విశాలాంధ్ర మహాసభ ప్రెస్మీట్లో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై రెండు విడతలుగా బస్సు యాత్ర నిర్వహించి ప్రజల మనోభావాలను తెలుసుకున్నామని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు బుధవారం సోమాజీగూడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. సీమాంధ్రలోని అన్ని ప్రాంతాల ప్రజలు సమైక్యవాదాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కిరణ్ సర్కార్ అనుమతిస్తే తెలంగాణ ప్రాంతంలో కూడా బస్సు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొందని, దానికి రాజకీయ పార్టీలే కారణమని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ఆరోపించారు. అయితే విశాలాంధ్ర మహాసభ ప్రతినిధుల వ్యాఖ్యలను ఆ సమావేశంలో తెలంగాణ జర్నలిస్టులు వ్యతిరేకించారు. దాంతో ఇరువర్గాల వారు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
దాంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన వల్ల రెండు ప్రాంతాలుగా విడిపోతే తెలుగు ప్రజలంతా తీవ్ర అన్యాయానికి గురవుతారని విశాలాంధ్ర మహాసభ మొదటి నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అందులోభాగంగా ఆ మహాసభ ఆధ్వర్యంలో సీమాంధ్రలో బస్సు యాత్ర నిర్వహించి ప్రజల మనోభావాలను తెలుసుకుంది.