సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు, ఆదాయానికి మించిన ఆస్తులు, డొల్ల కంపెనీల లావాదేవీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అతని సన్నిహితుల నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. సోదాల అనంతరం పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు విచారణకు హాజరవాల్సిందిగా వారికి నోటీసులు జారీచేశారు. ఇప్పటికే రేవంత్‌ను ఐటీ అధికారులు రెండుసార్లు సుదీర్ఘంగా విచారించారు. కాగా, ఈ విచారణ రెండో దశకు చేరుకుంది. ఇప్పుడు మరోసారి రేవంత్‌కు ప్రశ్నలు సంధించనున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన ఐటీ అధికారుల ముందు హాజరుకానున్నట్లు సమాచారం. మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు పద్మనాభరెడ్డి, ఉదయసింహ, శ్రీసాయి మౌర్యా సంస్థ డైరెక్టర్లు, ఆడిటర్లు, కేఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కానున్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment