హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణలో 70 శాతం మంది సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని, అయితే, దాడులకు భయపడి వారు తమ గళాన్ని నొక్కిపెట్టుకుంటున్నారని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ మహాసభ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాపార్కు వద్ద గురువారం చేపట్టిన ఒక రోజు దీక్షలో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు.
టీ ఉద్యమం పేరుతో జరుపుతున్న దాడులకు భయపడి తెలంగాణలోని చాలా మంది సమైక్య వాదులు బయటకు రావడం లేదన్నారు. తెలంగాణ కోరుకోవడమంటే మళ్లీ ఫ్యూడల్ వ్యవస్థకు ప్రాణం పోయడమేనని దుయ్యబట్టారు. ఈ దీక్షలో తెలంగాణకు చెందిన పలువురు సమైక్య వాదులు, తెలుగు ప్రజా వేదిక అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి, నాయకురాలు కాదాసి రాణిలు పాల్గొన్నారు.
తెలంగాణలో 70 శాతం సమైక్యమే: శ్రీనివాస్‌రెడ్డి
Published Fri, Jan 17 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement