CashForNote
-
సండ్రకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితుడుగా ఉన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన బెయిల్ షరతులు సడలించాలని సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైకోర్టు సండ్రకు బెయిల్ షరతులు సడలించింది. హైదరాబాద్ వచ్చేందుకు అనుమతులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు హైదరాబాద్ మినహా ఎక్కడికైనా వెళ్లవచ్చని హైకోర్టు తెలిపింది. -
హైకోర్టును ఆశ్రయించిన రాజీవ్ త్రివేది
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హోంశాఖ సెక్రటరీ రాజీవ్ త్రివేది హైకోర్టును ఆశ్రయించారు. విజయవాడ కోర్టు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తదుపరి చర్యలను నిలిపివేయాలని ఆ పిటిషన్లో కోరారు. ఆ కేసుపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. -
'సెబాస్టియన్ వాహనాన్ని తిరిగిచ్చేయండి'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ పట్టుబడిన కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ నేత సెబాస్టియన్ వాహనాన్ని ఆయనకు తిరిగి ఇవ్వాలని ప్రత్యేక కోర్టు ఏసీబీని ఆదేశించింది. అయితే ఇందుకు సెబాస్టియన్ రూ. 2 లక్షలు పూచీకత్తు సమర్పించాలని కోర్టు షరతు విధించింది. అదే విధంగా అరెస్టు సమయంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న.. కేసుతో సంబంధం లేని ఇతర డాక్యుమెంట్లను కూడా తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. మరో నిందితుడు ఉదయసింహ నుంచి స్వాధీనం చేసుకున్న కారు అతడిది కాకపోవడంతో కారు యజమానిని హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది.