సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసు, ఓటుకు కోట్లు కేసు ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. గురువారం ఉదయం నుంచి రేవంత్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రేవంత్ రెడ్డికి సంబంధించని అన్ని పత్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అనుమానం ఉన్న ప్రతి విషయం, పత్రాలపై అందుబాటులో ఉన్నవారి నుంచి ఆరా తీస్తోంది.
రేవంత్ రెడ్డికి సంబంధించిన పాత ఇంటి తాళాలు పగలగొట్టి కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి భార్యను కార్‌లో ఎక్కించుకొని వెళ్లి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. అయితే ప్రచారంలో భాగంగా సొంత నియోజకవర్గానికి వెళ్లిన రేవంత్ రెడ్డిని కుటుంబసభ్యులతో సహా వెంటనే తమ ముందు హాజరుకావాలని ప్రత్యేక అధికారుల నుంచి ఫోన్ వెళ్లినట్టు సమాచారం అందుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరికాసేపట్లో రేవంత్‌రెడ్డి మీడియా ముందుకువచ్చి మాట్లాడే అవకాశముందని తెలుస్తోంది. దీంతో కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్‌రెడ్డి మరికాసేపట్లో విలేకరుల సమావేశం నిర్వహించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
రేవంత్ మరికాసేపట్లో అధికారుల ముందు హాజరుకానున్నారు. (ఐటీ దాడులు: ‘ఓటుకు కోట్లు’కేసు లెక్క తేలేనా?)
రేవంత్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు
‘ఓటుకు కోట్లు’కేసులో ఏ2 నిందితుడు సెబాస్టియన్ ఐటీ అధికారుల సోదాల అనంతరం మీడియాతో మాట్లాడారు. మౌర్య కేసుకు, రేవంత్ రెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఓటుకు కోట్లు కేసులో ముద్దాయిగా ఉన్న కేసులోనే ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేస్తున్నారని వివరించారు. తన సంస్థలకు సంబంధించిన అన్ని పత్రాలు క్లియర్‌గా ఉన్నాయని, ఐటీ రిటర్స్న్ కూడా క్లియర్‌గా ఉన్నాయన్నారు. ఈ రకంగా ప్రభుత్వం దాడులు చేయించడం భావ్యం కాదన్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment