Anjaneya reddy
-
ఓటీపీలతో రూ.6.90 లక్షలకు కుచ్చుటోపీ
పెద్దదోర్నాల: ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం మీ అకౌంట్లోకి జమ చేస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్లోని నగదు మొత్తాన్ని కాజేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఐనముక్కలలో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘరానా మోసంలో గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు నగదు పోగొట్టుకున్నారు. ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన గ్రామానికి చెందిన చిట్యాల ఆంజనేయరెడ్డి అనే యువకుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం ఒక్కసారే అకౌంట్లో పడుతుందని, ఫోన్ పే ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మాట్లాడాలని సూచించాడు. తొలుత అకౌంట్ నుంచి కొంత మొత్తం కట్ అయి తిరిగి పడుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. తనది ఆండ్రాయిడ్ ఫోన్ కాకపోవడంతో ఆ యువకుడు గ్రామానికి చెందిన లింగాల శ్రీను నంబర్ నుంచి గుర్తు తెలియని నంబర్‌కు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడు. అయితే.. శ్రీను అకౌంట్లో అమౌంట్ తక్కువగా ఉందని చెప్పడంతో శ్రీను తమ్ముడు లింగాల రమేష్ నంబర్ నుంచి ఫోన్‌చేసి కాన్ఫరెన్స్ కాల్ కలిపి ముగ్గురూ సైబర్ నేరగాళ్లతో మాట్లాడారు. అతని మాటలు నమ్మిన రమేష్ తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్లతో పాటు ఫోన్‌పేకు సంబంధించిన పాస్‌వర్డ్‌ను చెప్పటంతో లింగాల రమేష్ అకౌంట్లోని రూ.6.90 లక్షల నగదు మాయమైంది. అయితే.. మాయమైన డబ్బు నుంచి రూ.79 వేల నగదు తిరిగి బాధితుడి అకౌంట్‌కు జమ అయినట్లు ఎస్సై తెలిపారు. తమకు వచ్చిన ఫోన్ నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది స్విచ్చాఫ్ వస్తుండటంతో తాము మోసపోయినట్టు సోదరులు గ్రహించారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్‌తో పాటు స్థానిక బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి ఫోన్లు వచ్చాయని, ఏ రాష్ట్రానికి ఫోన్ చేయాలనుకుంటే అదే భాషలతో మాట్లాడే వాళ్లతో ఫోను చేయిస్తారని, డబ్బులు వస్తాయని నమ్మకంగా ఆశ చూపి అకౌంట్లలోని డబ్బులు మాయం చేస్తారని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
అమరావతిని చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారు
రాజధాని విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తప్పని ఏపీ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి చెప్పారు. ఉన్నత విద్యావంతులు, ఉన్నత పదవుల్లో ఉన్న తాము సిటిజన్స్ ఫోరంగా ఏర్పడి ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడినా పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర విభజన పరిణామాలు, పలు ఇతర అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాజధాని ఏర్పాటుపై అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకోవాలని కూడా చంద్రబాబుకు సూచించామన్నారు. రాజధానికి దొనకొండ అన్ని విధాలా తగిన ప్రాంతమని, అందుకు 10 సానుకూల అంశాలను ఆయన ముందుంచామని తెలిపారు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం తప్పని ఏపీ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి చెప్పారు. ఉన్నత విద్యావంతులు, ఉన్నత పదవుల్లో ఉన్న తాము సిటిజన్స్ ఫోరంగా ఏర్పడి ఈ విషయంపై చంద్రబాబుతో మాట్లాడినా పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్ర విభజన పరిణామాలు, పలు ఇతర అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘రాజధాని ఏర్పాటుపై అన్ని పార్టీలు, అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకోవాలని కూడా చంద్రబాబుకు సూచించాం. రాజధానికి దొనకొండ అన్ని విధాలా తగిన ప్రాంతమని చెప్పాం. అందుకు 10 సానుకూల అంశాలను ఆయన ముందుంచాం. వెనుకబడ్డ ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములు లక్ష ఎకరాలకు పైగా ఉన్నాయి. నిర్మాణ వ్యయం కూడా తక్కువ. రాజధాని ఏర్పాటుతో ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి లభించేది. పైగా సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య కూడా ఉండదు. