సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు కేసు’లో ఏ1 నిందితుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ ముగిసింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఐటీ కార్యాలయంలో ప్రారంభమైన విచారణ దాదాపు ఐదు గంటల పాటు కోనసాగింది. రేవంత్‌తో పాటు ఈ కేసులో మరో నిందితుడు ఉదయ్ సింహాలను కలిపి ఐటీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతో పాటు, ఇస్తామని ఆఫర్ ఇచ్చిన నాలుగున్నర కోట్ల రూపాయల గురించి అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం.
అంతేకాకుండా ఈ కేసు గురించి ఏం చెప్పదల్చుకున్నాడో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని రేవంత్‌ను కోరారు. ఆదాయ వ్యయాలు, వ్యాపార లావాదేవీలు, ఆస్తుల డాక్యుమెంట్లు, ఎన్నికల అఫిడవిట్స్‌లు ఐటీ అధికారులు రేవంత్ ముందుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రేవంత్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని కూడా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. (గుట్టు తేలితే బాబుపైనే నజర్!)
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment