విచారణ తాజాగా మరోమారు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో ఫోన్ ద్వారా చిత్రీకరించిన ఈ వీడియో క్లిప్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, అతని అనుచరుడు ఉదయ సింహ.. స్టీఫెన్సన్కు ఇచ్చిన డబ్బు తమది కాదని ఇన్నాళ్లూ విచారణ ఏజెన్సీలకు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెలుగు చూసిన ఈ క్లిప్ ‘నోటుకు కోట్లు’కేసు విచారణలో కీలకంగా మారడంతో పాటు, ఈ కేసు కుట్రదారుల గుట్టు బయట పెడుతుందని భావిస్తున్నారు. కాగా స్టీఫెన్సన్కు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ఈ వీడియోలో సంభాషణలు సాగాయి. ఏసీబీ కెమెరాలతో పాటు మరో ఫోన్లో! ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న తార్నాకకు చెందిన మాల్కమ్ టేలర్ నివాసంలో ఈ వీడియోను చిత్రీకరించారు. డీల్ సందర్భంగా ఏసీబీ ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలతో పాటు, మరో ఫోన్లో ఈ తతంగం రికార్డయింది. ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డి, మధ్యవర్తి సెబాస్టియన్ నడుమ జరిగిన సంప్రదింపులు, సంభాషణ ఈ వీడియోలో ఉన్నాయి. తార్నాకలోని మాల్కమ్ టేలర్ నివాసంలో ఎల్విస్ స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యింది మొదలుకుని డీల్ కుదరడం, నగదు ఇవ్వడం తదితర ఘట్టాలన్నీ ఇందులో ఉన్నాయి. ‘తెలంగాణలో నీకేమైనా జరిగితే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా నామినేట్ చేస్తాం. మిగతా అన్ని విషయాల్లోనూ నీ వెంట ఉంటా. మా ‘బాస్’ఇది నాకు వ్యక్తిగతంగా అప్పగించిన బాధ్యత. ఈ డీల్ కోసం నా తలను పణంగా పెడుతున్నా’అని స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌రెడ్డి చెప్పారు. రేవంత్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ‘నా మొత్తం జీవితాన్నే పణంగా పెడుతున్నా’అని స్టీఫెన్సన్ సమాధానం ఇవ్వగా, మా ‘బాస్’చెప్పిన పని చేస్తున్నా అని రేవంత్ సమాధానం ఇచ్చారు. ‘సెబాస్టియన్ ద్వారా ఈ రోజు రాత్రికల్లా మొత్తం డబ్బు పంపిస్తా’అని రేవంత్ రెడ్డి హామీ ఇవ్వగా.. వెనుక ఓ నల్ల బ్యాగుతో నిల్చున్న వ్యక్తి అందులో నుంచి నగదు నుంచి మధ్యలో ఉన్న టేబుల్ మీద పెట్టినట్లు క్లిప్ వెల్లడిస్తోంది. కాగా రేవంత్‌రెడ్డిని ఏసీబీ పోలీసులు అరెస్టు చేసే సందర్భంలో ఏసీబీ అధికారులతో రేవంత్ వాగ్వాదానికి దిగినట్లుగా క్లిప్‌లో రికార్డయింది. ‘ఓటుకు నోటు’క్రమమిదీ! ►2015 జూన్ మొదటి వారంలో తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్యే కోటాకు ఎన్నికలు జరిగాయి. ►ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డిని బరిలో నిలిపింది. ►పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేలా టీడీపీ డబ్బులు ఎరగా వేసింది. ►అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తన ‘బాస్’అప్పగించిన బాధ్యత మేరకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50లక్షలు ఇస్తూ ఏసీబీకి పట్టుబడ్డారు. ►వీడియో కెమెరాలతో ప్రలోభాల పర్వాన్ని చిత్రీకరించిన ఏసీబీ రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేయడంతో జైలుకు వెళ్లారు. ►ఈ కేసు విచారణను తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా సమీక్షిస్తున్నారు. నాటినుంచీ కేసు అనేక మలుపులూ తిరుగుతోంది. ►ఈ కేసులో రెండో ముద్దాయిగా ఉన్న సెబాస్టియన్ అమీర్‌పేట నివాసంపై 2018 సెప్టెంబర్‌లో ఐటీ విభాగం దాడులు చేసింది. ►2018 అక్టోబర్‌లో (రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు) రేవంత్‌రెడ్డి సన్నిహితుడు ఉదయసింహ, సోదరుడు కొండల్‌రెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ►2019 ఫిబ్రవరిలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌తోపాటు, ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయసింహ, వేం నరేందర్‌రెడ్డి, అతని కుమారుడిని ఈడీ విచారించింది. ►తాజాగా మార్చి 5, 2019న స్టీఫెన్‌సన్‌తో పాటు, కీలక సాక్షి మాల్కం టేలర్, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసింది. -
ఓటుకు కోట్లు : ఏది జరిగినా మీరే బాధ్యులు..!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో గురువారం మరో వీడియో బయటపడింది. స్పై కెమెరాలకు సమాంతరంగా ఏసీబీ ఏర్పాటు చేసిన ఫోన్ కెమెరాలో తాజా వీడియో రికార్డయింది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే, ఆంగ్లో ఇండియన్ ఎల్విస్ స్టీఫెన్సన్ను కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్లకు బేరం కుదిరినట్టు ఈ వీడియో లో స్పష్టమైంది. టీడీపీ నేత సెబాస్టియన్, స్టీఫెన్‌సన్‌తో.. ‘తొలుత బాబు గారు 3.5 కోట్లు ఇవ్వడానికే ఒప్పుకున్నారు. నా ఒత్తిడి మేరకు రూ. 5 కోట్లు ఇవ్వడానికి సరేనన్నారు’ అని మాట్లాడారు. అదే సమయంలో.. రేవంత్‌రెడ్డి బయటకు వెళ్లిన తర్వాత స్టీఫెన్సన్కు ముట్టజెప్పే సొమ్ములో తన కొచ్చే కమీషన్ గురించి కూడా సెబాస్టియన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. (సార్ ఎవరు? ) ఈ వ్యవహారంలో మధ్యవర్తులు ఉన్నట్టు వారి మధ్య జరిగిన సంభాషణ ద్వారా వెల్లడైంది. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రేవంత్‌ను అదుపులోకి తీసుకోవడంతో ఈ వీడియో ముగుస్తుంది. కాగా, ఈ డీల్ సమయంలో స్టీఫెన్సన్కు ఇచ్చిన రూ.50 లక్షల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెండ్ డెరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించినది ఎవరేనేది కూడా విచారణలో తేలనుంది. గత నాలుగేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో తాజా వీడియోతో విచారణ వేగం కావొచ్చని పలువురు భావిస్తున్నారు. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!) కాగా,‘ఓటుకు కోట్లు’ కేసులో ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలతో పాటు మరో నాలుగున్నర కోట్లు ఎక్కడ అంటూ నరేందర్ రెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?) తాజా వీడియో ఆధారంగా సంభాషణ.. స్టీఫెన్సన్ : లెటస్ గో టు ది డీల్.. సెబాస్టియన్ : నిజానికి బాబు ముందు 3.5 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పారు. నా ఒత్తిడి మేరకు రూ.5 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డిని మీరు నమ్ముతున్నారు. బాబు నన్ను నమ్ముతున్నారు. మీరు రేవంత్ రెడ్డిని నమ్మడంతో ఆయన తెరమీదకు వచ్చారు. ఏది జరిగినా మీరే బాధ్యులు.. ఓకే సార్. సంబధిత వార్తలు.. దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం ‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం! ఓటుకు కోట్లు కేసు; సుప్రీం ఆదేశాలు -
‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఓటుకు కోట్లు కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని ఇంగ్లిష్ డెయిలీ డెక్కన్ క్రానికల్ ప్రచురించిన కథనం సంచలనం రేపుతోంది. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో.. తార్నాకలోని మాల్కం టేలర్ అనే వ్యక్తి ఇంట్లో తీసిన వీడియో బయటికొచ్చింది. 11 నిముషాల నిడివి గల ఈ వీడియోలో టీడీపీ నేత సెబాస్టియన్, టీఆర్ఎస్ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసేందుకు బేరసారాలు నడిపారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సెబాస్టియన్ స్టీఫెన్‌సన్‌తో బేరం మాట్లాడినట్టు ఈ వీడియో ద్వారా తెలిసింది. (సార్ ఎవరు?) అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇవ్వడానికి నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వస్తాడని సెబాస్టియన్ చెప్పినట్టు ఈ వీడియోలో స్పష్టమైంది. తొలుత 3.5 కోట్లకే బాబు ఒప్పుకున్నారని, కానీ తన సిఫారసుతో 5 కోట్లకు డీల్ ఓకే అయిందని సెబాస్టియన్ స్టీఫెన్ సన్తో చెప్పిన విషయం వెల్లడైంది. మిగతా సొమ్ముకు తనదే బాధ్యత అంటూ సెబాస్టియన్ హామీయిచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఓటుకు కోట్లు కేసులో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయం తెలియనుంది. ఇప్పటికే ఈ కేసులో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 సెబాస్టియన్, ఉదయసింహ, వేం నరేందర్‌రెడ్డి విచారణ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకమైన చంద్రబాబు– స్టీఫెన్సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ టేపును ప్రఖ్యాతి గాంచిన చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. అయినా ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. నాలుగేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో తాజాగా బయటపడిన వీడియో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి..! (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?) సంబధిత వార్తలు : దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం ‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం! ఓటుకు కోట్లు కేసు; సుప్రీం ఆదేశాలు -
‘ఓటుకు కోట్లు కేసులో భాగంగానే ఐటీ దాడులు’
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో భాగంగానే తనపై ఐటీ దాడులు జరిగాయని ఈ కేసులో నిందితుడైన సెబాస్టియన్ తెలిపారు. విచారణకు హాజరు కావాలని ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఆయన సోమవారం ఐటీ కార్యాలయంలో అధికారుల ముందు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీ సూచన మేరకే ఐటీ దాడులు జరిగాయన్నారు. స్టీఫెన్సన్కు ఇవ్వ జూపిన రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారని, తర్వాత ఇస్తామన్న రూ. 4.50 కోట్లు ఎక్కడున్నాయని తనని ప్రశ్నించారని చెప్పారు. ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని, స్టీఫెన్సన్ ఇంట్లో నోట్ల కట్టలు చూడగానే అక్కడి నుంచి వెళ్లిపోయానని, ఆ తర్వాతే తనను పిలిచి అరెస్ట్ చేశారని వారికి వివరించినట్లు సెబాస్టియన్ తెలిపారు. -
ఓటుకు కోట్లు కేసు: సెబాస్టియన్, ఉదయ్‌లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు కేసు’ కు సంబంధించిన నిందితుల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు 23 గంటలుగా కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్‌కు ఐటీ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 1లోగా బషీర్‌బాగ్‌లోని ఆయకార్ భవన్లో వ్యక్తిగతంగా హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. ఇచ్చిన గడువులోగా హాజరకాకపోతే సెక్షన్ 271ఏ ఐటీ యాక్ట్ కింద జరిమాన విధిస్తామని నోటీసులో పేర్కొన్నారు. (రేవంత్ ఇంట్లో సోదాలు) ఉదయ్ సింహ ఇంట్లో ముగిసిన సోదాలు: ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు ఉదయ్ సింహ ఇంట్లో నిన్న సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన సోదాలు శుక్రవారం ఉదయం ఐదు గంటల వరకు కొనసాగాయి. ఉదయ్ సింహా ఇళ్లు, కార్యాలయాలు, ఆయన బంధువులకు సంబంధించిన మూడు నివాసాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇస్తూ పట్టుబడ్డ 50 లక్షలతో పాటు డీల్ భాగంగా ఇతరు నగదు ఎలా సమీకరించాలనుకున్నారని ఉదయ్ సింహను ప్రశ్నించారు. అంతేకాకుండా ఉదయ్‌కు చెందిన ఆస్తులు, ఆదాయం, రాబడుల వ్యవహారాలపై కూడా ఐటీ అధికారులు కూపీ లాగారు. సెక్షన్ 131 ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం ఉదయ్‌కు ఐటీ అధికారులు నోటీసుల ఇచ్చారు. అక్టోబర్ 1ను విచారణ సిద్దంగా ఉండాలని నోటీసులో పేర్నొన్నారు. చదవండి: రేవంత్‌కు అరెస్ట్ భయం..! కదులుతున్న డొంక -
మరికాసేపట్లో రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసు, ఓటుకు కోట్లు కేసు ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. గురువారం ఉదయం నుంచి రేవంత్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రేవంత్ రెడ్డికి సంబంధించని అన్ని పత్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అనుమానం ఉన్న ప్రతి విషయం, పత్రాలపై అందుబాటులో ఉన్నవారి నుంచి ఆరా తీస్తోంది. రేవంత్ రెడ్డికి సంబంధించిన పాత ఇంటి తాళాలు పగలగొట్టి కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి భార్యను కార్లో ఎక్కించుకొని వెళ్లి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. అయితే ప్రచారంలో భాగంగా సొంత నియోజకవర్గానికి వెళ్లిన రేవంత్ రెడ్డిని కుటుంబసభ్యులతో సహా వెంటనే తమ ముందు హాజరుకావాలని ప్రత్యేక అధికారుల నుంచి ఫోన్ వెళ్లినట్టు సమాచారం అందుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరికాసేపట్లో రేవంత్‌రెడ్డి మీడియా ముందుకువచ్చి మాట్లాడే అవకాశముందని తెలుస్తోంది. దీంతో కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్‌రెడ్డి మరికాసేపట్లో విలేకరుల సమావేశం నిర్వహించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. రేవంత్ మరికాసేపట్లో అధికారుల ముందు హాజరుకానున్నారు. (ఐటీ దాడులు: ‘ఓటుకు కోట్లు’కేసు లెక్క తేలేనా?) రేవంత్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు ‘ఓటుకు కోట్లు’కేసులో ఏ2 నిందితుడు సెబాస్టియన్ ఐటీ అధికారుల సోదాల అనంతరం మీడియాతో మాట్లాడారు. మౌర్య కేసుకు, రేవంత్ రెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఓటుకు కోట్లు కేసులో ముద్దాయిగా ఉన్న కేసులోనే ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేస్తున్నారని వివరించారు. తన సంస్థలకు సంబంధించిన అన్ని పత్రాలు క్లియర్‌గా ఉన్నాయని, ఐటీ రిటర్స్న్ కూడా క్లియర్‌గా ఉన్నాయన్నారు. ఈ రకంగా ప్రభుత్వం దాడులు చేయించడం భావ్యం కాదన్నారు. చదవండి: బ్రేకింగ్: రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు రేవంత్ రెడ్డి ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత -
ఐటీ దాడులు
-
ఐటీ దాడులు: ‘ఓటుకు కోట్లు’కేసు లెక్క తేలేనా?
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు కోట్లు’ కేసులో ఏ1 రేవంత్ రెడ్డి, ఏ2 సెబాస్టియన్లు లక్ష్యంగా ఆదాయపు పన్ను శాఖ దాడుల నిర్వహించింది. ఓటకు నోటు విషయంలో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు ఇచ్చిన 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీస్తున్నట్టు సమాచారం. ముందస్తు అంగీకారం ప్రకారం ఇచ్చిన రూ 50 లక్షలతో పాటు ఇవ్వాలనుకున్న నాలుగున్నర కోట్ల విషయంపైనా ఐటీ అధికారులు దృష్టి సారించారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన భూపాల్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌పైనా అధికారులు తనీఖీలు చేస్తున్నారు. గత కొంత కాలంగా ఓటుకు కోట్లు కేసు నత్తనడకన నడుస్తోందని, కేసు నీరుగారుతుందంటూ విమర్శలు వినిపిస్తున్నా తరుణంలో ఐటీ దాడులు రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. గురువారం ఉదయం నుంచి చేపట్టిన ఐటీ సోదాల్లో అసలు దోషులు బయటకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర, ఆడియో టేపు (బ్రీఫ్డ్ మీ), ఆయన డైరెక్షన్‌పై కూడా విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవిలపై దర్యాప్తు చేయాల్సిందిగా ఈ నెల 13న ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు ఐటీ శాఖకు లేఖ రాశారు. ఏసీబీ లేఖ అందగానే ఆదాయపు పన్ను శాఖ పని ప్రారంభించింది. ( బ్రేకింగ్: రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు ) చంద్రబాబు నాయడు 2014లో అధికారంలోకి రాగానే మొట్టమొదట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ‘ఓటుకు కోట్లు’ వ్యవహారానికి తెరలేపి తన మార్కు ఫార్టీ ఫిరాయింపుల పర్వానికి తెరతీశారు. ఓటుకు నోటు కేసు మూడేళ్ళ క్రితం రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, జాతీయ స్థాయిలో ఎంతలా హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. ఆ కేసు వల్లనే చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చాల్సివచ్చింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి వీడియోల సాక్షిగా స్టీఫెన్ సన్ ఇంట్లో పట్టుబడిన సంగతి తెలిసిందే. చదవండి: నన్ను అరెస్టు చేసేందుకు కేసీఆర్ కుట్ర -
ఇల్లు ఖాళీ చేయమంటే సెబాస్టియన్ బెదిరింపులు
-
సెబాస్టియన్ మోసం చేశాడు
పాలమూరు: ‘నోటుకు ఓటు’ కేసులో వార్తలకెక్కిన సెబాస్టియన్ తమను మోసం చేశాడని కొందుర్గు మండలం ఏన్కిరాల గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబసభ్యులు సోమవారం జిల్లాకేంద్రంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా అధికారులకు ఫిర్యాదుచేశారు. ‘ఐదుగుంటల భూమిని చర్చి నిర్మాణానికి ఇస్తే మీకు ఇల్లు కట్టిస్తానని, మీ కొడుకు రంజిత్‌ను అమెరికాలో చదివించి ఉద్యోగం ఇప్పిస్తానని’ తమతో గిఫ్ట్‌డీడ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేయించుకున్నాడని రైతు రత్నం, ఆయన భార్య బాలమణి పేర్కొన్నారు. ఆ తరువాత తమకు తెలియకుండానే 20 గుంటల భూమిని ఆయనపేరుమీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని వాపోయారు. తమను మోసం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని రద్దు చేసి తమకు ఇవ్వాలని కోరారు. స్థానిక అధికారులకు, గ్రామ పెద్దలకు చెబితే సెబాస్టియన్ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. కలెక్టర్, మంత్రులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారని బాధితులు తెలిపారు. -
ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆందోళన కలిగించింది
-
ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆందోళన కలిగించింది: మత్తయ్య
గుంటూరు: ఓటుకు కోట్లు కేసు విచారణకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియడం లేదని, ఆ కేసులో నాలుగో నిందితుడు జెరూసలేం మత్తయ్య అన్నారు. ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు హ్యారీ సెబాస్టియన్‌ను కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రానివ్వడం లేదని మత్తయ్య పేర్కొన్నారు. వాయిస్ శాంపిల్స్‌కు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరి (ఎఫ్ఎస్ఎల్) రిపోర్ట్ రావడం మాకు ఆందోళన కలిగించిందని తెలిపారు. ఏకంగా ఒక మంత్రే మమ్మల్ని అవమానిస్తున్నారని మత్తయ్య గుంటూరులో అన్నారు. ఇక భవిష్యత్తులో విపరీత పరిణామాలు ఎదురైతే ఏం చేయాలో తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
'సెబాస్టియన్ వాహనాన్ని తిరిగిచ్చేయండి'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ పట్టుబడిన కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ నేత సెబాస్టియన్ వాహనాన్ని ఆయనకు తిరిగి ఇవ్వాలని ప్రత్యేక కోర్టు ఏసీబీని ఆదేశించింది. అయితే ఇందుకు సెబాస్టియన్ రూ. 2 లక్షలు పూచీకత్తు సమర్పించాలని కోర్టు షరతు విధించింది. అదే విధంగా అరెస్టు సమయంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న.. కేసుతో సంబంధం లేని ఇతర డాక్యుమెంట్లను కూడా తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. మరో నిందితుడు ఉదయసింహ నుంచి స్వాధీనం చేసుకున్న కారు అతడిది కాకపోవడంతో కారు యజమానిని హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది. -
సమస్యలు పరిష్కరించేది జనార్దనే
జనార్దన్ టీడీపీ కార్యాలయ ఇన్చార్జి: సెబాస్టియన్ మా సమస్యలను చంద్రబాబు వద్ద ప్రస్తావించేది అతనే హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో కొత్తగా తెరపైకి వచ్చిన జనార్దన్ ఎవరనే విషయాన్ని ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న బిషప్ సెబాస్టియన్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయ బాధ్యతలు నిర్వహించే టీడీ జనార్దన్ దృష్టికి తీసుకెళ్లే అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్తాయన్నారు. షరతులతో కూడిన బెయిల్‌పై బయటకొచ్చిన సెబాస్టియన్ గురువారం ఏసీబీ కార్యాలయానికి సంతకం చేయడానికి వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా టీడీపీ కార్యాలయ ఇన్చార్జి టీడీ జనార్దన్తోనే ప్రస్తావిస్తాం. సీఎం చంద్రబాబును నేరుగా కలిసే అవకాశం మాకు దొరకదు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి చాలా బిజీగా ఉంటారు. కనుక మా సమస్యలను జనార్దన్‌తో చెప్పుకుంటాం. ఆ తర్వాత ఆయన సీఎం చంద్రబాబు వద్ద ఆ సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరిస్తారు’ అని సెబాస్టియన్ పేర్కొన్నారు. ప్రత్యేక న్యాయస్థానానికి ఏసీబీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో జనార్దన్ అనే వ్యక్తి ఎవ రని విలేకరులు ప్రశ్నించగా సెబాస్టియన్ పైవిధంగా స్పందించారు. అయితే ఈ కేసుతో జనార్దన్‌కు ఏలాంటి సంబంధం లేదన్నారు. ఏసీబీ కావాలనే తమను కుట్రపూరితంగా ట్రాప్ చేసి ఈ కేసులో ఇరికించిందన్నారు. తమ ఫోన్లను ఏసీబీ ట్యాపింగ్ చేసిందని ఆరోపించారు. తన ఫోన్లో ఎలాంటి సంభాషణలూ రికార్డు కాలేదని, అవన్నీ ఏసీబీ సృష్టిస్తున్న కట్టుకథలని సెబాస్టియన్ చెప్పుకొచ్చారు. -
'సెబాస్టియన్ ను ఏ మతం, ఏ దేవుడూ క్షమించడు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ ను ఏ మతం, ఏ దేవుడూ క్షమించడని రెవరెండ్ జార్జ్ కె హర్బట్ విమర్శించారు. సెబాస్టియన్ చరిత్ర క్రైస్తవులందరికీ తెలుసని.. బోరబండలో అద్దెకుంటూ ఇంటిని కబ్జా చేశారని హర్బట్ ఆరోపించారు. నీతిమాలిన పనులకు పాల్పడి అనైతిక చర్యలకు సెబాస్టియన్ దిగారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తిని ఏ మతం, ఏ దేవుడూ కూడా క్షమించడన్నారు. సెబాస్టియన్ ను చూసి క్రైస్తవ సమాజం అసహ్యించుకుంటోందని హర్బట్ పేర్కొన్నారు. -
'ఫోన్లు మావి కాదు.. ట్యాప్ చేశారు'
హైదరాబాద్: తమపై కుట్ర పూరితంగానే ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఓటుకు కోట్లు కేసు నిందితుడు సెబాస్టియన్ అన్నారు. కండిషనల్ బెయిల్లో భాగంగా ఏసీబీ కార్యాలయానికి వచ్చిన సెబాస్టియన్ అక్కడి మీడియా ప్రతినిధులతో అరకొరగా మాట్లాడారు. అసలు ఆ ఫోన్లు తమవి కాదని, ట్రాప్ చేశారని, కుట్రలు చేశారంటూ రుసరుసలాడారు. ఇదే సందర్భంలో ఓటుకు నోటు కేసులో జనార్దన్ పేరు వినిస్తోందని, అసలు జనార్దన్ ఎవరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అతడు టీడీపీ కార్యాలయం ఇన్చార్జీ అని, తమ నాయకుడు చంద్రబాబు దృష్టికి ఏవైనా అంశాలు తీసుకెళ్లాలంటే జనార్దన్ ద్వారానే తీసుకెళతామని చెప్పారు. -
'కుట్రపూరితంగానే మా ఫోన్ ట్యాపింగ్'
-
సండ్ర - సెబాస్టియన్ ఏం మాట్లాడుకున్నారంటే..!
-
సండ్ర - సెబాస్టియన్ ఏం మాట్లాడుకున్నారంటే..!
ఓటుకు కోట్లు కేసులో మరికొన్ని కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అరెస్టుపై కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఏసీబీ వీటిని పొందుపరిచింది. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం వెనుక పథక రచనను ఏసీబీ పూసగుచ్చినట్లు వివరించింది. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో సండ్ర ఎక్కడున్నారు, ఎవరెవరితో మాట్లాడారనే మొత్తం స్టోరీని ఏసీబీ కోర్టు ముందు ఉంచింది. ఓపక్క మహానాడు, మరోవైపు పథకరచన అంతా ఏకకాలంలో జరిగిపోయాయి. ఈ కేసులో రేవంత్‌రెడ్డి ఎంత కీలకంగా వ్యహరించారో... అంతే కీలకంగా సండ్ర వెంకట వీరయ్య కూడా వ్యవహరించారని ఏసీబీ చెబుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలు కేవలం ఒకరిద్దరి ఆలోచన కాదని, ఇది పూర్తిస్థాయిలో వ్యవస్థీకృత నేరమని ఏసీబీ తన రిమాండ్ రిపోర్టులో చెప్పకనే చెప్పింది. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ కేంద్రంగా ఈవ్యవహారం నడిచిందని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. సెల్‌నంబర్లు.. సంభాషణలు మే 31న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రెడ్ హాండెడ్‌గా పట్టుకున్న సమయంలో ఏసీబీ కొన్ని ఫోన్లను స్వాధీనం చేసుకుంది. రేవంత్‌రెడ్డి ఫోన్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహా ఉపయోగించిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది. ఈ కేసులో రెండో నిందితుడగా ఉన్న సెబాస్టియన్ ఫోన్లో కొన్ని కాల్స్ రికార్డు చేసినట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో తేలింది. మే 23 నుంచి మే 31 వరకూ మొత్తం 32 సార్లు సెబాస్టియన్ - సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుకున్నట్టుగా ఎఫ్ఎస్ఎల్ స్పష్టం చేసింది. ఎమ్మెల్యే కొనుగోలు ఆపరేషన్ కోసం సండ్ర మొత్తం రెండు ఫోన్ నంబర్లలో మాట్లాడారు. 87908 25678 నంబర్ నుంచే కాక మరో నంబర్ 94406 25955 నుంచి కూడా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు. ఈ నంబర్లు రెండూ వెంకట వీరయ్యవేనంటూ సంబంధిత టెలికాం కంపెనీల నుంచి ఏసీబీ అధికారికంగా వివరాలు తీసుకుంది. ఆపరేషన్ నడిచిన కాలంలో 87908 25678 నంబర్ నుంచి ఎమ్మెల్యే వీరయ్య - 95059 00009 నంబర్లో ఉన్న రేవంత్‌రెడ్డితో 18 సార్లు మాట్లాడారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి కూడా వీరయ్యకు రెండుసార్లు కాల్ చేశారు. ఈ కాల్స్ అన్నీ మే 24 నుంచి మే 31 మధ్య చోటుచేసుకున్నవే. మరింత లోతుగా దర్యాప్తుచేసిన తర్వాత వెంకటవీరయ్య, రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ల మధ్య మరో 19 సార్లు సంభాషణలు జరిగాయని ఏసీబీ సవివరంగా కోర్టుకు నివేదించింది. వీరయ్య నంబర్ 87908 25678 నుంచి సెబాస్టియన్ ఫోన్ 93943 26000కు కాల్స్ వెళ్లాయని నిర్ధారించారు. వీరయ్యకు చెందిన మరో ఫోన్ నంబర్ 94406 25955 నుంచి కూడా సెబాస్టియన్ నంబర్‌కు కాల్స్ వెళ్లాయని ఏసీబీ ధ్రువీకరించింది. ఈ వివరాలను కోర్టు ముందు ఉంచింది. ఫోన్ రికార్డింగ్.. ఉద్దేశపూర్వకమా? ఈ కేసులో మొత్తం ట్విస్ట్ సెబాస్టియన్ ఫోన్ రికార్డింగ్. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల సమయంలో సెబాస్టియన్ హెచ్‌టీసీ ఫోన్‌ను ఉపయోగించారు. ఏసీబీ అధికారులు ట్రాప్ చేస్తున్నప్పుడు సెబాస్టియన్ నుంచి ఈ ఫోన్‌నే స్వాధీనం చేసుకున్నారు. ఉద్దేశపూర్వకమో లేక అప్రయత్నమో తెలియదు గానీ మొత్తం కాల్స్ అన్నీ.. ఈ ఫోన్లో రికార్డయ్యాయి. వీటినే ఫోరెన్సిక్ నిపుణులు వెలికితీశారు. రిమాండ్ రిపోర్టులో మొత్తం మూడు కాల్స్‌కు సంబంధించి సంభాషణలను ఏసీబీ యథాతథంగా రిమాండ్ రిపోర్టులో పొందుపరించింది. మే 27 రాత్రి 9:45 నిమిషాలకు 2:09 నిమిషాల సేపు వెంకటవీరయ్య, సెబాస్టియన్ మాట్లాడుకున్నారు. సెబాస్టియనే మొదట వీరయ్యకు ఫోన్ చేశారు. ఏ-2 (సెబాస్టియన్): ఆ.. ఎమ్మెల్యే గారండీ.. సర్ ఎమ్మెల్యే (వెంకటవీరయ్య): ఏమైంది..? ఏ-2: సర్, అది .. ఇప్పుడు మనకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి సర్.. ఆయన గురించి,,, ఎమ్మెల్యే: అంటే మనకు ఎలక్షన్స్‌లో ఓట్లు ఉంటాయ్... ఏ-2: ఆ.. ఎమ్మెల్సీ... ఎమ్మెల్యే: ఎలక్షన్స్ల.. , ఎలక్షన్స్ల ఆయనకు ఓటు హక్కు ఉంది. ఏ-2: అవును ఎమ్మెల్యే : ఇంగ.. ఆయనేమన్నా.. మనకు అమౌంట్‌కు లొంగుతాడేమో, మన పార్టీకి సహకరించమని అడగాలి. ఏ-2: ఓహో.. అదా... ఎమ్మెల్యే : ఎందుకంటే... ఆయనకు ఫరదర్ రాజకీయాలతో అవసరం లేదు కదా? మేమంటే.. ఎలక్షన్స్‌లో గెలవాల.. ఒకసారి నామినేటెడ్ అయిపోయిద్ది గదా.., డబ్బు ముఖ్యం కదా.. ఆయనకు . ఏ-2:అదయితే కరెక్టు. ఎమ్మెల్యే : ఆ.. ఆ... సోర్స్ మనకు కావాలి. ఏ-2: ఓహో.. మనకు ఎంత టైముంది... సర్.. మనకు. ఎమ్మెల్యే : మనకు.. ఒకటవ తారీఖు నాడు పోలింగ్ ఉంది. ఏ-2: ఓకే.. ఈలోపుగా మనం టాప్ చేయాలి. ఎమ్మెల్యే : ఆ..ఆ.. ఈ లోపుల టాప్ చేసి.. ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేస్తే... ఏ-2: ఒకే సర్. ఎట్లా మనం.. ఆయనకు... ఎక్కడన్నా, మనం హోటల్లో టైం ఇద్దామా? మాట్లాడటానికి లేదా... ఎమ్మెల్యే : ఆహా... మీరు ఆయనతో.. మీరు ఆయనతోని మళ్లా... దగ్గరా? ఎట్లా? మనం డీల్ చేసి సక్సెస్ కావాలి. ఫెయిల్ కావొద్దు. ఏ-2: ఓహో.. ఆ రెస్పాన్స్‌బిలిటీ... మరి మీరు తీసుకుంటారా సర్.. నేను మాట్లాడతా గనక... ఎమ్మెల్యే : ఆ అమౌంట్.. ఆయన ఓటుకు రెస్పాన్స్ ఇస్తే.. అమౌంట్‌కు రెస్పాన్స్‌బిలిటీ నాది అయితది. ఆయన ఎవరి పేరు చెప్తే.. ఆడ బెడదాం. మధ్యవర్తి ఖాయం ఉంటుంది. ఏ-2: ఆహా.. సర్. ఎట్ల సర్.. ఇప్పుడు మనం ఆయన ఓటు, మనకు ఏయాల.. మన ఎమ్మెల్యే, మన ఎమ్మెల్సీకి. ఎమ్మెల్యే : మన.. మన అభ్యర్థికి వేయాల. ఏ-2: ఇన్ కేస్..లేదు అంటే ఎట్లా.. ఎస్కేప్ చేపియ్యాలి మనం.. ఆరోజు ఆయనకి మనం. ఏ బాంబే, కలకత్తా వెళ్లిపోయేటట్లుగ మనం.. ఏర్పాట్లు చేయాల మనం. ఆబ్సెంట్ అయినా.. ఫర్వాలేదు కదా ఓటింగ్‌కు. ఎమ్మెల్యే : ఆబ్సెంట్ అంటే... కంటే కూడా, ముందు ముందు మీరు ఫస్ట్... ఓటుకు అడగాలి. లేకపోతే ఆబ్సెంట్‌కు అడుగుదాం. ముందు ఓటుకు అడగాలి, ఓటు కావాలి. ఏ-2: ఓకే ... ఓటు కావాలి. ఎమ్మెల్యే : ఊహుం... ఊహుం.. ఏ-2: సరే.. సరే.. సరి. నేను .. నాకిప్పుడు ఈ రెండు రోజులు మన మహానాడు బీజీ కదా సర్. అయినాకూడా నేను ... ఎమ్మెల్యే :మహానాడు ఉన్నది. నేను సెపరేట్ పర్మిషన్ తీసుకుంటాను. ఏ-2: ఆ.. సర్. ఎమ్మెల్యే : నాకు రేపటికి కావాలి. ఏ-2: సరే.. సరే.. రేపు మార్నింగ్ నేను అక్కడకి వస్తున్నామన్నా... ఎమ్మెల్యే : ఆ... ఏ-2: ఎన్టీఆర్ ఘాట్‌కు వస్తున్నాం, ప్రేయర్ చేయడానికి సర్... సర్ రమ్మన్నారు. ఎమ్మెల్యే : సర్.. ఎన్నింటికి వస్తున్నారు ఘాట్‌కి. ఏ-2: ఏమో సర్.. 7 గంటలకు రమ్మన్నారు నన్ను. ఎమ్మెల్యే : ఓకే.. మీరు మీ పని చూసుకోండి. మిగతా పని తర్వాత చూద్దాం. ఏ-2: ఒకే సర్.. మంచిది.. నేను టచ్‌లో ఉంటా మీకు. ఓకే.. ఎమ్మెల్యే :థాంక్యూ... ఏ-2: థాంక్యూ.. థాంక్యూ... సర్ ------------------------------------------------ మే 28 సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు మరో 3:10 నిమిషాల పాటు వీరయ్య, సెబాస్టియన్ మాట్లాడుకున్నారు. ఈసారి కూడా సెబాస్టియనే వీరయ్యకు కాల్ చేశారు. ఏ-2: (సెబాస్టియన్): ఎమ్మెల్యే గారూ నమస్కారం సార్... ఎమ్మెల్యే (వెంకటవీరయ్య): హలో... ఏ-2: నమస్కారం సర్.. ఎమ్మెల్యేగారూ... ఎమ్మెల్యే : నమస్కారం.. నమస్కారం.. చూశానూ.. మీ మెసేజ్ చూశాను. ఏ-2: సర్.. ఆ..ఆ.. ఎమ్మెల్యే : ఇప్పుడు మీరు ఎక్కడున్నారు. ఇప్పుడు.. ఏ-2: నేనాసర్.. నేను మా ఆఫీసులో ఉన్నాను (మోతీనగర్) ఎమ్మెల్యే : ఇవాళ మహానాడు... , మహానాడు.. ఏ-2:రాలేదండి సర్. ఇ.. ఇగ.. పొద్దుగాల నేను అక్కడకి సమాధి దగ్గరకి పోయినా. ఇవాళ సర్వమత సమ్మేళనం కింద.. అందరి మతాల పెద్దలు వచ్చి, ప్రార్ధన చేయాల. అందులో మాదిగూడా ఉండె. ఎమ్మెల్యే : ఓకే ఏ-2: సర్.. వచ్చారు. అందరొచ్చారు. వచ్చిన తర్వాత.. మాకు అక్కడే పది అయిపోయింది. ఎమ్మెల్యే : ఓకే ..ఓకే ఏ-2: సర్.. వెంటనే.. అంటే సమాధిని చూసేసి.. ఫ్లవర్ చల్లి వెళ్లిపోయారు. మేం అక్కడే ఉన్నాం. అక్కడనుంచీ మీరు చెప్పిన పని గురించి.. నేను అక్కడకి పోయినా. ఎమ్మెల్యే : అదే ముఖ్యం లెండి.. ఇవాళ. అదే ముఖ్యం.. అదే ముఖ్యం. ఏ-2:అదీ.. మీరు చెప్పారు కదా..? అందుకొరకు నేనుబోయాను.. మాట్లాడినా. ఎమ్మెల్యే : ఆ... ఏ-2: ఆ.. ఆ. మాట్లాడితే ఆయన .. మనకు, మనకు.. చెప్పకుండా ఆల్రెడీ ఎవరో ఈరోజు ఉదయం పోయిండ్రంట. ఎమ్మెల్యే : ఆహా.. ఏ-2: పోతే వాళ్లవర్షన్కు, నా వర్షన్‌కు డిఫరెంట్ ఉంది. ఎమ్మెల్యే : ఆ.. ఆ.. ఆ.. ఏ-2: అయితే... ఆయనేమన్నాడంటే.. నువ్వు మాకు బిషప్. నువ్వు చెప్పేది మాకు నమ్ముకం ఉంటాది. వాళ్లు చెప్పేది.. ఏమో. ఎట్లంటావో పోతరు. ఎందో మళ్లీ.. నిజమా? కాదా? ఏందో మళ్లీ... నాకు చెడ్డపేరు వస్తదేమో.. అని ఒక మాట అన్నరు. ఎమ్మెల్యే : ఓ..ఓ.. ఏ-2: అయితే... నేను ఆయన్ను ఎట్లా మేనేజ్ చేసినా అంటే.. ఇన్‌కేస్ ముందు.. బీజేపీలో అట్కిన్సన్ అనే ఒక రాజ్యసభ మెంబర్ ఉండే.., నామినేటెడ్ ఆంగ్లో. ఆయననే నేనే ప్రమోట్ చేసినా.. మా బిషప్‌లకు చెప్పి. ఎమ్మెల్యే : ఓకే. ఏ-2: మాకు, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది. బీజేపీ ఉంది. మీక్కావాలంటే.. ఇక్కడ పోయినా కూడా, మేం ఢిల్లీ వరకూ రికమెండ్ చేయగలుగుతాం. ఏదైనా మైనార్టీ కమిషన్‌లో బోర్డు మెంబర్‌గా ఒకటి, రెండోది.. ఆంధ్రాలో ఇంగ.. మాకు నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్‌కు సీటివ్వలేదు. మీలో ఎవరైనా మీ చుట్టాలు ఉంటే.. రికమెండ్ చేయ్..., బాబుతో మాట్లాడతా... ఎమ్మెల్యే : ఓకే ఏ-2: మూడోది.. మొత్తం మన ప్రభుత్వం.. ఆంధ్రాలో నీకేపని కావాలన్నా, నువ్వు ప్రతి మంత్రీ చేసిపెడతాడు నీకు. ఎమ్మెల్యే : అవును. ఏ-2: నాల్గోది.. వచ్చే ఎలక్షన్లో, 100 పర్సంట్.. మన టీడీపీనే వస్తాది.. ఈడ. వస్తే.. మళ్లీ నీ పేరే ప్రపోజ్ చేస్తాం ఎమ్మెల్యే : అవును. ఏ-2: నాలుగు ఆప్షన్స్ ఇచ్చాం సర్. ఎమ్మెల్యే : ఆ..ఆ... ఏ-2: ఇచ్చేవరకూ మస్త్... ప్లీజింగ్ అయిపోయిండు.. ఆయన, మీరు చెప్పింది చాలా బాగుంది. నాకు నచ్చింది. పొద్దుగాల వచ్చినవాల్లు.. వేరే విధంగా మాట్లాడిండ్రు అని అన్నాడు. ఎమ్మెల్యే : అ... ఏ-2: వాళ్లను పక్కకు పెట్టేసెయ్.. నేను బిషప్‌ను. నేను క్రిస్టియన్‌ను... , నువ్వు క్రిస్టియన్వు. ఎమ్మెల్యే : అవును. ఏ-2: నేనేం చేస్తానో.. అది అయితది. మీ ఇష్టం మరి అన్నా. అంతే... నాకు, నీకూ టైం ఇయ్యండి. ఈ రోజు నేను మా ఫ్యామిలీతో మాట్లాడతా.. మా వెల్ విషర్స్‌తో మాట్లాడి డిస్కషన్స్ చేసుకుని, ఈ రోజు గానీ, రేపు పొద్దుగాలకల్లా నేను చెప్తాని.. అన్నాడు. ఎమ్మెల్యే : ఒకే .. ఒకే.. వెరీగుడ్ ఏ-2: నో అని అయితే అన్లేదు. నేను చెప్పినా.. నీ లైఫ్ బాగైపోతాది. మేం ఇప్పుడు నీకు అండగా ఉంటాం. మాపార్టీ.. నాపార్టీ... తరఫున వచ్చినా నేను. నీవు, నేను బిషప్‌గా లేకపోతే, వో.. ఇక పక్కకు పెట్టేసేయండి. ఆ.., ఒక వెల్విషర్ నువ్వు క్రిస్టియన్, నేను క్రిస్టియన్ని. నీకేం కావాలంటే డైరెక్ట్‌గా బాబుదగ్గరకి తీసుకెళ్లే సత్తా నాకున్నది. నీకేం కావాలో చెప్పు. ఎమ్మెల్యే : అందుకనే మీరు..మీరు .. మరి రేపటికన్నా.. ఒక లైనప్చేస్తే మనం సిట్టింగ్ పెట్టుకుందాం. ఏ-2: ఆ..ఆ.. అదిసర్.. ఇప్పుడు ఇంకోటి.. ఏందంటే.. మీరు నాకు సడన్‌గా లైన్లో దొరకట్లేదు. ఇప్పుడంటే.. మహానాడు ఉంది.. రేపు నేను వచ్చేస్తా.., నేను కూడా డయాస్ మీద ఉంటా. ----------------------------------------------- మే 28 సాయంత్రం 6 గంటల 15నిమిషాలకు మరో 3:28 నిమిషాల పాటు వీరయ్య, సెబాస్టియన్లు మరోసారి మాట్లాడుకున్నారు. ఈసారికూడా సెబాస్టియనే వీరయ్యకు కాల్ చేశారు. ఏ-2: హెలో.. ఎమ్మెల్యే : హెలో.. ఏ-2: ఆ సర్.. రాత్రికి ఏమైనా కలుసుకోవచ్చా మనం. సిటీలో ఎక్కడైనా.. ఎమ్మెల్యే : ఓ.. ఓకే. కలుసుకుందాం. అంటే నేనొస్తా. మనం ఎన్నింటికి రావాలో.. చెప్తే.. నేను అన్నింటికి వస్తాను. ఏ-2: అచ్చా... మీరిప్పుడు ఎక్కడున్నాడు సర్. స్టేయింగ్ ఎక్కడున్నారు. ఎమ్మెల్యే : మహానాడు దగ్గరనే ఉన్నాను. ఏ-2: ఆ..ఆ.. ఓకే ఎమ్మెల్యే : ఆ.. ఏ-2: మహానాడు అయిపోయినాక.. మనకు 8 అయితాది కదా.. ఎట్లా అయినా.. 7-8 అవుద్ది. ఎమ్మెల్యే : అవునవును.. ఎక్కడ కూర్చోవచ్చు. ఏ-2: మీరు చెప్పండి సర్. ఎక్కడైనా ఫర్వాలేదు. ఎక్కడున్నా కూర్చుని మాట్లాడుకుని మనం ఎట్లా చేద్దాం.. ఏంటిది మరి... ఎందుకంటే... మీరు సడన్‌గా రేపు కాల్ చేసిండ్రనుకో, మనం మళ్లీ మహానాడులో ఉంటా.. ఎక్కడైనా. ఓకే. అదీ పరిస్థితి. ఎమ్మెల్యే : ఆహా.. ఆహా.. అంటే మనం ఉన్నాగాని, మనం ఉన్నాగాని.. ఆం, మనం అదే ప్రయార్టీ. మనం ఏమీ లేదు.. సర్.. మనకు అది ప్రయార్టీ అని చెప్పిండు. మనం మన పద్ధతిలో మనం వెళ్దాం. ఏ-2: అచ్చా.. ఓకే. సరే ఇప్పుడు మహానాడు... మీకెప్పుడు అయిపోతది. ఎన్ని గంటలకు అయిపోతది.. మరి నాకు చెప్తే .... ఎమ్మెల్యే : నేను అది అయిపోయినాక సర్ దగ్గర ఎమ్మెల్యేల మీటింగ్ అంటున్నరు. ఏ-2: ఆహా... ఎమ్మెల్యే : ఒకే .. నేను కాంగానే... మీకు చెప్తా. ఆగండి. ఏ-2: ఒకే .. ఇప్పుడు మీరు సర్‌తో... ఎమ్మెల్యే : మీరు ఏ ఏరియాలో ఉంటారో మీరు చెప్పండి. ఏ-2: నేను మోతీనగర్ సర్. ఎమ్మెల్యే : మోతీనగర్.. ఒకే.. ఆయనా.... ఏ-2: ఆయనొచ్చి.. సికింద్రాబాద్‌లో ఉంటాడు. ఎమ్మెల్యే : సికింద్రాబాద్.. మనకూ, ఆయన మీకూ, మీకూ.. కామన్ ప్లేస్ ఎక్కడ. మీరు డిస్కస్ చేయండి. ఏ-2: అట్లంటారా..? ఎమ్మెల్యే : హ.. హ.. ఏ-2: ఎప్పుడాయన డిస్కస్ జేసిన తర్వాత.. మనం ఎప్పుడు సిట్టింగ్ పెడదాం. ఎమ్మెల్యే : ఆయన ఓకే అంటే.. రేపు మీరు ఏ టైం అయినా.., మహానాడు అయినా ఎగ్గొట్టి వచ్చేస్తా. మీరు ముందు ఆయన ... ఆయనతోని ఓకే చేస్తే, ఆయన డౌట్స్గాని, ఆయనకి క్లారిఫికేషన్స్ కావాలనో.. హామీ... అన్నీ నేను ఉంటా. ఏ-2: ఓకే.. నాకు ప్రాబ్లం ఏందంటే.. మీరు నాకు లైన్లో దొరుకుత లేరు. పొద్దుగాల నుంచి ఎన్నిసార్లో ట్రైచేసినా. ఎమ్మెల్యే : ఆహా.. అంటే.. మహానాడులో రావట్లేదు. ఏ-2: అవును. అక్కడ జామర్లు ఉంటది.. నాకు తెలుసు. ఎమ్మెల్యే : ఆ.. ఆ.. మీరు ఒక పని చేయండి. మా డ్రైవర్ నంబరు ఇస్తాను. అది రాసుకోండి... ఏ-2: ఒక్క నిమిషం సర్... ఆ చెప్పు సర్... ఎమ్మెల్యే : మా డ్రైవర్ నెంబర్ 8186 ఏ-2: 8186 ఎమ్మెల్యే : 8255 ఏ-2: 8255 ఎమ్మెల్యే :60 ఏ-2: 60, ఏం పేరు సర్ ఆయనది. ఎమ్మెల్యే : బాషా ఏ-2: బాషా , ఓకే ఎమ్మెల్యే : 81 ఏ-2: ఆ ఆ... 86 ఎమ్మెల్యే : 82 ఏ-2: 8255 ఎమ్మెల్యే : 5560 ఏ-2: బాషా, ఓకే టైమ్, ఇప్పుడు నేనడిగేదేందంటే... రేపు మరి నేను మహానాడులో ఉండాల్నా... మల్లీ సార్‌కు తెల్వది కద సర్... లేడని నన్నంటాడు. నువ్వే రాలేదేంటి ... మల్లీ బాగుండదు కదా... ఎట్ల మరి నీవు సర్కి... ఎమ్మెల్యే : ఆల్ రడీ నేను నీకు ఈ బాధ్యత అప్పజెప్పినట్టు చెప్పిన. ఏ-2: ఆ... ఎమ్మెల్యే : నేను .. నేను.. అక్కడ జామరొస్తే... సర్తోటి మీకు నేను ఫోన్ చేపిస్తా... ఏ-2: ఆ.. ఆ .. ప్లీజ్ ఆ పని చేయండి... ఎందుకంటే నేను జనార్దన్ సర్ కూడా అడిగిండియ్యాలా... నువ్వెందుకు రాలేదని... నాకియ్యాల మద్యాహ్నం పోన్ చేసిండు ఎమ్మెల్యే : లేలే... నేన్ జెప్త... నేన్ జెప్తా... ఏ-2: నేను ఆయనకు చెప్పలేదు... నేనేందుకంటే... చెప్పాల్నా వద్దా... మల్లీ అయనే... ఎమ్మెల్యే : మీరెవ్వరికి చెప్పద్దు... నేను సార్‌తో చెప్తా... ఏ-2: ఆ సర్కి చెప్పండి... ఇట్ల క్రిస్టియన్ ప్రెసిడెంట్ బిషప్ గారు ఈ పని జేస్తన్నడు సర్... అందుకే రాలేదు అని జెప్పండి... ఎమ్మెల్యే : లే... లే... నేనన్ని... నేను నా బాధ్యత... నేను ఒప్పజెప్త ఏ-2: ఆ మల్లీ నాకు నీవు మీటింగ్ ఎందుకు రాలేదంటే... మల్లి నాకు బాగుండదు... ఎమ్మెల్యే : మీరు మీరు నాకు వదిలేసేయండి... ఇప్పుడు జనార్దన్ గారికి కూడా చెబుతా... ఏ-2: ఆ చెప్పండి... ఆ జనార్దన్ గారికి చెప్పండి... సార్‌కు చెప్పండి ఎమ్మెల్యే : ఇద్దరికి చెబుతా.... ఏ-2: ఇద్దరికి చెప్పండి... జనార్దన్ గారికి ఈ విషయం చెబుతున్నారా ఏమైనా... ఎమ్మెల్యే : ఏం అవసరం లేదు... మనం మన పనిలో ఉన్నట్లు... నేను చెప్తలే మీకెందుకు... ఏ-2: ఆ ఓకే.... అంతే చెప్పండి... సార్ ఒక పని అప్పజెప్పండి... ఆ పని మీద ఉన్నాడని చెప్పండి... ఎమ్మెల్యే : ఆ.. ఏ-2: ఆ మంచిది సర్... ఎమ్మెల్యే : థాంక్యూ అండీ.... ఏ-2: థాంక్యూ... థాంక్యూ... ------------------------------------------------ మే 30 ఉదయం 10 గంటల 35 నిమిషాలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నుంచి సెబాస్టియన్‌కు కాల్ వెళ్లింది. 2 నిమిషాల 14 సెకన్ల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే... ఏపీ సీఎం చంద్రబాబు నివాసం కేంద్రంగా.. ఈ వ్యవహారం నడిచినట్టు.. రిమాండ్ రిపోర్టులోని అంశాలను పరిశీలిస్తే వెల్లడవుతోంది. సండ్ర అరెస్టుకు ముందు... ఆయన గన్‌మ్యాన్, పీఏల నుంచి ఏసీబీ అధికారులు వాంగ్మూలాలు సేకరించారు. ఏయే సమయాల్లో సండ్ర... ఎక్కడెక్కడకు వెళ్లారన్నదానిపై పూర్తిస్థాయిలో వారి సాక్ష్యాలను నమోదు చేశారు. సండ్ర గన్ మ్యాన్ లచ్చు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. మే 30 వ తేదీ ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లినట్టుగా గన్‌మ్యాన్ లచ్చు ఏసీబీకి చెప్పారు. ఏపీ సీఎం ఇంట్లోకి వెళ్లిన గంటన్నర తర్వాత అంటే 30వ తేదీ ఉదయం 10 గంటలా 35 నిమిషాలకు సెబాస్టియన్ సండ్రకు కాల్ చేశారు. సెబాస్టియన్ ఫోన్ నుంచి 087908 25678 నంబర్‌కు కాల్ వెళ్లింది. ఈ సమయంలో సండ్ర, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఒకే చోట ఉన్నారు. ప్లాన్ వేసుకున్నాక, అక్కడ నుంచి నేరుగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు అక్కడ నుంచి స్టీఫెసన్ ఇంటికి వెళ్లినట్టు.. ఈ కాల్ డేటా స్పష్టం చేస్తోంది. ఈ కాల్ సంభాషణలు ఏంటంటే... సండ్ర వెంకటవీరయ్య(ఎమ్మెల్యే) : హలో.., సెబాస్టియన్ (ఏ-2) : ఎమ్మెల్యేగారూ నమస్కారం సర్ ఎమ్మెల్యే : నమస్తేనండి.. ఏ-2: అదే.. రేవంత్‌రెడ్డిగారికి ఫోన్ చేశాను సర్.. నేను ఎమ్మెల్యే : ఆ..ఆ.. ఏ-2: బాబుగారి ఇంటిదగ్గరున్నాడంట. ఎమ్మెల్యే : ఆ.. ఆ.. ఏ-2: అది మీరొకసారి మాట్లాడి.. మనం, ఎందుకంటే.. మనం 11 గంటలకు టైం ఇచ్చినాం ఎమ్మెల్యే : ఒక్క నిమిషం.. నా ఎదురుగానే ఉన్నాడు. ఏ-2: ఆ.. ఓకే.. ఓకే.. సరే మాట్లాడండి. ఎమ్మెల్యే : ఒక్క నిమిషం లైన్లా ఉండు. ఏ-2: ఆ... ఎమ్మెల్యే : ....................... హలో ఏ-2: ఆహా.. సర్... చెప్పండి. ఎమ్మెల్యే : ................ హలో... ఏ-2: ఆహా సర్.. చెప్పండి సర్. ఎమ్మెల్యే : అదే.. అదే.. ఇక్కడున్నాం, సర్ దగ్గర 10 నిమిషాల్లో మాట్లాడేసి బయల్దేరుతాం. ఏ-2: బయలుదేరుతా.. - మరి మీరటు వచ్చేస్తారా? నేను బయలుదేరాలా? ఆయన ఎదురుచూస్తున్నాడు. ఎమ్మెల్యే : అవును.. మీరు ఎక్కడున్నారు. ఏ-2: మేం ఇక్కడ.. మోతీనగర్... ఎర్రగడ్డ... ఎమ్మెల్యే : మోతీనగర్..... అయితే ఒక పని చేయండి. మీరటు పార్టీ ఆఫీసు దిక్కు రండి. నేనటు వచ్చేస్తా. ఏ-2: పార్టీ.... ఎమ్మెల్యే : కారులో కూర్చుని పోదాం. ఏ-2: పార్టీ ఆఫీసులో.. సర్. ఎమ్మెల్యే : మీరు పార్టీ ఆఫీసు దగ్గరనే ఆపుకోండి బండి. ఏ-2: ఆ.... ఎమ్మెల్యే : మనం వెళ్లాల్సింది ఎటువైపు. ఏ-2: ఆ.. - బోయా.. ఇక్కడకు బోయగూడ. ఎమ్మెల్యే : అయితే.. ఓకే.. మీరు పార్టీ ఆఫీసు దగ్గరకు రండి . అయితే నాకు ఈజీ అయిద్ది. ఇది చూసుకుని నేను ఆడకి వచ్చేస్తా. ఏ-2: ఆ మంచిది సర్.. పార్టీ ఆఫీసు కాడకి వచ్చేస్తా. ఎమ్మెల్యే : ఒక్క నిమిషం. ఏ-2: ఆ... ఎమ్మెల్యే : ఆ.. అన్నగారూ.. ఒక పనిచేయండి మీరు. ఈ అడ్రస్‌కు మనం ఒక సీక్రెట్ డ్యూటీలో పోయేటప్పుడు అడ్రస్ వెతుక్కోకూడదు. డైరెక్ట్‌గా పోయేటట్టు ఉండాలంటే.. మీరు ఆఫీసుకాడ వచ్చి.. బైట పెట్టుకుని ఉండండి. మనోడు వచ్చేస్తాడు. ఏ-2: నేను బయటనే ఉంటా. బైటొచ్చి.. ఫోన్చేయాల్పా.. ఆఫీసుకాడకి. ఎమ్మెల్యే : ఆ.. పార్టీ ఆఫీసుముందు.. ఆ..చెట్లుంటాయికదా.. క్యాంటీన్ పక్కెంబడి.. చెట్టుకాడుండి.. నీడ... ఏ-2: మీరక్కడున్నారా... ఎమ్మెల్యే : లె.. లె.. నై... సారింటికాడున్నా... నువ్వు------, ఇద్దరం, ఎందుకు డబుల్ పనొద్దిలే. ఏ-2: ఆ.. ఓకే.. ఓకే.. ఎమ్మెల్యే : ఇద్దరం వద్దులే... బాగోదులే. ఏ-2: మీ ఇష్టం. మీ రంటే.. మీరు ఎమ్మెల్యే : మా కొద్దులే.. మాకేం ఇబ్బంది లేదు. ఎవరు చేసినా పార్టీ పని, మన దోస్తోడు. ఏ-2: హ..హ..హ.. ఎమ్మెల్యే : మీరు చేసినా, అన్నచేసినా, నేను చేసినా... ఒక్కటే. కామన్ మన అజెండా. సరే..సరే.. నేను ఆడ గేటు. -
'ఆ ముగ్గురూ మా పార్టీకి చెందిన వారే'
-
ఆ ముగ్గురూ మా పార్టీ వాళ్లే: సెబాస్టియన్
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మత్తయ్య, జిమ్మిబాబు, రేవంత్ రెడ్డిలు తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని ఈ కేసులో నిందితుడు సెబాస్టియన్ పేర్కొన్నారు. సోమవారం ఏసీబీ కార్యాలయం వెలుపల సెబాస్టియన్ మీడియాతో మాట్లాడారు. ఆ ముగ్గురు వ్యక్తులూ తమ పార్టీకి చెందిన వారేనని స్పష్టం చేశారు. బెయిల్ మీద విడుదలైన తర్వాత ప్రతిరోజూ తప్పనిసరిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చి సంతకం చేయాలన్న నిబంధనకు అనుగుణంగా ఆయన ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ఆయనపై పలు ప్రశ్నలు సంధించింది. దానికి సమాధానంగా మాట్లాడుతూ, తాను నివసిస్తున్న ఇంటిని కబ్జా చేశారన్న వార్తలను సెబాస్టియన్ ఖండించాడు. ఆ ఇంటిని కబ్జా చేయలేదని.. అది తనే ఇల్లేనని పేర్కొన్నారు. ఇంటిని కబ్జా చేశారంటూ ఆరోపించిన వారిపై ఇప్పటికే ఫిర్యాదు చేశానన్నారు. -
ఓటుకు కోట్లు కేసులో కొత్త పేరు: జిమ్మీకి నోటీసులు
ఓటుకు కోట్లు కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు కేసులో ఎక్కడా పేరు బయటపడని 'జిమ్మీ' అనే వ్యక్తికి ఏసీబీ వర్గాలు నోటీసు జారీచేశాయి. సోమవారం సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సెబాస్టియన్‌ను స్టీఫెన్సన్ వద్దకు తీసుకొచ్చి, ఆయనను పరిచయం చేసిన వ్యక్తే ఈ జిమ్మీ. ఈ విషయాన్ని స్టీఫెన్సన్ తన వాంగ్మూలంలో తెలిపారు. అయితే ఈ కేసు మొత్తమ్మీద జిమ్మీ పాత్ర ఏంటన్న విషయం, అసలు ఈ జిమ్మీ ఎవరన్న విషయం మాత్రం ఇప్పటివరకు ఎవరికీ తెలియలేదు. అసలు అతడికి రాజకీయాలతో లింకులేంటో, సెబాస్టియన్ ఎలా తెలుసన్న విషయం కూడా బయటపడలేదు. ఈ వివరాలన్నీ ఏసీబీ విచారణలో బయటకొచ్చే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో ఎవరికి ఎప్పుడు నోటీసులు ఇస్తారన్న విషయం కూడా చిట్ట చివరి నిమిషం వరకు బయటకు పొక్కడంలేదు. ఏసీబీ అధికారులు చాలా పకడ్బందీగా, నోటీసులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ పేర్లు వెల్లడిస్తున్నారు. గతంలో ఒకటి రెండు పేర్లమీద అనుమానాలు వచ్చినప్పుడు.. ఏసీబీ కావాలనే లీక్ చేస్తోందన్న విమర్శలు వెలువడటంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి తోడు ముందుగానే పేర్లు బయటకు వస్తే వాళ్లంతా జాగ్రత్త పడతారని, చిట్ట చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచుతున్నారు. తాము 60 రోజుల్లో చార్జిషీటు దాఖలుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఒకవేళ అంతకు మంచి ఆలస్యమైనా కోర్టు నుంచి అనుమతి తీసుకుని దాఖలు చేస్తామని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. -
ఆ ముగ్గురి ఇళ్లలో సోదాలు
-
ఆ ముగ్గురి ఇళ్లలో సోదాలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ నిందితుల ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనీఖీలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహల ఇళ్లల్లో ఏసీబీ శాఖ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు ప్రారంభించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిన కేసులో రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహ అరెస్టయిన విషయం తెలిసిందే. -
ఓటుకు నోటు ఆపరేషన్ సాగిన తీరిదీ..
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మధ్య జరిగిన వ్యవహారం మొత్తం ఎలా సాగింది.. ఈ అపరేషన్‌లో స్టీఫెన్‌ను రేవంత్ ఎప్పుడు ఎలా కలిశారు... చంద్రబాబుతో ఎప్పుడు మాట్లాడించారు.. ఈ తతంగం ఎలా సాగిందో ఒకసారి చూద్దాం... రేవంత్ తనను బాసే ఆథరైజ్ చేసి పంపించాడంటూ స్టీఫెన్‌తో చెప్పారు. అంతేకాక తనకు ఇచ్చిన అప్పర్ లిమిట్ ఇచ్చింది 'రెండున్నర' అని చెప్పారు. దాంతో తాము ముగ్గురిని కలిసి మూడు ఇచ్చామన్నారు. ఈ విషయం తమకు కూడా తెలియాల్సిన పని లేదని, మీరే డైరెక్ట్‌గా సార్‌తో మాట్లాడుకోవచ్చని చెప్పారు. దానికీ స్టీఫెన్.. సార్ ఎప్పుడు కలుస్తారని అడగడంతో.. రేవంత్ 'ఇప్పుడే ఫోన్లో మాట్లాడిస్తా' అని చెప్పారు. ఇక్కడ ఏదైనా సమస్య అనుకుంటే.. మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడే ఇస్తాము.. ఇదే విషయాన్ని సార్‌తో చెబుతానన్నాడు. ఇంతలో చంద్రబాబు తరపు మనిషి ఫోన్లో స్టీఫెన్‌సన్‌తో మాట్లాడారు. 'హలో బ్రదర్ బాబుగారు మీతో మాట్లాడుతారు.. లైన్లో ఉండండి' అన్నాడు. చంద్రబాబు ఫోన్లో స్టీఫెన్‌తో ఫోన్లో ఇలా మాట్లాడారు... హాలో..బ్రదర్.. మనవాళ్లు నాకంతా వివరించారు. మీకు అండగా నేను ఉంటా...! కంగారు పడాల్సిందేమీ లేదని హామీ ఇచ్చారు. అన్నింటికి మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తామన్నారు. మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి... ఎలాంటి సమస్య ఉండదు..అది మా హామీ... మనం కలిసి పనిచేద్దామని స్టీఫెన్‌కు చంద్రబాబు హామీ ఇచ్చారు. -
ఫోన్లో మాట్లాడించింది ఎవరు.. ఏసీబీ ఆరా
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కోట్లు వెదజల్లిన కేసులో మరికొన్ని కీలక అంశాలు బయట పడుతున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ను చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించింది ఎవరన్నదానిపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఆడియో టేపులలో వినిపించిన మొదటి గొంతును పోల్చేందుకు ఏసీబీ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. 'అవర్ బాబుగారు వాంట్స్ టు టాక్ టు యూ.. బీ ఆన్ ద లైన్' అని చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు సాగుతోంది. సెబాస్టియన్ ద్వారానే చంద్రబాబు మాట్లాడినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలోనే అనేక ఆపరేషన్లలో సెబాస్టియన్ మధ్యవర్తిత్వం వహించడంపై ఏసీబీ అధికారులు వివరాలను సేకరిస్తున్నారు.