హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ పట్టుబడిన కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ నేత సెబాస్టియన్ వాహనాన్ని ఆయనకు తిరిగి ఇవ్వాలని ప్రత్యేక కోర్టు ఏసీబీని ఆదేశించింది. అయితే ఇందుకు సెబాస్టియన్ రూ. 2 లక్షలు పూచీకత్తు సమర్పించాలని కోర్టు షరతు విధించింది. అదే విధంగా అరెస్టు సమయంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న.. కేసుతో సంబంధం లేని ఇతర డాక్యుమెంట్లను కూడా తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. మరో నిందితుడు ఉదయసింహ నుంచి స్వాధీనం చేసుకున్న కారు అతడిది కాకపోవడంతో కారు యజమానిని హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది.