సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ ఆధికారుల సోదాలు ముగిశాయి. గురువారం ఉదయం గంటలకు మొదలైన సోదాలు శనివారం తెల్లవారుజామున 2:30 గంటల వరకు కొనసాగాయి. దాదాపు 44 గంటల పాటు కొనసాగిన తనిఖీల్లో రేవంత్‌రెడ్డి, అతని భార్య గీతను అధికారులు విచారించారు. కాగా, రేవంత్ ఇంటినుంచి పలు కీలక డాక్యుమెంట్లు ఐటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. (రేవంత్ ఇంట్లో సోదాలు)
సోదాలు ముగిసిన అనంతరం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లపై రేవంత్, గీతలతో సంతకాలు తీసుకున్నారని, మొత్తం మూడు సూట్‌కేసుల్లో డాక్యుమెంట్లను తీసుకెళ్లారనీ సమాచారం. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన ఇంటిపై ఐటీ అధికారుల దాడులు జరిగాయనీ ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డి ఇవాళ ఉదయం మీడియాముందుకు రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment