Vote note case
-
సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు పిటిషన్ల విచారణ
-
తెలంగాణ పాలపిట్ట కేసీఆర్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డీఎన్ఏ ఏంటో రాహుల్‌గాంధీ తెలుసుకోవాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రాహుల్, రేవంత్ డీఎన్ఏలు మ్యాచ్ కావడం లేదన్నారు. బీజేపీపై పోరాడే డీఎన్ఏ తనదని చెప్పుకున్న రాహుల్.. రేవంత్ డీఎన్ఏ తెలుసుకోవాలని చెప్పారు. గతంలో సోనియాగాంధీని బలిదేవత.. ఇటలీబొమ్మ అంటూ నోరు పారేసుకుని.. ఇప్పుడు సోనియాను దేవత అంటున్న రేవంత్ నోటికి మొక్కాలన్నారు. హరీశ్‌రావు మంగళవారం సంగారెడ్డి, నారాయణఖేడ్లలో పర్యటించారు. 30న నారాయణఖేడ్‌లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో హరీశ్‌రావు మాట్లాడారు. టీడీపీలో ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ సరిగ్గా ఇవ్వలేదని అసెంబ్లీలో వ్యాఖ్యానించిన రేవంత్‌రెడ్డి.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని మండిపడ్డారు. కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎవ్వరికీ బీ టీమ్ కాదన్న హరీశ్.. తాము తెలంగాణ ప్రజల టీమ్ అని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కాదంటూ.. నీళ్లు, నూనె కలుస్తాయా అని ప్రశ్నించారు. కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేసే వారన్నారు. కాంగ్రెస్ నేతలపై నాడు ఓటుకు నోటు కేసు ఉండగా.. నేడు నోటుకు సీటు అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హరీశ్ విమర్శించారు. కిషన్‌రెడ్డి వెన్నుచూపి పారిపోయారు పాలపిట్టను శుభప్రదంగా భావిస్తామని, తెలంగాణ పాలపిట్ట కేసీఆర్ రాష్ట్రానికి హ్యాట్రిక్ సీఎంగా ఉండటం కూడా అంతే శుభమని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్య మకారులను తుపాకీతో బెదిరించిన రేవంత్‌రెడ్డి వంటి ద్రోహులు ఒకవైపు., రాష్ట్రం కోసం పద వులను త్యాగం చేసి, ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైన కేసీఆర్ మరోవైపు ఉన్నార న్నారు. తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేయా లని డిమాండ్ వస్తే వెన్ను చూపి పారిపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏం మంచి చేస్తారని ప్రశ్నించారు. -
ఓటుకు నోటు కేసు: వాంగ్మూలాలు నమోదు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోట్లు కేసు విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగా సోమవారం ఏసీబీ కోర్టులో సెబాస్టియన్, ఉదయసింహ , స్టీఫెన్ డ్రైవర్ శంకర్, రేవంత్ సోదరుడు కృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. వారి వాంగ్మూలాలను నమోదు ఏసీబీ న్యాయస్థానం నమోదు చేసుకుంది. ఈ కేసుపై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
ఓటుకు నోటు కేసును నీరుగార్చొద్దు
సాక్షి, విజయవాడ : ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి కె ఆంజనేయ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటుకు ఓటు కేసులో సీఎం చంద్రబాబు స్వర నమూనాకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును తెలుగు ప్రజలకు వెల్లడించాలన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ దేశం మొత్తం తిరుగుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నాయకుడు అశోక్‌బాబు ధోరణి విపరీత స్థాయికి చేరిందని ఆంజనేయ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ విధులను విస్మరించి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేకాక అశోక్‌బాబు కర్ణాటకకు వెళ్లి ప్రచారం చేయడం వెనక సీఎం చంద్రబాబు నాయుడి ప్రోత్సహం ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అతనిపై చర్యలు తీసుకుని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మీద ఏపీ ప్రభుత్వం కొత్త డ్రామాను మొదలుపెట్టిందని, చంద్రబాబు దొంగ ఏడుపులను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తెలుగు డ్రామా పార్టీగా టీడీపీ మారిందని ఆంజనేయ రెడ్డి ఎద్దేవా చేశారు. -
ఓటుకు నోటు.. రాష్ట్రానికి పోటు!
బద్వేలు అర్బన్ : ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేంద్రం పై ఒత్తిడి తీసుకురాకుండా... ప్యాకేజీలో వచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి చంద్రబాబు ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన హోదాను తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ దీక్షలకు సంఘీభావంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో మున్సిపాలిటీలోని 11,12,14,15 వార్డుల నాయకులు పాల్గొన్నారు. వీరికి మద్దతుగా అంబేద్కర్ విగ్రహం ఎదుట జాతీయ రహదారుల దిగ్బందం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం హోదా కోసం పోరాడుతున్న వారిపై కేసులు బనాయించి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ చిత్తా రవిప్రకాష్‌రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి సింగమాల వెంకటేశ్వర్లు, బి.కోడూరు జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు నాగార్జునరెడ్డి, భూపాల్‌రెడ్డి, బద్వేలు మండల అధ్యక్షులు బోడపాడు రామసుబ్బారెడ్డి, బ్రాహ్మణపల్లె సింగిల్‌విండో అధ్యక్షలు సుందర్రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శులు పుత్తా శ్రీరాములు, కరీముల్లా, రమణయ్య, 6వ వార్డు కౌన్సిలర్ గోపాలస్వామి, సర్పంచ్‌లు జయసుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, నరసింహారెడ్డి, మున్సిపాలిటీ, రూరల్ నాయకులు గోపాల్‌రెడ్డి, ఈవై.యద్దారెడ్డి, వి.రాజగోపాల్‌రెడ్డి, సాంబశివారెడ్డి, కుప్పాల శ్రీరాములు, గాజులపల్లె కేశవరెడ్డి, యోగానందరెడ్డి, పి.శ్రీనివాసులరెడ్డి,బి. కుమార్, గంగిరెడ్డి, చెన్నయ్య, అక్బర్, మునీర్, సుబ్బయ్య, రెడ్డయ్య, హరి, మర్రెయ్య, కృష్ణయ్య, గోపాల్, సుధాకర్, జనార్ధన్, చరణ్, పెంచలయ్య, దేవరాజ్, రత్నమయ్య, ఇరగయ్య, వెంకటసుబ్బయ్య, చెన్నకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, బాలాజీ శ్రీను, వెంకటరత్నం, బిజ్జం రమణ, జయరామ్‌యాదవ్, భీమారెడ్డి, చిన్నసుబ్బారెడ్డి, ప్రసాద్‌నాయుడు, రోశిరెడ్డి, రఘురామిరెడ్డి, హసాన్, గోపవరం మండల నాయకులు మల్లికార్జునరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, హరికృష్ణారెడ్డి, సిద్ధు వెంకట సుబ్బారెడ్డి, పెంచలయ్య, నరసింహులు, ఎస్సీసెల్ నాయకులు పుల్లయ్య, ఓబులేసు, తిరుపాల్ పాల్గొన్నారు. -
ఏసీబీ కోర్టుకు ఓటుకు కోట్లు నిందితులు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితులైన ఉదయసిం హ, సెబాస్టియన్ శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజర య్యారు. ఇదే కేసులో నిందితునిగా ఉన్న టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరుకు మినహయింపును కోరుతూ ఆ యన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని అనుమతించింది. తదుపరి విచార ణను జనవరి 5కు వాయిదా వేసింది. -
బాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలి
- ఏడాదిలో బాబు పాలన అవినీతిమయం - ‘ఓటుకు నోటు’లో దొరికిపోయి రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారు - ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి పీలేరు: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం తన పదవికి రాజీనామా చేసి, నిజాయితీ నిరూపించుకోవాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ అడ్డంగా దొరికిపోయిన విష యం దేశ ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ఈ కేసులో నుంచి బయటపడడానికి సీఎం దారులు వెతుక్కుం టున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏడాది చంద్రబాబు పాలన అవినీతిమయంగా మారిందని విమర్శించారు. తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నిజాయితీ ఏ పాటిదో ఆడియో టేపులు చూసిన ప్రతిఒక్కరికీ అర్థమవుతుందన్నారు. తన స్వార్థం కోసం సీఎం తెలుగు రాష్ట్రాల మధ్య విధ్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అవినీతి వ్యవహారంలో సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి దీనివెనుక జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ కుట్ర ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బీడీ.నారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు ఎం.రెడ్డిబాష, జీ.జయరామచంద్రయ్య, రెడ్డిరాజ, మండల ఉపాధ్యక్షుడు కంభం సతీష్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎస్.హబీబ్‌బాష, నేతలు కడప గిరిధర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఆనంద్, కరుణాకర్‌రెడ్డి, ఎస్.గౌస్‌బాష, షాకీర్, ఉదయ్, రమేష్‌కుమార్‌రెడ్డి, పెద్దోడు, కుమార్ పాల్గొన్నారు. -
