షిర్డీ సాయిపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
వారణాసి: ద్వారకాపీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా ముస్లిం అనీ, ఆయన గొడ్డు మాంసం తినేవారంటూ ఆయన నిన్న ద్వారకాపీఠంలో వ్యాఖ్యానించారు. సబ్ కామాలిక్ అన్న మాటలు సాయిబాబా చెప్పినవి కావని... అది గురు నానక్ సూక్తి అని శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి గుర్తు చేశారు.
అంతేకాకుండా హిందూ దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలు పెట్టడాన్ని ప్రభుత్వాలు అడ్డుకోవాలని సూచించారు. సాయిబాబా ట్రస్ట్ ప్రజల్ని వెర్రివాళ్ళను చేస్తోందని ఆయన మండిపడ్డారు. ట్రస్ట్ పేరుతో వివిధ బ్యాంకుల్లో మూలుగుతన్న కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకోవాలని స్వరూపానంద డిమాండ్ చేశారు. ఆగ్రాలోని తాజ్ మహల్, అజ్మీర్ దర్గాల్లోని శివలింగాన్ని ధ్వంసం చేసి ముస్లిం పాలకులు సమాధులు కట్టారని ఆయన ఆరోపించారు. గతంలోనూ స్వామి స్వరూపానంద సరస్వతి ... ఇదే అంశంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.