హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితుడుగా ఉన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తన బెయిల్ షరతులు సడలించాలని సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైకోర్టు సండ్రకు బెయిల్ షరతులు సడలించింది. హైదరాబాద్ వచ్చేందుకు అనుమతులు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు హైదరాబాద్ మినహా ఎక్కడికైనా వెళ్లవచ్చని హైకోర్టు తెలిపింది.