రేవంత్‌ను ప్రశ్నించిన ఏసీబీ
* ఓటుకు నోటు కేసులో కస్టడీలోకి తీసుకున్న అధికారులు * మిగతా ఇద్దరు నిందితులనూ విడివిడిగా విచారణ * వ్యక్తిగత, రాజకీయ, ఆర్థిక నేపథ్యాలపై ఆరా * ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ప్రశ్నల పరంపర * రేవంత్‌కు మాత్రం మధ్యాహ్నం 3 నుంచి ప్రశ్నలు * కీలక సమాచారం రాబట్టేందుకు తొలిరోజు రిహార్సల్స్! సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను డబ్బుతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిన కేసులో పట్టుబడిన టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాలపై ఏసీబీ శనివారం ప్రశ్నల వర్షం కురిపించింది. వారి వ్యక్తిగత సమాచారంతో పాటు కేసులో వారి పాత్రను బయటపెట్టేందుకు ప్రయత్నించింది. కోర్టు అనుమతితో నిందితులను 4 రోజుల కస్టడీకి తీసుకున్న ఏసీబీ తొలిరోజు విచారణలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వారి నుంచి వాస్తవాలు రాబట్టేందుకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇప్పటికే తయారుచేసుకున్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకే తొలిరోజు దర్యాప్తు అధికారులు ప్రాధాన్యమిచ్చినట్లు సమాచారం. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతూ నిందితులను అయోమయానికి గురిచేసేలా వ్యవహరించినట్లు తెలిసింది. విచారణ సమయంలో నిందితుల తరఫు న్యాయవాదులు అక్కడే ఉండే ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ అశోక్‌కుమార్, మరో ఇద్దరు సీఐల సమక్షంలో రేవంత్ విచారణ సాగగా, మిగతా ఇద్దరిని కూడా విడివిడిగా ముగ్గురేసి అధికారులు ప్రశ్నించారు. రేవంత్ విచారణ రెండు గంటలే! ఉదయం 9.15 గంటలకు చర్లపల్లి జైలుకు వెళ్లిన దర్యాప్తు అధికారులు నాటకీయ పరిణామాల నడుమ మీడియా కళ్లు కప్పి తొలుత సెబాస్టియన్, ఉదయ్ సింహలను మాత్రమే ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఇద్దరు నిందితులను విడివిడిగా ప్రశ్నించారు. కాగా, వైద్య పరీక్షల కోసమని మధ్యాహ్నం 1.30 గంటల వరకు రేవంత్‌ను జైలులోనే ఉంచారు. తర్వాత ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి మధ్యాహ్న భోజనాల అనంతరం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రేవంత్‌ను విచారించినట్లు సమాచారం. కాగా, ఏసీబీ అధికారులు ‘మైండ్ గేమ్’కు దిగినట్లు నిందితుల తరఫు లాయర్ల మాటలను బట్టి అర్థమవుతోంది. రేవంత్‌ను వ్యక్తిగత విషయాలు, రాజకీయ జీవితంలో ఆటుపోట్లు, వ్యాపారాలు, రాజకీయ ప్రస్థానం.. కాంగ్రెస్ సీనియర్లు జైపాల్‌రెడ్డి, జానారెడ్డితో ఉన్న బంధుత్వం, ప్రేమ వివాహం, తదనంతర పరిణామాలు, ‘బాస్’ చంద్రబాబుతో ఉన్న సంబంధాలు తదితర అంశాలపై ఏసీబీ ప్రశ్నించినట్టు సమాచారం. వీడియో ఫుటేజీల్లో ఆయన మాటలను మరోసారి అధికారికంగా నిర్ధారించుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేకు రూ. 50 లక్షలు ఇవ్వజూపడాన్ని కూడా రేవంత్ ముందు అధికారులు ప్రస్తావించారు. సెబాస్టియన్, ఉదయ్‌లపై దృష్టి ఈ కేసులో ఏ2, ఏ3గా ఉన్న సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహను ముగ్గురేసి అధికారులు విచారించారు. ఒక్కొక్కరిని కనీసం 40 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే స్టీఫెన్సన్ బంధువు నివాసానికి ముందుగా రేవంత్, సెబాస్టియన్ వెళ్లగా... తర్వాత ఉదయ్ సింహ రూ. 50లక్షలతో కూడిన బ్యాగును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతపెద్ద మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఉదయ్‌ని పలు కోణాల్లో ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే ఈ వ్యవహారంలో రేవంత్, చంద్రబాబుల పాత్రపై సెబాస్టియన్‌ను అడిగినట్లు సమాచారం. కాగా, విచారణ అనంతరం నిందితులను చర్లపల్లి జైలుకు తరలించే విషయంలో న్యాయపరమైన చిక్కులు ఏర్పడటంతో వారిని బషీర్‌బాగ్‌లోని సిట్ కార్యాలయానికి తరలించారు. రాత్రి బస అక్కడే. ఆదివారం ఉదయం 9 గంటలకు నిందితులను మళ్లీ ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించనున్నారు.