VIDEO: ‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో | Cash For Vote Case Latest Video | Revanth Reddy, Sebastian - Sakshi
Sakshi News home page

‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!

Published Thu, Mar 7 2019 9:58 AM | Last Updated on Thu, Mar 7 2019 3:29 PM

Deccan Chronicle Sensational Story On Cash For Vote Scam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఓటుకు కోట్లు కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని ఇంగ్లిష్‌ డెయిలీ డెక్కన్‌ క్రానికల్‌ ప్రచురించిన కథనం సంచలనం రేపుతోంది. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో.. తార్నాకలోని మాల్కం టేలర్‌ అనే వ్యక్తి  ఇంట్లో తీసిన వీడియో బయటికొచ్చింది. 11 నిముషాల నిడివి గల ఈ వీడియోలో టీడీపీ నేత సెబాస్టియన్‌, టీఆర్‌ఎస్‌ నామినేటేడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసేందుకు బేరసారాలు నడిపారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సెబాస్టియన్‌ స్టీఫెన్‌సన్‌తో బేరం మాట్లాడినట్టు ఈ వీడియో ద్వారా తెలిసింది. (సార్‌ ఎవరు?)

అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇవ్వడానికి నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వస్తాడని సెబాస్టియన్‌ చెప్పినట్టు ఈ వీడియోలో స్పష్టమైంది. తొలుత 3.5 కోట్లకే బాబు ఒప్పుకున్నారని, కానీ తన సిఫారసుతో 5 కోట్లకు డీల్‌ ఓకే అయిందని సెబాస్టియన్‌ స్టీఫెన్‌ సన్‌తో చెప్పిన విషయం వెల్లడైంది. మిగతా సొమ్ముకు తనదే బాధ్యత అంటూ సెబాస్టియన్‌ హామీయిచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఓటుకు కోట్లు కేసులో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయం తెలియనుంది. ఇప్పటికే ఈ కేసులో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 సెబాస్టియన్‌, ఉదయసింహ, వేం నరేందర్‌రెడ్డి విచారణ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకమైన చంద్రబాబు– స్టీఫెన్‌సన్‌ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ టేపును ప్రఖ్యాతి గాంచిన చండీగఢ్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కూడా నిర్ధారించింది. అయినా ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. నాలుగేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో తాజాగా బయటపడిన వీడియో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి..! (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?)

సంబధిత వార్తలు : 

దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం

‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం!

ఓటుకు కోట్లు కేసు; సుప్రీం ఆదేశాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement