విలేకరులతో మాట్లాడుతున్న ఆంజనేయ రెడ్డి
సాక్షి, విజయవాడ : ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి కె ఆంజనేయ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటుకు ఓటు కేసులో సీఎం చంద్రబాబు స్వర నమూనాకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును తెలుగు ప్రజలకు వెల్లడించాలన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ దేశం మొత్తం తిరుగుతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నాయకుడు అశోక్‌బాబు ధోరణి విపరీత స్థాయికి చేరిందని ఆంజనేయ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ విధులను విస్మరించి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేకాక అశోక్‌బాబు కర్ణాటకకు వెళ్లి ప్రచారం చేయడం వెనక సీఎం చంద్రబాబు నాయుడి ప్రోత్సహం ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అతనిపై చర్యలు తీసుకుని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం మీద ఏపీ ప్రభుత్వం కొత్త డ్రామాను మొదలుపెట్టిందని, చంద్రబాబు దొంగ ఏడుపులను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తెలుగు డ్రామా పార్టీగా టీడీపీ మారిందని ఆంజనేయ రెడ్డి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment