Swaroopananda
-
జలవిహార్‌లో ఘనంగా గురువందనం
-
జలవిహార్‌లో ఘనంగా గురువందనం
సాక్షి, హైదరాబాద్ : స్వామి స్వాత్మానందేంద్ర శారదాపీఠం ఉత్తరాధికారిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వారితో కలిసి హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జలవిహార్‌లో గురువందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు స్పీకర్, మంత్రులు కూడా హాజరయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో శారదాపీఠానికి కేటాయించిన భూమి పత్రాలను కేసీఆర్ స్వరూపానందేంద్ర స్వామికి అందజేశారు. కార్యక్రమంలోభాగంగా స్వాత్మానందేంద్ర, స్వరూపానందేంద్ర స్వాములకు పుష్పాభిషేకం చేశారు. -
'బహిరంగ చర్చకు రండి’
హైదరాబాద్: సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్వామి స్వరూపానంద వివాదం రోజురోజుకు ముదురుతోంది. సాయిబాబా పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకొని బహిరంగ చర్చకు రావాలని హైదరాబాద్ సాయి భక్త సమాజం స్వామికి సవాల్ విసిరింది. రేపు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరగబోయే సాయి భక్తుల సమ్మేళనానికి రావాలని అక్కడ ఈ విషయం పై చర్చించుకుందామని హైదరాబాద్ సాయిభక్త సమాజం ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. -
షిర్డీ సాయిపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
వారణాసి: ద్వారకాపీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా ముస్లిం అనీ, ఆయన గొడ్డు మాంసం తినేవారంటూ ఆయన నిన్న ద్వారకాపీఠంలో వ్యాఖ్యానించారు. సబ్ కామాలిక్ అన్న మాటలు సాయిబాబా చెప్పినవి కావని... అది గురు నానక్ సూక్తి అని శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి గుర్తు చేశారు. అంతేకాకుండా హిందూ దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలు పెట్టడాన్ని ప్రభుత్వాలు అడ్డుకోవాలని సూచించారు. సాయిబాబా ట్రస్ట్ ప్రజల్ని వెర్రివాళ్ళను చేస్తోందని ఆయన మండిపడ్డారు. ట్రస్ట్ పేరుతో వివిధ బ్యాంకుల్లో మూలుగుతన్న కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకోవాలని స్వరూపానంద డిమాండ్ చేశారు. ఆగ్రాలోని తాజ్ మహల్, అజ్మీర్ దర్గాల్లోని శివలింగాన్ని ధ్వంసం చేసి ముస్లిం పాలకులు సమాధులు కట్టారని ఆయన ఆరోపించారు. గతంలోనూ స్వామి స్వరూపానంద సరస్వతి ... ఇదే అంశంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.