basheerbagh press club
-
ఇంత వేగంగా ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వం లేదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదిన్నరేళ్ల అధికారంలో తెలంగాణలో మార్పు చేసి చూపించామని.. రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న సమస్యలను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపు ఇచ్చారు. అలాగే.. ఏదో వేలంపాట మాదిరిగా హామీలు ఇస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మొద్దని ప్రజల్ని ఆయన కోరారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌తో పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న సమస్యలు ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. అప్పుడు తెలంగాణా ఏ విధంగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది అనేది గమనించాలి. ఈ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఎన్నో మార్పులు చేసి చూపించాం. అనేక మోడల్స్ ఉన్నప్పటికీ.. దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణనే అనుసరిస్తోంది. రాష్ట్ర జీఎస్డీపీ దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 3వ స్థానంలో ఉంది. వ్యాక్సిన్లకు ప్రపంచ రాజధానిగా తెలంగాణ మారిపోయింది. అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజ్‌లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. ఐటీలో హైదరాబాద్ బెంగళూరును మించిపోయింది. 9 ఏళ్ల అభివృద్ధి ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తోంది’’.. అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ..మూడో సారి అధికారం ఇవ్వాలని అడుగుతున్నాం. ఎందుకంటే మేము చేసింది చెప్పి ఓట్లు అడుగుతున్నాం. కానీ ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తారో.. ఏం చేశారో చెప్పకుండా ఓట్లు అడుగుతున్నారు. బీజేపీ తొమ్మిదిన్నరెళ్ళలో తెలంగాణ కు అన్యాయం చేసింది. మతాల పేరిట, ముస్లింలపైన దాడులు జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ తిన్న, గడ్డం పెంచుకున్నా, జై శ్రీరామ్ అనకున్న ఇష్టానుసారంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంది. కాంగ్రెస్ చేసిన పాపాలకు 58 ఏళ్లు తెలంగాణ బాధపడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం చేయడంతోనే వందల మంది యువకుల ప్రాణాలు కోల్పోయారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది’’.. అన్నారు. కాంగ్రెస్‌కు నా ఛాలెంజ్. ఒకే బస్సులో కర్ణాటక వెళ్దాం. అక్కడి రైతులకు కరెంట్ ఇస్తున్నారో లేదో అడుగుదాం అని అన్నారాయన. .. కరోనా తర్వాత దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిందన్న కేటీఆర్.. అత్యంత పేదల దేశంగా భారత్ మారిందన్నారు. అయితే.. ఆర్ధిక వృద్ది రేటులో తెలంగాణ 5స్థానంలో ఉందని గుర్తు చేశారు. ‘‘మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల మీద, కరెంట్ మీద మాత్రమే సీఎం కేసీఆర్ ఖర్చు పెట్టారు. అదే కర్ణాటకలో చూసుకుంటే.. రైతులు కరెంట్ కోసం ధర్నాలు చేస్తున్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు’’ అని కేటీఆర్ తెలిపారు. ‘‘ఉద్యోగాల విషయంలో వృద్ది సాధించాం. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల 20 వేల ఉద్యోగాలకుగానూ.. లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చాం. 2014 నుంచి ఇప్పటిదాకా లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. దేశంలో ఇంతకంటే వేగంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం ఏదీ లేదు’’ అని కేటీఆర్ ప్రకటించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు వేలంపాట మాదిరిగా హామీలు ఇస్తున్నాయని, మేం(బీఆర్ఎస్) మాత్రం చేసిన అభివృద్ధిని చూపించి అధికారం అడుగుతున్నామని మరోమారు కేటీఆర్ అన్నారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలి.. మళ్లీ మాకు అధికారం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామన్నారు కేటీఆర్. -
'బహిరంగ చర్చకు రండి’
హైదరాబాద్: సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్వామి స్వరూపానంద వివాదం రోజురోజుకు ముదురుతోంది. సాయిబాబా పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకొని బహిరంగ చర్చకు రావాలని హైదరాబాద్ సాయి భక్త సమాజం స్వామికి సవాల్ విసిరింది. రేపు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరగబోయే సాయి భక్తుల సమ్మేళనానికి రావాలని అక్కడ ఈ విషయం పై చర్చించుకుందామని హైదరాబాద్ సాయిభక్త సమాజం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. -
మీరు భయపెడితే.. భయపడం
బెదిరిపోవడానికి మేం ప్రభుత్వ ఉద్యోగులమేం కాదు * సీఎం స్పందించే వరకూ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ * తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెప్పే సేవలు నిలిపివేశాం * రూ.250 కోట్లు విడుదల చేసినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం * పాత ప్యాకేజీ ధరలను రివైజ్ చేయాలి.. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సిద్ధమే * ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్: ప్రభుత్వం స్పందించి నేరుగా ముఖ్యమంత్రి తమను చర్చలకు పిలిచే వరకు ‘ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్’ సేవలను పునరుద్ధరించేది లేదని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తేల్చి చెప్పారు. తమకు ప్రభుత్వం రూ.250 కోట్లను విడుదల చేసినట్లు వస్తున్న కథనాలు అవాస్తమని, గత నెల 30 నుంచి నేటి వరకు తమ అకౌంట్లలో ఒక్క రుపాయి కూడా జమ కాలేదని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించకపోతే కొరడా ఝుళిపించాల్సి వస్తుందని జిల్లాల్లోని కో-ఆర్డినేటర్లు తమ ఆస్పత్రుల్లో సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, అయితే వారు భయపెడితే భయపడటానికి తాము ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులం కామని వివరించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్య మంత్రిని తప్పుదోవ పట్టిస్తోందని, ప్రభుత్వానికి ముందుగా సమాచారం ఇచ్చే తాము రాష్ట్రవ్యాప్తంగా సేవలను నిలుపుదల చేశామని పేర్కొన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్ సెంట్రల్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, ఇతర సభ్యులు రమేష్, సుధీర్, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, రవి, ఇంద్రసేనరెడ్డి, రవీందర్, శ్రీనివాస్, మూర్తి, నాగేందర్ తదితరులతో కలసి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ‘ఎంఓయూ’ పత్రాన్ని సరళీకృతం చేయాలని జూలైలో ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కోర్ కమిటీని ఏర్పాటు చేసిందని, అయితే ఈ కమిటీ నేటి వరకు ఒకే ఒక్కసారి సమావేశమైందని చెప్పారు. అయితే ఎంఓయూకు సంబంధించిన రీడ్రాఫ్ట్ను ఇప్పటి వరకూ ప్రభుత్వానికి సమర్పించలేదన్నారు. 