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా చంద్రబాబు మాత్రం నిర్మాణాలకు ఏ విధంగానూ అనువుగా లేని అమరావతినే ఎంచుకున్నారు. ఎలాంటి ఆలోచనా లేకుండా అప్పటికప్పుడు అమరావతి పేరు ప్రకటించారు. నిత్యం పంటలతో నందనవనంలా కళకళలాడే కృష్ణా డెల్టాలో కాంక్రీట్ పోసి నాశనం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా అమరావతి ప్రాంతం తప్ప మరెక్కడైనా రాజధాని నిర్మించాలని సూచించినా చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదు’ అని వివరించారు. వికేంద్రీకరణ చాలా అవసరం పరిపాలన వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ప్రాంతీయ అసమానతలు తొలగించవచ్చని తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే విజయవాడ, విశాఖలో బెంచ్‌లు పెట్టాలని అన్నారు. పరిపాలన కోసం నాలుగు జోన్లలోనూ డివిజనల్ కార్యాలయాలు పెట్టి, సచివాలయ అధికారాలు వాటికి బదిలీ చేయాలని, అప్పుడు ప్రజలకు వేగంగా సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. ఇటీవల రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు బాగుందని, కోస్తా, కృష్ణా డెల్టా ప్రాంతాలు లాభపడుతున్నాయని అన్నారు. నెల్లూరు – తిరుపతి మధ్య కూడా పరిశ్రమలు వచ్చాయని, కర్నూలు ప్రాంతం మాత్రం వెనుకబడి పోయిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల అక్కడ సర్ప్లస్ ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచేవారన్నారు. విడిపోయాక రాష్ట్ర ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని, ఈ పరిస్థితి మరోసారి రాకూడదంటే అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టిందని, ఇది కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు ఎంతో మేలు చేసిందని అన్నారు. తర్వాత అభివృద్ధిపై దృష్టి పెడుతుందని ఆంజనేయరెడ్డి చెప్పారు. పోలవరంపైనా బాబు తప్పుడు నిర్ణయం కేంద్ర పరిధిలోని పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకోవడమే పెద్ద పొరపాటుగా ఆంజనేయరెడ్డి తెలిపారు. ఆయన తప్పిదం వల్ల ఇప్పుడు ఎస్కలేషన్ ఖర్చే దాదాపు రూ.60 వేల కోట్లకు పెరిగిపోయిందన్నారు. లేదంటే కేంద్రమే ప్రాజెక్టును పూర్తిచేసి ఇచ్చేదని చెప్పారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సమయంలోనే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలన్న డిమాండ్ వచ్చిందని తెలిపారు. ఆనాడు కర్నూలును రాజధానిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ విడిపోయాక కూడా సీమకే అన్యాయం జరిగిందన్నారు. ఆనాడు కర్నూలును అభివృద్ధి చేసి ఉంటే సీమ బాగుపడేదని, అమరావతి వల్ల ఎక్కువగా నష్టపోయింది రాయలసీమేనని అన్నారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మైనింగ్, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు స్థాపించాలని సూచించారు. కేవలం ఐటీ పరిశ్రమ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందదని, ప్రాంతాన్ని బట్టి అనువైన పరిశ్రమలు రావాలని చెప్పారు. -
ఏపీ మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి తో " స్ట్రెయిట్ టాక్ "
-
అశోక్ బాబును ఉద్యోగం నుండి తొలగించాలి
-
ఓటుకు నోటు కేసును నీరుగార్చొద్దు
సాక్షి, విజయవాడ : ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి కె ఆంజనేయ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటుకు ఓటు కేసులో సీఎం చంద్రబాబు స్వర నమూనాకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును తెలుగు ప్రజలకు వెల్లడించాలన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ దేశం మొత్తం తిరుగుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నాయకుడు అశోక్‌బాబు ధోరణి విపరీత స్థాయికి చేరిందని ఆంజనేయ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ విధులను విస్మరించి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేకాక అశోక్‌బాబు కర్ణాటకకు వెళ్లి ప్రచారం చేయడం వెనక సీఎం చంద్రబాబు నాయుడి ప్రోత్సహం ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అతనిపై చర్యలు తీసుకుని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మీద ఏపీ ప్రభుత్వం కొత్త డ్రామాను మొదలుపెట్టిందని, చంద్రబాబు దొంగ ఏడుపులను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తెలుగు డ్రామా పార్టీగా టీడీపీ మారిందని ఆంజనేయ రెడ్డి ఎద్దేవా చేశారు. -
'ద్రోహానికి చిరునామా చంద్రబాబే'
-
'బాబు సర్కార్ పిచ్చి తుగ్లక్‌లా వ్యవహరిస్తోంది'
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులను హైదరాబాద్ నుంచి అమరావతికి తరలింపు విషయంలో రాష్ట్రంలో తుగ్లక్ పాలన గుర్తుకు తెస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి అన్నారు. నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగుల తరలింపుపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్‌లోనే పదేళ్లుండే అవకాశం ఉన్నా ఇప్పటికిప్పుడు ఉద్యోగులను తరలించాల్సిన అవసరం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల తరలింపుపై ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మధ్య సమన్వయలోపం ఉందా అని అనుమానం కలుగుతుందన్నారు. ఉద్యోగుల తరలింపు విషయంపై ఒక రోడ్‌మ్యాప్‌ను తక్షణమే తయారు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఉద్యోగ సంఘాల మధ్య సమన్వయం లేకుండా గందరగోళాన్ని సృష్టిస్తున్నారన్నారు. ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించుకోవడానికి మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి రాని ఉద్యోగులను ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని టీడీపీ ఎమ్మెల్సీ బాబురాజేంద్రప్రసాద్ ప్రకటన చేయడం సమంజసం కాదన్నారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో రాష్ట్రానికి చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 5వేల మంది ఉన్నారని వారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా ఉందన్నారు. అమరావతి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు ఏర్పాటును కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడగాలని సూచించారు. ఈ విషయమై తాము కూడా కేంద్రం దష్టికి తీసుకెళ్తామన్నారు. ఈనెల 16వ తేదీ కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌పారికర్ నెల్లూరులో పర్యటించి కేంద్రప్రభుత్వ పథకాలు, విజయాలను వివరించనున్నారని తెలిపారు. అలాగే, 17వ తేదీన రాష్ట్రంలోని అన్ని మండలాల బీజేపీ పదాధికారులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విశాఖలో సమావేశం నిర్వహించనున్నారని చెప్పారు. -
'ఆ పని చేయ్...ఈ పని చేయ్ అని చెప్పలేరు'
హైదరాబాద్ : చట్టాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెపుతున్న మాటలు సరైనవి కాదని ఐపీఎస్ మాజీ అధికారి ఆంజనేయ రెడ్డి అన్నారు. సాక్షిటీవీ 'ఫోర్త్ ఎస్టేట్' కార్యక్రమంలో ఆయన గురువారం మాట్లాడుతూ ఇప్పుడు నడుస్తున్న (ఓటుకు కోట్లు) ఏసీబీ కేసుకు, సెక్షన్-8కు సంబంధం లేదన్నారు. ఏసీబీ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఏపీ మంత్రులు సెక్షన్-8ను ప్రస్తావిస్తున్నారని అనుకుంటున్నానని ఆంజనేయ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని అంశాలపై కేసులు మాత్రమే ఎన్నికల సంఘానికి చెప్పాల్సి ఉంటుందని, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేసు రిజిస్టర్ చేయడానికి, దర్యాప్తు చేయడానికి ఎవ్వరి అనుమతి అవసరం లేదని చెప్పారు. ఈ పని చేయ్, ఆ పని చేయ్ అని ముఖ్యమంత్రి...డీజీపీకి చెప్పలేరని ఆంజనేయ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసు దర్యాప్తులో గవర్నర్ కానీ, సీఎంకానీ, ఎన్నికల సంఘం కానీ జోక్యం చేసుకోలేదన్నారు. సీఆర్పీసీ ప్రకారం కేసు ఎక్కడైనా రిజిస్ట్రర్ కావొచ్చని... కాని దర్యాప్తు చేసే అధికారం నేరం జరిగే పరిధిలోని పోలీసులదే అన్నారు. విశాఖ, రాజమండ్రిల్లో కేసులు రిజిస్ట్రర్ చేసుకున్నా..వాళ్లొచ్చి దర్యాప్తు చేయలేరని ఆంజనేయరెడ్డి అన్నారు. క్రిమినల్ కేసుల్లో నేరం ఎక్కడ జరిగిందనేది చాలా ముఖ్యమైన అంశమని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సత్యప్రసాద్ అన్నారు. నేరం జరిగే ప్రదేశం బట్టి..న్యాయపరిధి ఎక్కడుందనేది నిర్ణయం అవుతుందన్నారు. వేరేచోట కేసులు పెడితే చెల్లదని, ఘటనలు హైదరాబాద్‌లో జరిగితే... కేసీఆర్ మీద ఎక్కడెక్కడో కేసులు పెడితే..అది కరెక్ట్ కాదన్నారు. ఏసీబీకి అధికారం లేదంటూ ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. దర్యాప్తు జరక్కుండా ఎన్నికల సంఘం కూడా అడ్డుకోలేదన్నారు. ఇరత రాష్ట్రాల్లో కేసులు ఒక వ్యక్తిని బెదిరించడం కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే అని, అది మైండ్ గేమ్ మాత్రమే అని అన్నారు. నోటీసు తీసుకోకపోతే సంబంధింత వ్యక్తిని కస్టడీలోకి తీసుకునే అధికారం కూడా ఉందని హైకోర్టు న్యాయవాది కైలాశ్‌నాథ్ రెడ్డి అన్నారు. నోటీసు ఇచ్చాక దర్యాప్తునకు సహకరిస్తే..అరెస్ట్ చేసే అవసరం కూడా లేదన్నారు. కానీ, నోటీసును ఉల్లంఘిస్తే మాత్రం కస్టడీలోకి తీసుకునే అధికారం కూడా ఉందన్నారు. -
సాగర్‌లో అమెరికా బౌద్ధ అధ్యయన కేంద్రం
నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో అమెరికా బౌద్ధ అధ్యయన కేంద్ర నిర్మాణ పనులకు సోమవారం పర్యాటక చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ భూమిపూజ చేశారు. అనంతరం ప్రజ్ఞోపాయ బుద్ధిస్ట్ చారిటబుల్కు చెందిన టెంజన్ ప్రియదర్శిని, రాష్ట్రపర్యాటక సంస్థ గౌరవ సలహాదారులు చెన్నూరి ఆంజనేయరెడ్డిలతో కలిసి బుద్ధుడి విగ్రహానికి బౌద్ధమత సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ బుద్ధవనంలో మెరుగైన ధ్యాన విశ్వవిద్యాలయానికి ఏర్పాటు చేసేందుకు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించామని తెలిపారు. నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తవుతాయని చెప్పారు. -
'సమైక్య ప్రకటన చేయాల్సిందే'
హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలంటూ రాజకీయ పార్టీలన్నీ తక్షణం స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే. ఇరు ప్రాంతాలకూ న్యాయం అనే కపట వైఖరిని విడనాడి, మారువేషాలు తొలగించుకుని.. ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులు సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామనే ప్రకటన చేయూలి. శాసనసభలో ఆ పార్టీల సభ్యులు తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఈ తరహా వైఖరి తీసుకున్న పార్టీలకే తెలుగు ప్రజల మద్దతు ఉంటుంది..’’ అని తెలుగు ప్రజావేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర సమైక్యత, తెలుగుజాతి అభ్యున్నతి కోరుతూ తెలుగు ప్రజావేదిక చైర్మన్ ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద సామూహిక దీక్ష చేపట్టారు. వేదిక వైస్ చైర్మన్ డాక్టర్ పుచ్చలపల్లి మిత్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంత వైఖరిని అవలంబిస్తూ అవకాశవాద రాజకీయాలను చేస్తున్న పార్టీలను అంతం చేయాలని, అలాంటి పార్టీల నేతలను శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న తెలుగు జాతి ద్రోహుల అవకాశవాద రాజకీయాలను ఓడించాలన్నారు. ఇప్పటివరకు ఒకటిగా ఉన్న తెలుగు వారిని విభజిస్తే ఇరు ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. రాష్ట్ర విభజన అనివార్యమన్న లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ విభజన ఎందుకు అవసరమో చెప్పాలన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక, బెంగాల్ వంటి రాష్ట్రాలను విభజించడానికి సాహసించని నేతలు మన రాష్ట్రాన్నే ఎందుకు విభజించాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో ఎన్ని డివిజన్లు గెలుచుకుంటారో చెప్పాలని కేసీఆర్‌ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదన్నారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించి ఓడించాలని ఈ సందర్భంగా వేదిక తీర్మానం చేసింది. ఈ దీక్షలో తెలుగు ప్రజా వేదిక కన్వీనర్ డాక్టర్ జి. గంగాధర్, వివిధ జేఏసీల నాయకులు పాల్గొన్నారు. -
తెలంగాణలో 70 శాతం సమైక్యమే: శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణలో 70 శాతం మంది సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని, అయితే, దాడులకు భయపడి వారు తమ గళాన్ని నొక్కిపెట్టుకుంటున్నారని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ మహాసభ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాపార్కు వద్ద గురువారం చేపట్టిన ఒక రోజు దీక్షలో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. టీ ఉద్యమం పేరుతో జరుపుతున్న దాడులకు భయపడి తెలంగాణలోని చాలా మంది సమైక్య వాదులు బయటకు రావడం లేదన్నారు. తెలంగాణ కోరుకోవడమంటే మళ్లీ ఫ్యూడల్ వ్యవస్థకు ప్రాణం పోయడమేనని దుయ్యబట్టారు. ఈ దీక్షలో తెలంగాణకు చెందిన పలువురు సమైక్య వాదులు, తెలుగు ప్రజా వేదిక అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి, నాయకురాలు కాదాసి రాణిలు పాల్గొన్నారు. -
'ఎంపీలు,కేంద్రమంత్రులు తెలుగు ప్రజలను మోసం చేశారు'
సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు తెలుగు ప్రజలను మోసం చేశారని తెలుగు ప్రజా వేదిక ఛైర్మన్ ఆంజనేయరెడ్డి ఆరోపించారు. ప్యాకేజీల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని వారు తాకట్టుపెట్టారన్నారు. ఆంజనేయరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... అసెంబ్లీలో టి. బిల్లుపై చర్చించకుండా... బిల్లుకు వ్యతిరేకంగా సమైక్య తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యరాష్ట్రం కోసం తెలుగు ప్రజా వేదిక ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.