బద్వేలు అర్బన్ : ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కేంద్రం పై ఒత్తిడి తీసుకురాకుండా... ప్యాకేజీలో వచ్చే కమీషన్‌లకు కక్కుర్తి పడి చంద్రబాబు ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన హోదాను తాకట్టు పెట్టారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ దీక్షలకు సంఘీభావంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో మున్సిపాలిటీలోని 11,12,14,15 వార్డుల నాయకులు పాల్గొన్నారు. వీరికి మద్దతుగా అంబేద్కర్ విగ్రహం ఎదుట జాతీయ రహదారుల దిగ్బందం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం హోదా కోసం పోరాడుతున్న వారిపై కేసులు బనాయించి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ చిత్తా రవిప్రకాష్‌రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి సింగమాల వెంకటేశ్వర్లు, బి.కోడూరు జెడ్పీటీసీ రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు నాగార్జునరెడ్డి, భూపాల్‌రెడ్డి, బద్వేలు మండల అధ్యక్షులు బోడపాడు రామసుబ్బారెడ్డి, బ్రాహ్మణపల్లె సింగిల్‌విండో అధ్యక్షలు సుందర్‌రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శులు పుత్తా శ్రీరాములు, కరీముల్లా, రమణయ్య, 6వ వార్డు కౌన్సిలర్ గోపాలస్వామి, సర్పంచ్‌లు జయసుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, నరసింహారెడ్డి, మున్సిపాలిటీ, రూరల్ నాయకులు గోపాల్‌రెడ్డి, ఈవై.యద్దారెడ్డి, వి.రాజగోపాల్‌రెడ్డి, సాంబశివారెడ్డి, కుప్పాల శ్రీరాములు, గాజులపల్లె కేశవరెడ్డి, యోగానందరెడ్డి, పి.శ్రీనివాసులరెడ్డి,బి. కుమార్, గంగిరెడ్డి, చెన్నయ్య, అక్బర్, మునీర్, సుబ్బయ్య, రెడ్డయ్య, హరి, మర్రెయ్య, కృష్ణయ్య, గోపాల్, సుధాకర్, జనార్ధన్, చరణ్, పెంచలయ్య, దేవరాజ్, రత్నమయ్య, ఇరగయ్య, వెంకటసుబ్బయ్య, చెన్నకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, బాలాజీ శ్రీను, వెంకటరత్నం, బిజ్జం రమణ, జయరామ్‌యాదవ్, భీమారెడ్డి, చిన్నసుబ్బారెడ్డి, ప్రసాద్‌నాయుడు, రోశిరెడ్డి, రఘురామిరెడ్డి, హసాన్, గోపవరం మండల నాయకులు మల్లికార్జునరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, హరికృష్ణారెడ్డి, సిద్ధు వెంకట సుబ్బారెడ్డి, పెంచలయ్య, నరసింహులు, ఎస్సీసెల్ నాయకులు పుల్లయ్య, ఓబులేసు, తిరుపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment