Visalandhra Mahasabha
-
బాబు మీడియా సలహాదారుగా పరకాల!
* కేబినెట్ హోదాతో త్వరలో ఉత్తర్వులు * విస్మయం వ్యక్తం చేస్తున్న టీడీపీ వర్గాలు * కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త కనుకనే కీలక పదవి ఇచ్చారనే విమర్శలు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి మీడియా సలహాదారుగా విశాలాంధ్ర మహాసభ కన్వీనర్ పరకాల ప్రభాకర్ నియమితులు కానున్నారు. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. కేబినెట్ హోదా కల్పించి ప్రభాకర్‌ను ఈ పదవిలోకి తీసుకోనున్నారని.. ఒకటి రెండు రోజుల్లోనే ఈ మేరకు ఉత్తర్వులు విడుదల కావచ్చని చెప్తున్నారు. ప్రభాకర్ బుధవారం సాయంత్రం చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అకస్మాత్తుగా ఇప్పుడు ఆయనను చంద్రబాబు మీడియా సలహాదారుగా తెరమీదకు తేవడం టీడీపీ నేతలను విస్మయానికి గురిచేసింది. కీలకమైన ఈ బాధ్యతలను ప్రభాకర్‌కు అప్పగించనుండడం పట్ల పార్టీ నేతలు పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మీడియా సలహాదారు అంటే ప్రభుత్వంలో కీలకమైనదిగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి పదవిని పార్టీలో సీనియర్ నేతలకో, అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉండేవారికో కట్టబెడతారని.. కానీ పార్టీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తికి కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించడమేమిటని టీడీపీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీనే నమ్ముకొని అనేక కష్టనష్టాలకోర్చి చిత్తశుద్ధితో పనిచేసిన నేతలను అధినేత విస్మరించడం ఎంతవరకు సబబంటున్నారు. చంద్రబాబు పార్టీ నేతల అంచనాలకు భిన్నంగా పరకాల ప్రభాకర్‌కు పదవిలోకి తీసుకోవడం వెనుక కారణాలేమై ఉంటాయన్న దానిపై పలురకాల విశ్లేషణలు సాగుతున్నాయి. కేవలం ఆయన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ భర్తకావడం, కొందరు ప్రముఖుల సూచనలతోనే ఈ నియామకానికి చంద్రబాబు నిర్ణయించి ఉండవచ్చని భావిస్తున్నారు. నిర్మలాసీతారామన్ కేంద్ర వాణిజ్యశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో.. ఈ శాఖకు సంబంధించి రాష్ట్రానికి పలు వ్యవహారాల్లో ఆమె సహకారం అవసరమని అందువల్లే పరకాలకు ఈ పదవిని ఇచ్చి ఉంటారన్న చర్చ పార్టీలో సాగుతోంది. -
ఈ బిల్లును మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను మొదట రాజ్యసభలో ప్రవేశపెట్ట కూడదని విశాఖలాంధ్ర మహాసభ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ బిల్లును మొదట లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలని తెలిపింది. తెలంగాణ బిల్లు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నందున మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదని ఆ ప్రకటనలో వివరించింది. లోక్‌సభ బిల్లును ఆమోదించిన తర్వాత రాజ్యసభకు పంపాలని తెలిపింది. -
‘గ్రేటర్’ ఎమ్మెల్యేలు విభజనను వ్యతిరేకించాలి
విశాలాంధ్ర మహాసభ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 28 మంది శాసనసభ్యులు విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విశాలాంధ్ర మహాసభ డిమాండ్ చేసింది. ఈ విషయంలో ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయా నియోజకవర్గాల ఓటర్లు తమ అభిప్రాయాన్ని ఎస్ఎంఎస్లు, ఫోన్‌కాల్స్, లేఖల ద్వారా తెలియజేయాలని కోరింది. శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని విశాలాంధ్ర మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభ కార్యదర్శులు చేగొండి రామజోగయ్య, కేతిరి శ్రీనివాస్‌రెడ్డి, శ్యాం, కృష్ణయ్యతో కలిసి విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి మాట్లాడారు. గ్రేటర్ శాసనసభ్యుల చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్స్‌తో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో 80 శాతం మంది ప్రజలు సమైక్యతను కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే శాసన సభ్యులు విభజన బిల్లును వ్యతిరేకించాలని చక్రవర్తి డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాము కూడా ఎమ్మెల్యేలను కలసి వినతి పత్రాలు అందజేస్తామన్నారు. -
తెలంగాణలో 70 శాతం సమైక్యమే: శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణలో 70 శాతం మంది సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని, అయితే, దాడులకు భయపడి వారు తమ గళాన్ని నొక్కిపెట్టుకుంటున్నారని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ మహాసభ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాపార్కు వద్ద గురువారం చేపట్టిన ఒక రోజు దీక్షలో శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. టీ ఉద్యమం పేరుతో జరుపుతున్న దాడులకు భయపడి తెలంగాణలోని చాలా మంది సమైక్య వాదులు బయటకు రావడం లేదన్నారు. తెలంగాణ కోరుకోవడమంటే మళ్లీ ఫ్యూడల్ వ్యవస్థకు ప్రాణం పోయడమేనని దుయ్యబట్టారు. ఈ దీక్షలో తెలంగాణకు చెందిన పలువురు సమైక్య వాదులు, తెలుగు ప్రజా వేదిక అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి, నాయకురాలు కాదాసి రాణిలు పాల్గొన్నారు. -
ఢిల్లీలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన విశాలాంధ్ర
-
ఢిల్లీలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన విశాలాంధ్ర మహాసభ
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు దేశ రాజధానిలో ఉద్యమ బాటతొక్కారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జాతీయ కార్యాలయాన్ని ముట్టించారు. జై సమక్యాంధ్ర అని నినాదాలు చేస్తూ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీజేపీ కార్యాలయం వద్ద భారీగా బలగాలను మోహరించారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇవ్వరాదని విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు డిమాండ్ చేశారు. -
ఢిల్లీలో సమైక్యవాదుల అరెస్ట్
-
ఢిల్లీలో సమైక్యవాదుల అరెస్ట్
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సమైక్యవాదులను ఢిల్లీ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో సమైక్యవాదులు ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించారు. ఎన్నడూ జరగనంత భారీస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్యాలయం లోపలకు చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని నెట్టివేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పో్లీసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు విశాలాంధ్ర మహాసభ సభ్యులకు గాయాలయ్యాయి. కార్యకర్తలు కార్యాలయం లోపలకు చెప్పులు విసిరేశారు. సమైక్యవాదులు 3 గంటలపాటు ధర్నా నిర్వహించారు. తెలుగుతల్లి, వందేమాతరం గేయాలు పాడుతూ నిరసన తెలిపారు. పోలీసులు భారీగా మోహరించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యవాదులు పలువురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్ట్‌లకు నిరసనగా వారు నినాదాలు చేశారు. -
విశాలాంధ్ర మహాసభ ఏఐసిసి కార్యాలయ ముట్టడి
-
విశాలాంధ్ర మహాసభ ఏఐసిసి కార్యాలయ ముట్టడి
న్యూఢిల్లీ: విశాలాంధ్ర మహాసభ సభ్యులు, కార్యకర్తలు ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక్కడ వారు పెద్ద ఎత్తు ఆందోళన చేస్తున్నారు. ఇంత భారీస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు ఎప్పుడూ ఇక్కడ నిర్వహించలేదని చెబుతున్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్యాలయం లోపలకు చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని నెట్టివేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, పో్లీసులకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు కార్యాలయం లోపలకు చెప్పులు విసిరేశారు. పోలీసులు భారీగా మోహరించారు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మా తెలుగుతల్లికి మల్లెపూదండ... పాట పాడుతూ, జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ఇక్కడకు వచ్చి రాష్ట్ర విభజనకు నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రెండో రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం జంతర్ మంతర్ వద్ద సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో వేలాదిమంది సమైక్యవాదులు శనివారం ఢిల్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఏజీపీ, జేడీయూ మద్దతు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని అసోం గణపరిషత్, జేడీయూ పార్టీలు డిమాండ్ చేశాయి. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఈ రెండు పార్టీలు వ్యతిరేకించాయి. -
సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో విశాలాంధ్ర మహాసభ ర్యాలీ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రెండో రోజూ ఢిల్లీలో ఆందోళన చేపడుతున్నారు. ఆదివారం జంతర్ మంతర్ వద్ద సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో వేలాదిమంది సమైక్యవాదులు శనివారం ఢిల్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఏజీపీ, జేడీయూ మద్దతు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని అసోం గణపరిషత్, జేడీయూ పార్టీలు డిమాండ్ చేశాయి. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ఈ రెండు పార్టీలు వ్యతిరేకించాయి. -