2009లో నిర్థారించిన ప్యాకేజీ ధరలకే ఇప్పుడు కూడా తాము ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా ప్యాకేజీ రేట్లను రివైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రూపాయి కూడా జమ కాలేదు.. బకాయిలు చెల్లించాలని ఫిబ్రవరి నుంచి ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని, స్పందించకపోవడం వల్లే సేవలను నిలుపుదల చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వైద్య తమను ఈ నెల 1న పిలిచి రూ.100 కోట్లు అకౌంట్లలో వేశామని, రేపటి కల్లా(2వ తేదీ) రూ.150 కోట్లు జమ అవుతాయని చెప్పారన్నారు. ఆయన చెప్పినప్పటికీ తమ అకౌంట్లలో ఒక్క రూపాయి కూడా జమ కాలేదన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ సేవలను పటిష్టం చేయాలని సీఎం కేసీఆర్ చూస్తుంటే.. ఆయనకు ట్రస్టు నిర్వాహకులు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా సీఎం స్పందించి తమను చర్చలకు పిలిస్తే వెళ్తామని, ఆయనతో సమావేశంలో ఇంకా ఎన్నో విషయాలు బయటకొస్తాయని విజయ్‌చందర్‌రెడ్డి చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలను నిలుపుదల చేసి ఆరు రోజులు కావొస్తుండగా, నెట్వర్క్(కార్పొరేట్) హాస్పిటల్స్ కూడా గురువారం సాయంత్రం నుంచి సేవలను నిలుపుదల చేస్తున్నట్లు తమకు తెలిపిందని విజయ్‌చందర్‌రెడ్డి అన్నా రు. ఇప్పటికై నా ప్రభుత్వం దిగి రాకపోతే పేదలు ఎన్నో సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. -
భూమికి అతి సమీపంలోకి అంగారక గ్రహం
2016 మే 30న అరుదైన సంఘటన {పయోగాలు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ప్లానెటరీ సొసైటీ ఇండియా {పతినిధుల వెల్లడి కవాడిగూడ: వచ్చే ఏడాది మే 30న అంగారక గ్రహం భూమికి అతి సమీపంలోకి రాబోతోందని ప్లానెటరీ సొసైటీ ఇండియా ఫౌండర్ కార్యదర్శి ఎన్.రఘునందన్ కుమార్ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్సీఐ, డీఆర్డీవో సైంటిస్టు శ్రీనివాస శాస్త్రి, ఉస్మానియా విశ్వ విద్యాలయం ఎమిరిటస్ హెచ్ఓడీ ప్రొఫెసర్ జి.రామ్‌దాస్, ఐసీఎస్ఎస్ మాజీ ఛైర్మన్ కేకే రావులతో కలిసి ఆయన మాట్లాడారు. 2016 మే 22న భూమి, సూర్యుడు, అంగారకుడు ఒకే సరళ రేఖపైకి వస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో అంగారకుడు అత్యంత కాంతివంతంగా కన్పిస్తాడని, ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. అంగారకుడు మే 22వ తేదీ కంటే తిరుగు ప్రయాణంలో 30వ తేదీన మరింత దగ్గర కానున్నట్లు తెలిపారు. బుధవారం భూమికి అంగారక గ్రహం 378 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటే వచ్చే ఏడాది మే 30వ తేదీకి 75.28 మిలియన్ కిలోమీటర్ల సమీపంలోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఏడాది పాటు విద్యా సంస్థల్లో గ్రహాల స్థితిగతులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మన పేర్లను పంపొచ్చు... అంగారక గ్రహంపైకి మనం వెళ్లకపోయినా మన పేర్లను మాత్రం పంపవచ్చని ప్లానెటరీ సొసైటీ ఇండియా కార్యదర్శి రఘునందన్‌కుమార్ తెలిపారు. ఇందుకు ఠీఠీఠీ.ౌఠటఞ్చ్ఛ్టట.జీజౌ వెబ్సైట్లో, ఫేస్బుక్లో నమోదు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 93475 11132 నంబర్లో సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాల పోస్టర్‌ను అవిష్కరించారు. -
నిరుద్యోగులకు భరోసా కల్పించాలి: జస్టిస్ చంద్రకుమార్
బషీర్‌బాగ్: కోటి ఆశలతో ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. నిరుద్యోగ నిర్మూలన, ఉపాధి కల్పనకు సమగ్రమైన యువజన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వ్యవసాయరంగం నిస్సహాయ స్థితిలో ఉన్న కారణంగా, నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. విద్య, వైద్య, విద్యుత్ రంగాల్లో ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. సామాజిక ప్రయోజనం లేకుండా వేల ఎకరాలు సెజ్‌లకు ఇచ్చిన ప్రభుత్వాలు వ్యవసాయరంగాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు లేవని, యూనివర్సిటీల్లో సౌకర్యాలు కరువయ్యాయన్నారు. నిరుద్యోగిత కారణంగా యువత పెడతోవ పడుతున్నారన్నారు. బహుళజాతి పరిశ్రమల్లో ఉద్యోగ వనరులు చూపిన వారికే ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని సూచించారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఉపాధి కల్పనను నిర్లక్ష్యం చేశాయని, పారిశ్రామిక కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ను నిర్వీర్యం చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మూతపడ్డ పరిశ్రమలు తెరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గురజాల రవీందర్, మల్లేపల్లి లక్ష్మయ్య, తిప్పర్తి యాదయ్య, డాక్టర్ చీమ శ్రీనువాసరావు, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి అంటే బోనాలు ఒక్కటే కాదు
కంచె ఐలయ్య బషీర్‌బాగ్: తెలంగాణ వచ్చేందుకు ఎన్ని రకాల పోరాటాలు చేశారో ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుంటే అన్ని పోరాటాలు చేయాలని ప్రముఖ సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య పేర్కొన్నారు. అభివృద్ధి అంటే బోనాలు చేయడం కాదని పరోక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బహుజన యునెటైడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ర్ట మొదటి మహాసభ నిర్వహించారు. ముఖ్య వక్తగా హాజరైన ఐలయ్య మాట్లాడుతూ.. శిశువు తల్లి కడుపులో పడ్డ నాటి నుంచి ఆ బిడ్డ పెరుగుదల, తల్లి ఆరోగ్య విషయం ప్రభుత్వాలే చూడాలన్నారు. ఏటా సబ్‌ప్లాన్ నిధులు ఎస్సీలకు 6 కోట్లు, ఎస్టీలకు 10 కోట్లు ఖర్చు చేయాలని, వాటిని ప్రతి గర్భిణిపై కొంత ఖర్చు పెడితే దళితుల్లో శిశు మరణాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి నెలా రూ.3 వేలు వారికి అందేలా చూడాలని ఆంధ్ర,తెలంగాణ ప్రభుత్వాలను కోరారు. సంచార జాతులు స్థిరంగా ఉండేందుకు స్థలం కేటాయించాలని, దళితులకు మూడెకరాల భూమి, రెండు గదులతో ఇల్లు తెలంగాణ ప్రభుత్వం రెండు నెలల్లో ఇవ్వకుంటే స్త్రీలు చీపురు కట్టలు, చెప్పులతో టీఆర్ఎస్ భవన్‌కు ర్యాలీ తీయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు జె.బి.రాజు మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించే జీవో చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణ ఏజెన్సీలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూ పట్టాలు ఇవ్వాలన్నారు. ఇస్లావత్ నామా నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో గొల్లపల్లి దయానంద్, దళిత నాయకులు ఏవీ పటేల్, బహుజన యునెటైడ్ ఫ్రంట్ ఉపాధ్యక్షురాలు స్వర్ణగౌడ్, జిల్లాల నుంచి వచ్చిన మహిళలు పాల్గొన్నారు. -
విశాలాంధ్ర మహాసభ ప్రెస్మీట్లో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై రెండు విడతలుగా బస్సు యాత్ర నిర్వహించి ప్రజల మనోభావాలను తెలుసుకున్నామని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు బుధవారం సోమాజీగూడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. సీమాంధ్రలోని అన్ని ప్రాంతాల ప్రజలు సమైక్యవాదాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కిరణ్ సర్కార్ అనుమతిస్తే తెలంగాణ ప్రాంతంలో కూడా బస్సు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొందని, దానికి రాజకీయ పార్టీలే కారణమని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ఆరోపించారు. అయితే విశాలాంధ్ర మహాసభ ప్రతినిధుల వ్యాఖ్యలను ఆ సమావేశంలో తెలంగాణ జర్నలిస్టులు వ్యతిరేకించారు. దాంతో ఇరువర్గాల వారు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దాంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజన వల్ల రెండు ప్రాంతాలుగా విడిపోతే తెలుగు ప్రజలంతా తీవ్ర అన్యాయానికి గురవుతారని విశాలాంధ్ర మహాసభ మొదటి నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అందులోభాగంగా ఆ మహాసభ ఆధ్వర్యంలో సీమాంధ్రలో బస్సు యాత్ర నిర్వహించి ప్రజల మనోభావాలను తెలుసుకుంది.