సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్వామి స్వరూపానంద వివాదం రోజురోజుకు ముదురుతోంది.
హైదరాబాద్: సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్వామి స్వరూపానంద వివాదం రోజురోజుకు ముదురుతోంది. సాయిబాబా పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకొని బహిరంగ చర్చకు రావాలని హైదరాబాద్ సాయి భక్త సమాజం స్వామికి సవాల్ విసిరింది.
రేపు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరగబోయే సాయి భక్తుల సమ్మేళనానికి రావాలని అక్కడ ఈ విషయం పై చర్చించుకుందామని హైదరాబాద్ సాయిభక్త సమాజం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.