ఆగ్రాలో 'విశాలాంధ్ర' నేతలను అడ్డుకున్న పోలీసులు
విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ముట్టడి కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఆ మహాసభ నేతలను శనివారం పోలీసులు ఆగ్రా వద్ద అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, విశాలాంధ్ర మహసభ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. న్యూఢిల్లీ వెళ్లే క్రమంలో విశాలాంధ్ర మహాసభ నేతలు శుక్రవారం మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని ఆర్ఎస్ఎస్ అధినేత భగవతికి విజ్ఞాపన పత్రం అందించేందుకు ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆయన లేకపోవడంతో ఆయన కార్యదర్శికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా న్యూఢిల్లీలో ఈ రోజు ధర్నా నిర్వహించాలని విశాలాంధ్ర మహాసభ నేతలు నిర్ణయించారు. ఆ క్రమంలో వారిని ఆగ్రాలలో అడ్డుకున్నారు. -
విశాలాంధ్ర మహాసభ ప్రెస్మీట్లో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై రెండు విడతలుగా బస్సు యాత్ర నిర్వహించి ప్రజల మనోభావాలను తెలుసుకున్నామని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు బుధవారం సోమాజీగూడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. సీమాంధ్రలోని అన్ని ప్రాంతాల ప్రజలు సమైక్యవాదాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కిరణ్ సర్కార్ అనుమతిస్తే తెలంగాణ ప్రాంతంలో కూడా బస్సు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొందని, దానికి రాజకీయ పార్టీలే కారణమని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ఆరోపించారు. అయితే విశాలాంధ్ర మహాసభ ప్రతినిధుల వ్యాఖ్యలను ఆ సమావేశంలో తెలంగాణ జర్నలిస్టులు వ్యతిరేకించారు. దాంతో ఇరువర్గాల వారు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దాంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన వల్ల రెండు ప్రాంతాలుగా విడిపోతే తెలుగు ప్రజలంతా తీవ్ర అన్యాయానికి గురవుతారని విశాలాంధ్ర మహాసభ మొదటి నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అందులోభాగంగా ఆ మహాసభ ఆధ్వర్యంలో సీమాంధ్రలో బస్సు యాత్ర నిర్వహించి ప్రజల మనోభావాలను తెలుసుకుంది. -
ఆంటోని కమిటీని బహిష్కరించండి: చక్రవర్తి
రాష్ట్ర విభజనపై ఏర్పాటు అయిన కేంద్ర రక్షణ మంత్రి ఆంటోని నేతృత్వంలోని కమిటీని బహిష్కరించాలని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తి సీమాంధ్రవాసులను పిలుపునిచ్చారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. ఈ నెల 16 నుంచి విశాలాంధ్ర మహాసభ సమైక్యత యాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆ యాత్ర ఈ నెల 25న కడపలో ముగుస్తుందన్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి రెండో విడద సమైక్యత యాత్రను కూడా త్వరలో ప్రారంభం అవుతుందని చెప్పారు. అయితే ఈ నెల 18న న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సమైక్యవాదులు ధర్నా నిర్వహిస్తున్నారని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు చక్రవర్తి తెలిపారు. -
'వీర తెలంగాణ మాది, వేరు తెలంగాణ కాదు'
హైదరాబాద్: ముందుముందు రాష్ట్రం మరిన్ని ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉందని విశాలాంధ్ర మహాసభలో ప్రసంగించిన వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్న విశాలాంధ్ర మహాసభలో పలువురు మాట్లాడుతూ వీర తెలంగాణ మాది, వేరు తెలంగాణ కాదన్నారు. వేర్పాటు వాదాన్ని తిప్పి కొడతామని శపధం చేశారు. తెలంగాణ ప్రాంతంలోని ప్రజలందరూ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. సమైక్యరాష్ట్రం కోరుకునే వారి సంఖ్య ఇక్కడ కూడా ఎక్కువగానే వుందని తెలిపారు. తెలంగాణలోని ప్రజలందరూ ప్రత్యేకవాదులు కాదని చెప్పారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకమని, రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు ఏ త్యాగానికైనా తాము సిద్దమని ప్రతిన బూనారు. రాష్ట్ర విభజన ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మూడు ప్రాంతాల్లోని సమైక్య గళం వినిపించే నాయకులు ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్ర విభజనకు ఒప్పుకునేదిలేదని స్పష్టం చేశారు.