సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోట్లు కేసు విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగా సోమవారం ఏసీబీ కోర్టులో సెబాస్టియన్, ఉదయసింహ , స్టీఫెన్ డ్రైవర్ శంకర్, రేవంత్ సోదరుడు కృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. వారి వాంగ్మూలాలను నమోదు ఏసీబీ న్యాయస్థానం నమోదు చేసుకుంది. ఈ కేసుపై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment